For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సైకో ప్రేమ కథ...(ఆర్య-2 రివ్యూ)

  By Srikanya
  |

  Arya 2

  -జోశ్యుల సూర్య ప్రకాష్
  బ్యానర్: ఆదిత్యా ఆర్ట్స్
  నటీనటులు: అల్లు అర్జున్, నవదీప్, అజయ్, కాజల్, శ్రధ్దా ఆర్య, బ్రహ్మానందం,
  శ్రీనివాస రెడ్డి, ముఖేష్ రుషి, శాయీజీ షిండే తదితరులు
  కెమెరా: ఆర్.డి. రాజశేఖర్
  ఎడిటింగ్: మర్తాండ్ కె.వెంకటేష్
  సంగీతం: దేవిశ్రీ ప్రసాద్,
  సమర్పణ: బివియస్ యన్ ప్రసాద్
  నిర్మాత: ఆదిత్య బాబు
  కథ,మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: సుకుమార్
  రిలీజ్ తేది: నవంబర్ 27,2009

  ఆర్య లాంటి ప్రెండ్ వుంటే చాలు వేరే శత్రువులు అక్కర్లేదు...అనే చక్కని డైలాగుతో ప్రారంభమైన ఆర్య-2 నిజంగానే ప్రేక్షకుల పాలిట శత్రువుగా మారి సహన పరీక్షకు గురిచేసిందచి. ఎన్నాళ్ళగానో..సూపర్ హిట్ ఆర్య సీక్వెల్ అంటూ ఊరిస్తూ వచ్చిన ఆర్య-2 కథా లేమితో గొప్పగా రిలీజై చప్పగా మిగిలిపోయింది. దర్శకుడు సుకుమార్ తెలివి..అతి తెలివి గా మారి..హీరో పాత్ర కన్ఫూజై సినిమా గలీజైంది.అప్పటికీ అల్లు అర్జున్ తన ఎనర్జీతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేసాడు..కానీ కథ అతన్ని ముందుకు సాగనివ్వక ప్రతీ అడుగులోనూ, డైలాగులోనూ ముప్పు తిప్పలు పెట్టింది. అసలు ఫస్టాఫ్ చూసే సరికి హీరో ఏమన్నా సైకో నా అనే డౌట్ గ్యారింటీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత తన స్నేహం కోసం పెళ్ళి చేసుకున్న భార్యని దానం చేస్తానంటే అది కన్ఫర్మ్ అనిపిస్తుంది.(ఎందుకంటే ఇదేమీ కన్యాదానం తరహా స్టోరీ కాదు).ఈ లోగా ఫ్యాక్షన్ భూతం ఆవహించి,కిడ్నాప్ డ్రామాలు కలుపుకుని ఎటెటో వెళ్ళుతుంది. చివరకు ఇంటర్వెల్ కు బయిటకు వెళ్ళిన వారిని ధియోటర్ లోకి రాకూడదు అనిపించేలా చేస్తుంది.

  ఇక ఈ సీక్వెల్ లో కూడా ఆర్య(అల్లు అర్జున్) అనాధే. అతనికి అనాధాశ్రయంలో అజయ్(నవదీప్) పరిచయం అవుతాడు. అతన్ని తన స్నేహితుడుగా ఎంచుకున్న ఆర్య బలవంతంగా స్నేహితుడ్ని చేసుకుంటాడు. అంతేగాక ఎప్పుడూ అతన్నే కలవరిస్తూ అతని తోడే జీవితమన్నట్లు బ్రతుకుతూంటాడు(దీనికి రీజన్ వెతక్కండి..అది అంతే). అయితే అజయ్ కు మాత్రం ఆర్య అంటే స్నేహభావం ఉండదు. ఇలా డిఫెరెంట్ గా (గెటప్ కూడా డిఫెరెంట్ గానే ఉంటుంది) పెరిగి పెద్దయిన వీరి జీవితాల్లోకి గీత(కాజల్)ప్రవేశిస్తుంది. అప్పుడు మీరూహించినట్లే ఇద్దరూ ఆమెతో ప్రేమలో పడతారు. క్యాజువల్ గానే ఆర్య తన ట్రిక్ లతో ఆమెను ఆకట్టుకో చూస్తాడు. పనిలో పనిగా ఆమెతో చనువుగా మెలిగే వారిని ఏక్సిడెంట్ దారి తప్పిస్తూంటాడు. అయితే ఆర్య నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో గీత తాను అజయ్ ని ప్రేమిస్తున్నానని చెప్తుంది(ఇదేం ట్విస్టు అనకండి..లేకపోతే కథ కదలదు). ఈ లోగా ఈ మలుపు చాలదన్నట్లు గీత తండ్రి రాయలసీమ ఫ్యాక్షనిస్టు(ముఖేష్ రుషి)తన కూతురుని రైవల్ గ్రూప్ ఫ్యాక్షనిస్టు (సాయీజీ షిండే) కొడుకు సుబ్బారెడ్డి(అజయ్)తో మ్యారేజ్ ఫిక్స్ చేస్తాడు.గీతను తన గ్రామం తీసుకెళ్థాడు. అటువంటి పరిస్ధితుల్లో గీత పెళ్ళి చెడకొట్టమని...ఆర్య ని అజయ్ అడుగుతాడు..అటువంటి పరిస్దితుల్లో ఆర్య ఏం చేసాడు. గీత ఎవరిని పెళ్ళి చేసుకుందనేది మిగతా కథ.

