»   » సిల్లీ విత్ స్లాప్ స్టిక్ ('సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌' రివ్యూ)

సిల్లీ విత్ స్లాప్ స్టిక్ ('సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

అక్షయ్ కుమార్ గతంలో సింగ్ ఈజ్ కింగ్ అంటూ వచ్చి నవ్వించి హిట్ కొట్టాడు. ప్రభుదేవా కూడా గతంలో రౌడీ రాధోడ్ అంటే అక్షయ్ తో నవ్వించి హిట్ కొట్టా్డు. దాంతో సింగ్ ఈజ్ కింగ్ క్యారక్టరైజేషన్ ని కొనసాగిస్తూ...ప్రభుదేవా కొత్త సినిమా చేస్తే బిజినెస్ అయిపోతుందని భావించినట్లున్నాడు. వెంటనే ఓ కొత్త అనుకుని ఓ పిచ్చి లేదా సిల్లీ కథను అనుకుని అల్లుకుంటూ అంటే జోకులు పేర్చుకుంటూ వెళ్లిపోయి సింగ్ ఈజ్ బ్లింగ్ అంటూ వచ్చేసాడు. అయితే కింగ్ వర్కవుట్ అయినట్లుగా బ్లింగ్ కు కామెడీ వర్కవుట్ కాలేదు. ఓ సిల్లీ..విసుగెత్తించే రొట్ట కామెడీగా ఈ సినిమా మారిపోయింది. ప్రభుదేవా...యాక్షన్ జాక్సన్ తరహాలోనే ఈ సినిమాకూడా దారితప్పింది. ముఖ్యంగా దర్శకుడు స్లాప్ స్టి్క్ మీద పెట్టిన శ్రద్ద సినిమా కథ,కథనం మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది.

రఫ్తార్‌ సింగ్(అక్షయ్ కుమార్ ) పంజాబ్‌లో ఓ పల్లెటూరు అతనిది. ఎప్పుడూ ఫ్రెండ్స్ తో అవారాగా తిరిగే అతనకి ఓ తింగరి గుణం ఉంటుంది. అది ఏ పని అయినా మొదలు పెట్టినంత ఉత్సాహంగా పూర్తి చేయకుండా సగంలో వదిలేయటం. కాకపోతే అతను తమ మంచిమనస్సు ఉన్న కుర్రాడు కాబట్టి చివరకు మంచే జరుగుతూంటుంది. ఒ రోజు అతని తింగరి చేష్టలు చూసి విసుగెత్తిన అతని తండ్రి(యోగరాజ్ సింగ్) అతనికి రెండు ఆప్షన్స్ ఇస్తాడు. గోవా వెళ్ళి ఉద్యోగంలో చేరి సెటిల్ అవుతావా లేక..ఓవర్ వెయిట్ ఉన్న స్వీటీని పెళ్లి చేసుకుంటావా అని... అప్పుడు రప్తార్ గోవా వెళ్లటమే బెస్ట్ అని అక్కడకి వెళ్తాడు.

ఉద్యోగం లో చేరాక ఓ రోజు మా బాస్‌ ఎయిర్‌పోర్ట్‌కెళ్లి సారా (అమీ జాక్సన్) అనే అమ్మాయిని పికప్‌ చేసుకోమన్నాడు. తర్వాత ఆమెకు సెక్యూరిటీగా మనవాడ్ని పెట్టారు. ఆ క్రమంలో మన రప్తూర్ ఆమెతో ప్రేమలో పడ్డాడు.

మరో ప్రక్క రొమేనియా లో మార్క్ (కేకే మీనన్ ) ఓ అండర్ వరల్డ్ డాన్ ఉంటాడు. అతనికి సారా(అమీ జాక్సన్) ని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. సారా మరో డాన్ కుమార్తె. త్వరలో అతను పెళ్లి చేసుకోవటానికి సిద్దపడతాడు. అ అది సారా వాళ్ల నాన్న కుదిర్చిన సంబంధం. మరి రప్తార్ హీరో కదా వాణ్ని అలా వదిలేస్తాడా ... ఏం చేశాడంటారా... 'సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌' చూసి తెలుసుకోండి. అలాగే ఈ సినిమాలో లారాదత్తా పాత్ర ఏమిటన్నది కూడా సినిమా చూస్తేనే అర్దమవుతుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Akshay Kumar's Singh is Bliing review

