twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదుగో మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Adhugo Movie Review అదుగో సినిమా రివ్యూ

    Rating:
    1.0/5
    Star Cast: రవిబాబు, నభా నటేష్, అభిషేక్ వర్మ
    Director: రవిబాబు

    ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈగ తీసి మెప్పించాడు. పందితో సినిమా తీసి మెప్పిస్తాననే ధైర్యంతో రవిబాబు అదుగో చిత్రాన్ని రూపొందించి ఉంటారేమో. పంది ప్రధాన అంశంగా సినిమా అనగానే టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. టెక్నికల్‌ గాను, కథపరంగా బాగా కసరత్తు చేసే పేరున్న రవిబాబు సినిమా అంటే ఏదో ఒక ఆసక్తికరమైన విషయం ఉంటుందనే ధీమా ఉంటుంది. అలాంటి ధీమా అదుగో ప్రేక్షకులకు కల్పించిందా? తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని రవిబాబు నిలబెట్టుకొన్నారా అనే విషయాన్నితెలుసుకోవాలంటే.. నవంబర్ 7న విడుదలైన అదుగో సినిమా గురించి తెలుసుకోవాల్సిందే.

    అదుగో మూవీ స్టోరీ

    అదుగో మూవీ స్టోరీ

    ఆహారం కోసం రోడ్డు దాటే చిన్న పందిపిల్లకు తల్లి పందిపిల్ల జాగ్రత్తలు చెబుతుంది. చెప్పిన మాట వినకుండా రోడ్డుదాటితే ఓ పందిపిల్లకు జరిగిన సంఘటనను చెబుతుంది. అయినా నేను వెళ్తాను అనే మొండికేసిన పిల్లకు చెప్పిన కథతో అదుగో సినిమా మొదలవుతుంది. అభిషేక్, నభా నటాషా ప్రేమికులు. జీవితం, కెరీర్‌ మీద ఏ మాత్రం శ్రద్దలేని ప్రేమికుడితో నభా నటాషా తంటాలు పడుతుంది. అదే సమయంలో ఓ అబ్బాయి పెంచుకొనే పందిపిల్ల కిడ్నాప్ గురవుతుంది.

    కథలో మలుపులు

    కథలో మలుపులు

    ఇలాంటి సందర్భంలో అల్లారుముద్దుగా పెంచుకొనే తన కుక్క పిల్లను చూసుకోమని చెప్పి అభిషేక్ అప్పగిస్తే.. తన స్నేహితులు చేసిన నిర్వాకం వల్ల చనిపోతుంది. దాని స్థానంలో పెంపుడు కుక్క పిల్లను కొని తన ప్రియురాలికి అప్పగించే క్రమంలో కొరియర్‌లో కుక్క పిల్లకు బదులు పందిపిల్ల నటాషాకు చేరుతుంది. అదే పందిపిల్ల కోసం ఇద్దరు మాఫియా డాన్లు కొట్టుకొంటుంటారు. అదే సమయంలో మరో డాన్ రవిబాబు ఎంటర్ అవుతాడు.

    చిక్కులు ముడులు సమాధానం

    చిక్కులు ముడులు సమాధానం

    తన ప్రియురాలికి పెంపుడు కుక్కను అప్పగించి తన ప్రేమను గెలుచుకొన్నాడా? ఇద్దరు మాఫియా డాన్లకు మూడు మచ్చలున్న పందిపిల్ల ఎందుకు కావాల్సి వచ్చింది. అదే పందిపిల్ల కోసం రవిబాబు, అతడి ముఠా ఎందుకు వెంటాడుతుంది. తాను ఇష్టంగా పెంచుకొనే పందిపిల్లను అబ్బాయి దక్కించుకొన్నాడా? ఇలాంటి చిక్కు ప్రశ్నలకు సమాధానమే అదుగో.

    ఫస్టాఫ్‌ విశ్లేషణ

    ఫస్టాఫ్‌ విశ్లేషణ

    తొలి భాగంలో కిడ్నాప్ గురైన ఓ పంది పిల్ల కథను మరో పంది తన కూతురుకు చెప్పే ఎపిసోడ్ మూల కథ ప్రారంభమవుతుంది. ఆ ప్రాసెస్‌లోనే ఓ అబ్బాయి కథ, మరో ప్రేమికులు, ఇద్దరు ముగ్గురు డాన్లు. ఇతర క్యారెక్టర్లు ప్రవేశిస్తాయి. అనేక రకాల సబ్ ప్లాట్స్ సినిమాను, ప్రేక్షకుడిని కంగారు పెట్టిస్తాయి. అసలు కథేంటో అర్ధం కాని పరిస్థితితో గందరగోళం నెలకొంటుంది. రకరకాల క్యారెక్టర్లు అంతా గజిబిజి చేసేశాయి.