  అప్పట్లో వచ్చిన కాదల్ కొండేన్ (తెలుగులో నేను చిత్రం) లో హీరో పాత్రను పాజిటివ్ చేసి,వినోదాన్ని జతచేసి ఆర్యగా హిట్ కొట్టి శభాష్ అనిపించుకున్న సుకుమార్..ఈ చిత్రం దర్శకుడు అంటే నమ్మబుద్ది కాదు. అయితే కాదల్ కొండేన్ ఛాయలు మాత్రం ఆర్య-2 చిత్రంలో కనపడటంతో(హీరో సైకో తరహాలో బిహేవ్ చేయటం, తనకు అడ్డు వచ్చిన వారిని తప్పించటం, సైడ్ హీరోతో పెళ్ళి చేస్తానని ప్రామిస్ చేసి తాను దక్కించుకోవాలని చూడటం వంటివి)ఆ ప్రభావం నుంచి తప్పుకోలేదనిపిస్తుంది. అయితే కాదల్ కొండేన్ లో క్లారిటీ ఉంటుంది. అనాధ అయిన హీరో తాను పెరిగిన పరిస్ధుతుల వల్లే ఇన్ఫీరియారిటీ కాప్లిక్ట్ కు లోనై సైకో లా మారటం ఆసక్తి కలిగించి జాలి వేస్తుంది. అదే ఇక్కడ మిస్సయింది. హీరో గారి సైకో చేస్టల్ని ఇంటిలిజెంట్ ప్లాన్స్ గా చూడమంటే ఎవరు హర్షిస్తారు. ఒకానొక స్టేజీ వచ్చేసరికి ఆర్య విలనా లేక అజయ్ విలనా అనే డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత అర్ధమవుతుంది..దీనకి కథా రచయిత సుకుమార్ పెద్ద విలన్ అని. ఇక బ్రహ్మానందం వంటి స్టార్ కమేడియన్ చేత హాస్యం పండించలేక ఆ సీన్స్ వేస్ట్ చేయటం మరో మైనస్. ఎందుకంటే పోస్టర్స్ మీద బ్రహ్మానందంని కూడా హైలెట్ చేస్తూ వేస్తున్నారు. ఈ నాసిరకమైన కధకు మరింత తలనొప్పి స్క్రీన్ ప్లే తోడయింది. ఎక్కడా హీరో, హీరోయిన్ మధ్య లవ్ ఎస్టాబ్లిష్ కాదు.

  ఇక ఆర్యకూ ఈ సీక్వెల్ కూ వెయ్యి యోజనాల తేడా ఉంది. అందులో హీరో పాత్రకు ఓ విశిష్టత ఉంది. నువ్వు ప్రేమించకపోయినా..నేను ప్రేమిస్తాను..అంటూ ఫీల్ మై లవ్ అంటూ వెంటపడటం ముచ్చటేస్తుంది. అతని పోటీ అంతా శివబాలాజీ పాత్రతోనే ఉంటుంది. అదే ఆర్య-2 లో హీరోయిన్ ని కూడా తన సైకో చేష్టలతో ఏడిపిస్తాడు. తన చేతులతో తన ప్రేమను తానే కూలదోసుకుంటాడు. అలాగే హీరోయిన్ పాత్ర ఆర్య చిత్రంలో క్లారిటీగా ఉంటుంది. శివబాలాజీ బలవంతం మీద ఆమె అతనితో ప్రేమ ఒప్పుకుంటుంది. అదే ఆర్య-2 వచ్చే సరికి కాజల్ తన మనస్సు ఎవరితో ప్రయాణం చేస్తుందో క్లారిటీ ఉండదు. అవసరం కోసం నవదీప్ తో ప్రేమలో పడ్డానంటుంది. ఆ తర్వాత ఆర్య ను దూరం చేసుకోవటానికి ఆ ప్రేమను కంటిన్యూ చేసానంటుంది. దాంతో తాను ఆర్యను ప్రేమించటం లేదని ఒక్క డైలాగు చెప్పితే కథ అయిపోతుంది కదా అనే డౌట్ తెప్పిస్తుంది.అన్నిటికన్నా ముఖ్యంగా పెళ్ళి చేసుకున్న అమ్మాయిని హీరో తన స్నేహితునికి ధారపోస్తాననే ఎపిసోడ్ (కన్యాదానం సినిమాలోలా) మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. మా అమ్మాయిని చేసుకోవటానికి ఎవరూ లేరు..నువ్వు చేసుకుంటావా అని హీరోయిన్ తండ్రి అడిగినప్పుడు ఆమె ఆల్రెడీ తన ప్రెండ్ తో ప్రేమలో ఉందనే డైలాగు హీరో చెపుతాడనుకుంటాం. ఎందుకంటే హీరో అక్కడికి వచ్చిందే తన స్నేహితుడు మ్యారేజి సెటిల్ చేయటానికి కదా.