ఇదంతా చదివాక..ఏముంది కొత్తదనం ఈ కథలో అనిపించవచ్చు. అయితే మీకు కొత్తదనం కోసం నేను సినిమా తీయలేదు..కేవలం నవ్వించటానికే సినిమా తీసాను అని ప్రభుదేవా చెప్పటానికే తీసాడని మనకు ఖచ్చితంగా సమాధానం వస్తుంది. అయితే కొన్ని పాత జోకులు పేలకుండా అలాగే మురిగిపోగా,మరికొన్ని ఇదీ జోకు అని చెప్తే కానీ నవ్వు రాదేమో అన్నట్లు ఫ్లాట్ గా ఉండిపోయాయి. అవి ఎప్పుడైనా పేలవచ్చు అనేది దర్శక,నిర్మాతలు ఆలోచన కావచ్చు. అక్షయ్ కుమార్ వంటి మంచి కామిక్ సెన్స్ ఉన్న హీరోని ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో చూస్తూంటే జాలి వేస్తుంది. అతను డైలాగులు చెప్పేటప్పుడు అయితే మిగతా డైలాగులు సరదా సమస్యా పూరణంలా మీరు చెప్పేయగలిగేటంత ఈజీగా,ప్రెడిక్టుబుల్ గా ఉంటాయి. అయితే ఈ సినిమాని చివరి వరకూ చూడగలిగారు అంటే అది అక్షయ్ ప్రతిభే అని నిశ్సందేహంగా చెప్పవచ్చు.

ఇక అమీ జాక్సన్ అయితే కేవలం బికినీ వేసుకోవటానికే ఆమెకు రెమ్యునేషన్ ఇచ్చినట్లు ఫీలై చేసినట్లు అనిపిస్తుంది. కేకే మీనన్, లారా దత్తా గురించి అయితే మాట్లాడుకుండా ఉండటమే బెస్ట్. ఓవర్ యాక్టింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ అనిపిస్తుంది.

బాగున్నవి ఏంటంటే...

లారా, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ మధ్య వచ్చే సన్నివేశాలే బాగున్నాయి. అమీ జాక్సన్ మాట్లాడే ఇంగ్లీష్ ని అక్షయ్ కు ట్రాన్స్ లేట్ చేసి హిందీలో చెప్పటము, దానకి అక్షయ్ కుమార్ ఇచ్చే కామెడీ పంచ్ లు సినిమాలు హైలెట్ అని చెప్పాలి. అక్షయ్,లారా మధ్య మంచి కామెడీ టైమింగ్ కుదిరింది. ఆ డైలాగులు చాలా బాగున్నాయి. అలాగే సన్నిలియోన్ గెస్ట్ ఎప్పీరియన్స్ కూడా బాగుంది. పాటలన్ని రిచ్ గా లావిష్ గా తీసారు.

Akshay Kumar's Singh is Bliing review

అసలు బాగోనిది

సినిమాలో అసలు బాగోలేని పార్ట్ ఏదైనా ఉందీ అంటే అది ప్రభుదేవా ఉన్న సీన్సే. అతని టాయిలెట్ కామెడీ వెగటు పుడుతుంది. మరీ దిగిజారిపోయి చేసినట్లు అనిపిస్తుంది.

ఫైనల్ గా ప్రభుదేవా నుంచి ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా వెళ్లి చూస్తే ఓకే అనిపించవచ్చు. అలాగే అక్షయ్ కుమార్ వంటి స్టార్ నుంచి సింగ్ ఈజ్ కింగ్ వంటి సినిమా మళ్లీ చూడబోతున్నాం అని వెళితే మాత్రం దారుణంగా దెబ్బతింటారు. ముఖ్యంగా బుర్ర ఇంటి వద్ద వదిలేసి వెళితే ఈ సినిమాని ఎంజాయ్ చేయవచ్చు.

సంస్ద: పెన్‌ ఇండియా ప్రైవైట్‌ లిమిటెడ్‌, గ్రేజింగ్‌ గోట్‌ ప్రొడక్షన్స్‌
నటీనటులు: అక్షయ్ కుమార్, ప్రభుదేవా, ఎమీ జాక్సన్‌ , కేకే మీనన్, లారా దత్తా, వివేక్‌ ఒబేరారు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సంగీతం: మీట్ బ్రదర్శర్స్ అంజన్, మంజ్ ముజిక్,సాజిద్ -వాజిద్
ఛాయాగ్రహణం: డూడ్లే
ఎడిటర్: స్టీవెన్ బెర్నాండ్
నిర్మాత: అక్షయ్ కుమార్, అర్షద్ వార్శీ
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభుదేవా.
విడుదల తేదీ: 2 అక్టోబర్ 2015.

English summary
Akshay's Singh is Bliing starring Amy Jackson and Lara Dutta. Released today (2nd October) With divide talk.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu