twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐరా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: నయనతార, కళైయరసి, యోగిబాబు
    Director: సర్జున్

    గ్లామర్ తారగా కెరీర్ ఆరంభించిన నయనతార.. సోలో హీరోయిన్ అవతారం ఎత్తి డోరా, ఆరంభం, కోకిల, అంజలి ఐపీఎస్ లాంటి చిత్రాలతో లేడి సూపర్‌స్టార్‌గా మారారు. సోలో హీరోయిన్‌గా సినిమాలను ఎంచుకొంటూ బ్లాక్‌బస్టర్లను తన ఖాతాలో వేసుకొంటున్నారు. ఈ క్రమంలోనే ఐరా అనే చిత్రంలో మరోసారి సోలో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ద్విపాత్రాభినయంతో నయనతార నటించిన సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం మార్చి 28న విడుదలైంది. విడుదలకు ముందే టీజర్లు, ట్రైలర్లతో కేకపుట్టించిన నయనతారకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే.

    ఐరా స్టోరీ

    ఐరా స్టోరీ

    స్వతంత్ర భావాలు కలిగిన యమున (నయనతార) వెబ్ మీడియాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. దెయ్యాల గురించి పరిశోధన చేస్తున్న సమయంలో కొందరు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడుతారు. భవానీ (నయనతార) అనే ఆత్మ యమునను వెంటాడుతుంది. అంతేకాకుండా తన ప్రాణాలకు ముప్పు ఏర్పడుంది. ఈ క్రమంలో భవానికి ప్రియుడైన అభినవ్ (కళైరాసన్)‌ను నిలదీయడంతో అసలు కథ తెలుస్తుంది.

    స్టోరీలో ట్విస్టులు

    స్టోరీలో ట్విస్టులు

    భవానీ ఆత్మగా ఎందుకు మారింది? ఎలాంటి కోరికలు తీరుకుండానే భవానీ మరణించింది? భవానీ మరణానికి కారణం ఎవరు? అభినవ్‌తో భవానీ ప్రేమ పెళ్లిపీటల మీదకు చేరకపోవడానికి కారణాలు ఏమిటి? భవానీ కోరికలు తీర్చడానికి యమున ఎందుకు సిద్ధపడింది? భవానీ స్థానంలో యమున పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే అభినవ్ ఎందుకు తిరస్కరించారు? అభినవ్, యమున పెళ్లి చేసుకొన్నారా? అనే ప్రశ్నలకు సమాధానమే ఐరా కథ.

     ఫస్టాఫ్ ఎనాలిసిస్

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    జర్నలిస్టుగా యమున కోణంలో కథ మొదలవుతుంది. దెయ్యాలపై పరిశోధనల సాగిస్తూ తన అమ్మమ్మ ఊరికి వెళ్లిన యమునకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని ఛేదించే క్రమంలో యమున కథ తారసపడుతుంది. యోగిబాబు కామెడీని జోడించి కథను మరీ సాగదీయడం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. అభినవ్‌ను కథలోకి లాక్కొచ్చి ఓ ఆసక్తికరమైన పాయింట్‌తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

    సెకండాఫ్ ఎనాలిసిస్

    సెకండాఫ్ ఎనాలిసిస్

    ఇక రెండో భాగంలో యమున, భవానీ, అభినవ్ కథ మొదలువుతుంది. సెకండాఫ్‌లో అద్భుతమైన పాయింట్‌‌తో ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేయడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. నష్ట జాతకురాలిగా పాత్రలో అందవిహీనంగా నయనతార (భవానీ) తనదైన హావభావాలతో ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ప్రీ క్లైమాక్స్‌ ముందు కథలో వేగం పెరగడం, పాత్రల్లో ఎమోషనల్ కంటెంట్ బలంగా మారడంతో సినిమా ఆసక్తి పెరుగుతుంది. చివర్లో మంచి పాయింట్‌తో ముగించడం పాజిటివ్ అంశమని చెప్పవచ్చు.

    దర్శకుడు సర్జన్ గురించి

    దర్శకుడు సర్జన్ గురించి

    దర్శకుడు సర్జన్ కేయం ఎత్తుకొన్న పాయింట్‌ అద్భుతంగా అనిపిస్తుంది. కానీ దానిని సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం మైనస్ పాయింట్ అనిచెప్పవచ్చు. తొలిభాగంలో బలమైన సీన్లు రాసుకొని కథను నడిపించి ఉంటే అద్భుతమైన ఫీల్ గుడ్ చిత్రంగా అయ్యే అవకాశం ఉండేది. తొలిభాగాన్ని చాలా నీరసంగా నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో తన సత్తాను చాటుకొన్నాడు. అయితే అప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి ఆవిరి అయ్యే పరిస్థితి కారణంగా గొప్ప సినిమా చూశామనే ఫీలింగ్ అనిపించదు. భావోద్వేగంతో కూడిన బలమైన పాయింట్‌ను నాసిరకమైన పాత్రలు, స్క్రీన్ ప్లేతో కథను బలహీన పరిచాడు.