  ఇక ఈ చిత్రంలో చెప్పుకోదగిన అంశాలు లేవా అంటే చాలా చోట్ల దర్శకుడు టాలెంట్ ను,సృజనాత్మకతను ప్రదర్శించాడు. హీరో చైల్డ్ హుడ్ ఎపిసోడ్స్ లో నాకా సాయిం చేసే వాడు ప్రెండ్ అని అజయ్ పాత్ర అంటే ఆర్య వెంటనే అతన్ని నీళ్ళలో తోసి, రక్షించి సాయిం చేసాను కదా ప్రెండ్షిప్ ప్రారంభిద్దామని చెప్పటం..బలవంతంగా పచ్చబొట్టు పొడిపించటం వంటివి నవ్విస్తాయి. అలాగే సుబ్బారెడ్డి(అజయ్)తో ఆర్య మందు కొట్టే సీన్ బావుంది. ఇక ఫస్ట్ సాంగ్ కు అల్లు అర్జున్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుంది. ఆ కథకు ఆ రెండు గంటలు కూర్చోపెట్టిందంటే అల్లు అర్జున్ ఎనర్జీ నటనే కారణం. ఇక దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన రింగా రింగా ఆడియోలో అధ్బుతంగా పేలితే తెరపై తేలిపోయింది. ఆ ఐటం సాంగ్ కు ఏ వర్గం నుంచీ రెస్పాన్స్ రాలేదు. డైలాగులు ఒకట్రెండుతప్ప గుర్తుంచుకునేవి లేవు. వీటికి తోడు బ్రహ్మానందం వంటి స్టార్ కమిడెయన్ ని పెట్టుకుని కూడా ఒక్క నవ్వూ పండించలేకపోయారు. కాస్తా కూస్తో ఎంజాయ్ చేసిందేమన్నా ఉందంటే అది కిడ్నాప్ ఎపిసోడ్ లోనే.

  ఏదైమైనా ఈ చిత్రంలో హీరో అతి స్నేహం ఎపిసోడ్స్ చూస్తూంటే ఇవివి చాలా బావుంది చిత్రం గుర్తుకు వస్తుంది. లవ్ ఎపిసోడ్ చూస్తే కాదల్ కొండేన్ జ్ఞాపకం వస్తుంది. టోటల్ గా విపరీతమైన బోర్ వస్తుంది. అయినా ఇద్దరు మగవాళ్ళ మధ్య మరీ అంత రిలేషన్ కాస్త ఇబ్బందే అనిపిస్తుంది. ఇక ఇంత చదివాక కూడా ఈ చిత్రం చూడాలా అంటే అల్లు అర్జున్ వీర ఫ్యాన్స్ కు కూడా కష్టమే అనిపిస్తుందని చెప్పక తప్పదు. జగడం కన్నా దారుణంగా తయారైన ఈ చిత్రం అదే నిర్మాత ఆదిత్యబాబు,దర్శకుడు సుకుమార్ లకు పూర్తి స్ధాయి ఫెయిల్యూర్ సినిమా అవుతుందనటంలో సందేహం లేదు. అలాగే యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం వారిని కూడా ఆకర్షించటం కష్టమే..ఎందుకంటే మౌత్ టాక్ చాలా స్పీడుగా స్పెడ్ అయ్యే రోజులివి. బాగోలేదంటే...ఎవరూ ధైర్యం చేయటం లేదు. అవును పాపం ఇంత రివ్యూలోనూ మరో హీరోయిన్ శ్రధ్దా ఆర్య గురించి గుర్తుకురాలేదెందుకంటే..ఆమె పాత్ర సినిమాలోనూ ఏమీ లేదు కనుక.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X