»   » పాత దెయ్యిం...మేమేం నవ్వం? (‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’రివ్యూ)

పాత దెయ్యిం...మేమేం నవ్వం? (‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

కామెడీ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ అల్లరి నరేష్ కొత్త సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. కామెడీకు ఉన్న విలువ అది. అయితే కామెడీ పేరుతో కక్కు వచ్చే కథలు చేస్తేనే భయపడిపోతారు. అదే కొత్త కాలంగా అల్లరి నరేష్ అనుసరిస్తున్న ఫార్ములా.

వరసపెట్టి వస్తున్న ఫ్లాఫ్ లకు బ్రేక్ వేయాలని , ట్రెండ్ పట్టుకుని దున్నేయాలని హర్రర్ కామెడీ జానర్ ని ఎన్నుకున్నాడు. దానికి తోడు తనకు రెండు హిట్స్ ఇచ్చిన దర్శకుడు జి నాగేశ్వరరెడ్డిని తోడు తెచ్చుకున్నాడు. నవ్విస్తానంటూ హామీ ఇస్తున్నాడు.గతంలో జి. నాగేశ్వర్ రెడ్డి, నరేష్ కాంబినేషన్లో వచ్చిన 'సీమ శాస్త్రి, సీమ టపాకాయ్' చిత్రాలు మంచి విజయాలుగా నిలవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందో లేదా.... ఈ దెయ్యం కామెడీ కథ..నవ్వులు పాలైందా..నవ్వించిందా, అసలు కథేంటి అనేది రివ్యూలో చూద్దాం.


దెయ్యం ఉన్న సంగతి

దెయ్యం ఉన్న సంగతి

ఓ పెద్ద భవంతి..అందులో కాపురం పెట్టిన ఓ దెయ్యం. ఆ భవంతి గురించి తెలియని రాజేంద్రప్రసాద్ దాన్ని కొనేస్తాడు. కొంతకాలం మామూలుగా గడిచినా రోజు తన ఇంట్లో దెయ్యం ఉందని రాజేంద్రప్రసాద్ కి తెలిసిపోతుంది.


బ్యాండ్ మేళం నడుపుతూ..

బ్యాండ్ మేళం నడుపుతూ..

మరో ప్రక్క బ్యాండ్ మేళం నడుపుతూంటాడు నరేష్ (అల్లరి నరేష్). అతనికో లవర్ ఇందుమతి (కృతిక జయకుమార్). అనుకోకుండా నరేష్ అప్పుల్లో ఇరుక్కుంటాడు. ఆ అప్పు తీర్చేందుకు డ‌బ్బు కోసం మార్గాలు అన్వేషిస్తూండగా అతనికో అవకాసం వస్తుంది.


డబ్బు కోసం కక్కుర్తితో

డబ్బు కోసం కక్కుర్తితో

ఓ రోజు ...దెయ్యం పెట్టే బాధలు పడలేక..రాజేంద్రప్రసాద్ ...వాటిని పాలత్రోలే ఓ భూత మాంత్రికుడుకి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ పొరపాటున నరేష్ కు కనెక్ట్ అయ్యి వచ్చేస్తాడు. అయితే ఆ విషయం ఆ ఇంటికి వచ్చేదాకా తెలియదు. వచ్చాక డబ్బు కు ఆశపడి తన వృత్తి కాకపోయినా దెయ్యాన్ని పాలదోలతానికి , దెయ్యాల తోలే మాంత్రికుడుని అని చెప్పి కమిటవతాడు. డబ్బు కోసం ఆ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని త‌రిమికొడ‌తాన‌ని 10 లక్షలకు కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు.


నకిలీ భూతవైద్యుడుకి నరకం

నకిలీ భూతవైద్యుడుకి నరకం

ఆ ఇంట్లో ఎంట్రీ ఇచ్చాక నరష్ అక్క‌డే ఇరుక్కుపోవాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. ఈ లోగా దెయ్యం...ఈ నకిలీ భూతవైద్యుడుతో ఆడుకోవటం మొదలెడుతుంది. ఈ లోగా దెయ్యానికి నరేష్ కు లింక్ ఉందని రివీల్ అవుతుంది.


నరేష్ ప్రేమించిన అమ్మాయికి...

నరేష్ ప్రేమించిన అమ్మాయికి...

అలాంటి క్లిష్టమైన పరిస్దితుల్లో న‌రేష్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ? దెయ్యానికి న‌రేష్ ప్రేమించిన అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి ? న‌రేష్ త‌న ప్రేమ‌ను ఎందుకు వ‌దులుకోవాల్సి వ‌చ్చింది ? చివ‌ర‌కు ఈ క‌థ ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగిసింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.


ఉన్నది ఈ కాస్త కొత్తే...

ఉన్నది ఈ కాస్త కొత్తే...

కథ ఎంత రొటీన్ గా ఉందో కథనం కూడా అంతే పాతగా ఉన్న ఈ సినిమాల ఏకైక హైలెట్ ఏమిటీ అంటే... ఆ దెయ్యం నరేష్‌ని పెళ్లి చేసుకుంటానని, అప్పుడే అక్కడ్నుంచి వెళతానని తేల్చి చెప్పటం. ఇదొక్కటే ఈ సినిమాలో నావెల్టీ పాయింట్.


ఇంటర్వెల్ కు ముందు బాగున్నా

ఇంటర్వెల్ కు ముందు బాగున్నా

ఈ సినిమా ఫస్టాఫ్ లో సీన్లు రొటీన్‌గా ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ బాగానే చేసి ఎంగేజ్ చేసారు. ముఖ్యంగా. రాజేంద్రప్రసాద్‌, నరేష్‌ ఇద్దరికీ విడివిడిగా దెయ్యంతో మొదటి సారి కలిసే సీన్లు నవ్విస్తాయి. అయితే సెకండాఫ్ కి వచ్చేసరికి కథలో పట్టు లేకుండా పోయింది. ప్రెడిక్టబులిటీ వచ్చేసింది. ముందు ఏం జరుగుతుందో తెలియటంతో ఇంట్రెస్ట్ పోయింది.