    సెకండాఫ్‌ అనాలిసిస్

    సెకండాఫ్‌ అనాలిసిస్

    ఇక రెండో భాగంలోనూ ఇదే కంగాళీ. అర్థం పర్థం లేని పాత్రల చిత్రీకరణ. ఎక్కడో 80లో కూడా తీయని కథ, కథనాలు ప్రతీ క్షణం ప్రేక్షకుడి సహనానికి అద్దం పట్టేలా ఉంటాయి. రకరకాల ట్విస్టులతో దర్శకుడు హోరెత్తించడం తప్పా మరో ప్రయోజనం కనిపించదు. చివరికి ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపించదు. తెలుగు సినిమా ప్రమాణాలకు దూరంగా, ప్రేక్షకుల అభిరుచికి భిన్నంగా సాగుతూ అదుగో ముగుస్తుంది.

    రవిబాబు దర్శకత్వ ప్రతిభ

    రవిబాబు దర్శకత్వ ప్రతిభ

    దర్శకుడు రవిబాబు ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో అతిదారుణమైన సబ్జెక్ట్ ఇదే అనుకోవచ్చేమో. గతంలో అనసూయ, అవును లాంటి సినిమాలు ఆయనలో మంచి టెక్నిషియన్ ఉందనే భరోసాను కల్పించేవి. ఈ సినిమాలో డైరెక్టర్‌గా ఏ కోణంలోనూ ఆకట్టుకోలేకపోయాడు. అతడి దర్శకత్వ ప్రతిభ గురించి ఇంతకంటే పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేవనే చెప్పాలి.

     పాత్రల గురించి

    పాత్రల గురించి

    ఇక నభా నటేష్, అభిషేక్ వర్మలవి పూర్తిస్థాయిలో పండని పాత్రలే. రవిబాబుతోపాటు మరో ఇద్దరు విలన్ల పాత్రలు అంతంతా మాత్రంగానే ఉంటాయి. కామెడీగానో లేదా సీరియస్‌గానో లేకపోవడం సినిమాకు ప్రధానమైన లోపం. ఇలాంటి నాసిరకమైన పాత్రలను బాగానే తీర్చి దిద్దారు. దివంగత విజయ సాయి పాత్ర కూడా ఎందుకు పనిరానిదానే కనిపిస్తుంది.

     మ్యూజిక్, ఇతర విభాగాలు

    మ్యూజిక్, ఇతర విభాగాలు

    మెంటల్ మదిలో ఫేం ప్రశాంత్ విహారీ మ్యూజిక్ కూడా నాసిరకంగా ఉంది. పాటలు ఆకట్టుకోలేకపోయాయి. రీరికార్డింగ్‌లో శబ్ద కాలుష్యం తప్ప మరోటి వినిపించదు. ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. ఓవరాల్‌గా అటు సాంకేతికంగానూ, నటన, కథ, కథనాల పరంగా కూడా ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉందనే చెప్పవచ్చు.

     సురేష్ ప్రొడక్షన్ గురించి

    సురేష్ ప్రొడక్షన్ గురించి

    సాధారణంగా దివంగత రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్ అంటే టాలీవుడ్‌లో చెప్పలేనంత ప్రతిష్ట ఉంది. వారు నిర్మించిన చిత్రాలు చరిత్రలో నిలిచిపోయాయి. అలాంటి బ్యానర్‌ ప్రమాణాలకు ఏ మాత్రం సరిపోని విధంగా అదుగో రూపొందింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా నిల్. ఏదో చాప చుట్టేసినట్టు తెరకెక్కించిన ఫీలింగ్.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    పందిపిల్ల స్టోరీతో కథ, కథనం, నటీనటుల ఎంపికలో అర్ధంపర్థం లేకుండా దర్శక నటుడు రవిబాబు రూపొందించిన చిత్రం అదుగో. ఏ ఒక్క సీన్‌లో కూడా పసలేకుండా విసిగించిన సినిమా. సినీ ప్రమాణాలకు, ప్రేక్షకుల అభిరుచికి ఆమడ దూరంలో ఉన్న చిత్రంగా అదుగో రూపొందింది. బాహుబలి లాంటి అద్భుతమైన కాన్సెప్ట్‌లతో టాలీవుడ్‌ ప్రపంచస్థాయిని ఆకర్షిస్తున్న ఈ కాలంలో ఇలాంటి సినిమాను రూపొందించడం సమయం, డబ్బుపరంగా వృథానే అని గట్టిగా చెప్పవచ్చు.

     ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    చెప్పుకోవడానికి ఏమీ లేవు

    మైనస్ పాయింట్స్

    చెప్పుకోవడానికి లెక్కలేనన్ని..

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: రవిబాబు, పూర్ణ, నభా నటేష్, అభిషేక్ వర్మ
    దర్శకత్వం: రవిబాబు
    సంగీతం: ప్రశాంత్ విహారి
    నిర్మాత: డీ సురేష్ బాబు
    సినిమాటోగ్రఫి: సుధాకర్ రెడ్డి
    బ్యానర్: సురేష్ ప్రొడక్షన్
    రిలీజ్: 2018-11-07

    English summary
    Adhugo movie is comedy entertainer written and directed by Ravi Babu and produced by Suresh Productions banner while music scored by Prashanth Vihari. Ravi Babu playing the lead role along with animal Pig in important role in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X