    నయనతార  అదుర్స్

    నయనతార అదుర్స్

    యమున, భవానీ పాత్రల్లో కనిపించిన నయనతార మరోసారి తన నటనతో అదరగొట్టారు. అందవిహీనమైన భవానీ పాత్రలో ఒదిగిపోయారు. సినిమా రెండో భాగంలో భావోద్వేగమైన ప్రదర్శించడంలో తన మార్కును చాటుకొన్నారు. యమున పాత్రలో గ్లామర్‌ను పండిస్తూనే ఎమోషనల్‌‌ రోల్‌లో విజృంభించారు. తన కెరీర్‌లో మరో మంచి పాత్రలో నయనతార ప్రేక్షకులను మెప్పించడం ఖాయం. బాల్యంలో భవానీ పాత్రలో కనిపించిన గ్యాబ్రిలా సెల్లస్ తన నటనతో ఆకట్టుకొన్నారు.

    ఇతర పాత్రల ప్రతిభ

    ఇతర పాత్రల ప్రతిభ

    సినిమా రెండో భాగంలో కళైయ‌ర‌సి నటన బాగుంది. విమర్శకులను సైతం మెప్పించేలా తన పాత్రలో కళైయ‌ర‌సి ఒదిగిపోయారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అతడి ఫెర్ఫార్మెన్స్ బాగుంది. మిగితా పాత్రాల్లో నయనతార తండ్రిగా జయప్రకాశ్‌ది అతిథి పాత్రే. యోగిబాబు పాత్ర పెద్దగా పండలేకపోయింది. యోగిబాబు కామెడీ ప్రేక్షకులను విసిగించేలా ఉంటుంది. ఇతర పాత్రలు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో మరుగున పడిపోయాయి.

     టెక్నికల్ విభాగం

    టెక్నికల్ విభాగం

    సాంకేతిక అంశాలలో సుదర్శన్ శ్రీనివాసన్ అందించిన సినిమాటోగ్రఫి ఐరాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. సుందరమూర్తి అందించిన సంగీతం ఆకట్టుకొనేలా ఉంది. ప్రధానంగా భావోద్వేగమైన సన్నివేశాలకు రీరికార్డింగ్ ప్రాణం పోసింది. ప్రీక్లైమాక్స్ నుంచి వచ్చే పాట ప్రేక్షకుడికి చక్కటి అనుభూతిని కలిగిస్తూ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడేలా ఉంది. నిర్మాత కేజే రాజేష్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    నయనతార నటనాప్రతిభ, బాడీలాగ్వేంజ్ తగినట్టుగా రూపొందిన చిత్రం ఐరా. బలమైన పాయింట్‌, ఎమోషనల్ కథను పేలవమైన స్క్రీన్ ప్లే దెబ్బ తీసింది. నాసిరకమైన పాత్రలు, కథనం సినిమాకు ప్రతికూలంగా మారాయి. సెకండాఫ్‌ ఈ సినిమాకు ప్రాణంగా మారింది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు, మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు చేరువైతే నయనతార కెరీర్‌లో మరో హిట్టు చేరినట్టే.

    బలం, బలహీనత

    బలం, బలహీనత

    ప్లస్ పాయింట్స్
    నయనతార
    కథ
    సినిమాటోగ్రఫి
    మ్యూజిక్, రీరికార్డింగ్

    మైనస్ పాయింట్స్
    ఎడిటింగ్
    కథనం
    కథను దర్శకుడు సరిగా నడిపించలేకపోవడం

     తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు:
    నయనతార, కళైయ‌ర‌సి, యోగిబాబు, మ‌నోబాలా, ఎం.ఎస్‌.భాస్క‌ర్‌, వంశీకృష్ణ‌, ప్ర‌వీణ్ రంగ‌నాథ‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, లీలావ‌తి, కృష్ణ అభిషేక్‌, ర‌వి ప్ర‌కాష్ త‌దిత‌రులు
    ద‌ర్శ‌క‌త్వం: స‌ర్జున్
    కెమెరా: సుద‌ర్శ‌న్ శ్రీనివాస‌న్‌,
    కూర్పు: కార్తిక్ జోగేష్‌,
    స్క్రీన్‌ప్లే: ప్రియాంక ర‌వీంద్ర‌న్‌
    సంగీతం: సుంద‌రమూర్తి. కె.ఎస్‌.

    English summary
    Airaa is a 2019 Indian Telugu horror film written and directed by Sarjun KM. The film stars #Nayanthara, Kalaiyarasan and Yogi Babu in the main lead roles. The film is produced by Kotapadi J Rajesh and Maheshwar Reddy under the production banner KJR Studios. This movie released on March 28th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X