జాలి వేసింది

జాలి వేసింది

సాధారణంగా దెయ్యాలు భయపెడుతూంటే చాలా టెర్రిఫిక్ గా ఉంటాయి. అయితే ఈ సినిమాలో దెయ్యం చాలా మంది దెయ్యంలా ఉంది. పెళ్లి చేసుకోమని గోల తప్పిస్తే పెద్దగా భయపెట్టే కార్యక్రమాలు పెట్టుకోదు. అలాంటి దెయ్యాన్ని చూస్తూంటే భయం వెయ్యకపోగా జాలి వేస్తుంది. పాపం హీరో ..ఆ దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటే పోలా అనిపిస్తుంది.


విఫలమయ్యాడు

విఫలమయ్యాడు

ఇక ఈ చిత్రంలో కామెడీ ఉన్నా కూడా నాగేశ్వర్ రెడ్డి, నరేష్ ల కాంబినేషన్ లో వచ్చిన గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువనే చెప్పాలి. ఇక ప్రతి హర్రర్ సినిమాలానే ఈ చిత్ర క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉంది. కథ మధ్యలో ప్రేమ అనే పాయింటును సరిగ్గానే జొప్పించినా దాన్ని చివరి వరకూ తీసుకురావడం, దానికి మంచి ఫీల్ తో కూడిన ముగింపు ఇవ్వడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి.


అన్ని దెయ్యం కథల్లాగే..

అన్ని దెయ్యం కథల్లాగే..

కథలో కీలకమైన దెయ్యం ప్లాష్ బ్యాక్ కూడా చాలా రొటీన్ గా, బలహీనంగా ఉండటంతో ఆ పాత్రతో కనెక్టవడం కష్టమైంది. దెయ్యానికి రెండు లక్ష్యాలు ఏర్పడటంతో ఏ ఒక్కదానికీ నూటికి నూరు శాతం న్యాయం జరగక, క్లైమాక్స్ లో వెలితిగా అనిపించింది.


రాజేంద్రప్రసాద్ ఉన్నంతలో ..

రాజేంద్రప్రసాద్ ఉన్నంతలో ..

సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే వరస ఫ్లాఫ్ లుతో దూసుకుపోతున్న నరేష్ ఈ సినిమాలో కాస్త నవ్వుకోదగ్గ కామెడీనే చేసాడు. మొదటి నుండి చివరి వరకు నడిచే కామెడీ..అద్బుతం కాకపోయినా బాగానే నవ్వించింది. అతనికి తోడు షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ ల కామెడీ కూడా బాగానే వర్కవుటైంది. ఫస్టాఫ్ అంతా వీళ్ళ కామెడీతోనే సాగుతూ టైమ్ పాసైంది.


ఆకట్టుకుంది

ఆకట్టుకుంది

నరేష్, కృతిక జయ కుమార్ ల లవ్ ట్రాక్ ఓకే అన్నట్లు ఉన్నా... కృతిక జయకుమార్ సినిమాలో చాలా గ్లామర్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. దెయ్యం పాత్ర పోషించిన సెకండ్ హీరోయిన్ మౌర్యాని నటన కూడా ఆకట్టుకుంది.


వీరందరూ నటిస్తున్నారు

వీరందరూ నటిస్తున్నారు

అల్లరి నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


సాంకేతికంగా చూస్తే ...

సాంకేతికంగా చూస్తే ...

ఈ సినిమాటోగ్ర‌ఫీకి మంచి మార్కులు ప‌డ‌తాయి. సాయి కార్తీక్ మ్యూజిక్ కొన్ని పాట‌ల్లో బాగుంది. నేప‌థ్య సంగీతంలో త‌న టాలెంట్ చూపించాడు. క‌థ‌, క‌థ‌నాల కంటే డైమండ్ ర‌త్న‌బాబు డైలాగులే బాగానే కొన్ని చోట్ల పేలాయి. బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాణ విలువ‌ల‌కు ఎప్పుడూ వంక పెట్ట‌లేం కానీ మరీ లో బడ్జెట్ లో చుట్టేసారు. ఎడిటింగ్ ఓకే.


వీళ్లంతా కలిసే...

వీళ్లంతా కలిసే...

నటీ నటులు: అల్లరి నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
సంగీతం: సాయికార్తీక్‌,
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర,
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు,
మాటలు: డైమండ్‌ రత్నబాబు,
పాటలు: భాస్కరభట్ల,
డాన్స్‌: రాజుసుందరం, గణేష్‌, దినేష్‌,
ఫైట్స్‌: సుంకర రామ్‌,
ఆర్ట్‌: నారాయణరెడ్డి,
సమర్పణ: భోగవల్లి బాపినీడు,
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.ఈ దెయ్యం మరీ బోర్ కొట్టిస్తుంది....విసిగిస్తుంది. కామెడీ సినిమా కదా అని గుర్తు వచ్చినప్పుడు నవ్విస్తుంది..చాలా సార్లు నవ్వించటానికి ట్రై చేసి నవ్వులు పాలవుతుంది. ఇలాంటి సినిమాలు చూస్తే ...దెయ్యం సినిమాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా భయమేస్తుంది.

English summary
Allari Naresh gears up for his horror flick, Intlo Dayyam Nakem Bhayam .The Film released today with average talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu