»   » సరి..సరి...యాక్షన్ తోనే సరిపెట్టాడు ('సరైనోడు' రివ్యూ)

సరి..సరి...యాక్షన్ తోనే సరిపెట్టాడు ('సరైనోడు' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5
---సూర్య ప్రకాష్ జోశ్యుల

సినిమా ప్రారంభంలో దర్శకుడు బోయపాటి శ్రీను తెరపైకి వచ్చి..'బాబూ...యాక్షన్' అని అనగానే సినిమా ఓ యాక్షన్ ఎపిసోడ్ తో ప్రారంభం అవుతుంది. అలా అప్పుడు మొదలైన యాక్షన్ ఎపిసోడ్స్ దాదాపు అక్కడక్కడా తప్పిస్తే ..ఎండ్ కార్డ్ పడేదాకా కట్ అనేది లేకుండా కంటిన్యూ అవుతూనే ఉండటం ఈ సినిమాలో పెద్ద విశేషం.

ధాయిలాండ్, కొరియా దేశాల్లో వచ్చే కుంగుఫూ చిత్రాల తరహాలో...ఎదిటివాడు మాట్లాడితే ఫైట్, మాట్లాడకపోతే ఫైట్ అన్నట్లు స్క్రీన్ ప్లే డిజైన్ చేసారు. అసలు ముందుగా దర్శకుడు...ఫైట్ మాస్టర్స్ తో కూర్చుని ఫైట్స్ డిజైన్ చేసుకుని ఆ తర్వాత అవి ఇమిడేలా కథ చేసారా అనే డౌట్ కూడా వస్తుంది.

తన గత చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి' మాస్ కు రీచ్ కాలేదనుకున్నాడో ఏమో అల్లు అర్జున్ ...వరసగా ఫైట్స్ చేసుకుంటూపోతూ మాస్ ని మెలేసేద్దామనుకున్నాడు. అయితే ఎంత మాస్ ప్రేక్షకులు అయినా... ఎమోషన్ లెస్ ఫైట్స్ ని, రిలీఫ్ ఇవ్వని యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎక్కువ సేపు భరించలేరనే విషయం మర్చిపోయినట్లున్నారు.

అప్పటికీ అల్లు అర్జున్ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో లాగ తన భుజాలపై మోసే ప్రయత్నం చేసాడు కానీ ఆ భుజాలను కేవలం విలన్స్ ని ఢీకొనడానికే వాడాల్సి రావటం దురదృష్టం. అలాగని ఈ సినిమా బాగోలేదు అని కాదు...కేవలం...యాక్షన్ తోనే సరిపెట్టే ప్రయత్నం చేయటంతో రెగ్యులర్ గా అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సినిమా నుంచి ఎక్సపెక్ట్ చేసే ఎలిమెంట్స్ లేవు అని చెప్పటమే మా ఉద్దేశం. అప్పటికీ బ్రహ్మానందం కామెడీ చెయ్యబోయాడు కానీ అదీ ఫెయిలైంది.

బోయపాటి గత చిత్రాలు లాగానే ఈ సినిమాలోనూ ...హీరోయిన్స్ ను కేవలం డాన్స్ లకు మాత్రమే పరిమితం చేస్తున్నారంటారనేమో ... వాళ్లలో ఒకరిని కథకు కలిపే ప్రయత్నం చేసాడు కానీ అది అతకలేదు. హై యాక్షన్ ఎపిసోడ్స్ మాయలో రొమాన్స్ అయిపు లేకుండా పోయింది.

గన (అల్లు అర్జున్) ఎక్స్ మిలిట్రీ. బోర్డర్ లో కన్నా బయిటే ఎక్కువ సమస్యలు ఉన్నాయని మిలిట్రీ వదిలేసి వచ్చిన గన...హైదరాబాద్ లో తన కుటుంబంతో ఉంటూ, అందిరి హీరోల్లాగా అన్యాయాలను అక్రమాలను ఎదిరించటమే పనిగా పెట్టుకుంటాడు.

గన మీద ప్రేమతో పిల్లలు కూడా వద్దనుకున్న బాబాయ్ (శ్రీకాంత్) ఎప్పుడూ అతనితోనే ఉంటాడు. ఇదిలా ఉంటే..గన ఓ రోజు తనుండే ఏరియా ఎమ్మల్యే హర్షితా రెడ్డి(క్యాధరిన్ ధ్రిసా)ని చూసి.. తో ప్రేమలో పడతాడు. ఆమె వెనక పడతాడు. మొదట ఆమె ఒప్పుకోకపోయినా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

అలా ఎమ్మల్యే ని ఒప్పించి తన ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్తున్న సమయంలో అతన్ని వెతుక్కుంటూ మహాలక్ష్మి (రకుల్ ప్రీతి సింగ్) వస్తుంది. వచ్చి తనను కాపాడమంటుంది. మహాలక్ష్మి పెద్ద ప్రమాదంలో ఉంటుంది. ఆమెను చంపటానికి వైరం ధనుష్ (ఆది పినిశెట్టి) అనే విలన్ మనుష్యులు వెంటబడుతూంటారు. అప్పుడు గన ఏం చేసాడు... ఆమెను కాపాడాడా... వైరం ధనుష్ తో వైరం పెట్టుకున్నాడా.. మరి ఎమ్మల్యేతో లవ్ స్టోరీ ఏమైంది.. అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

బోయపాటి శ్రీను గత చిత్రాలు కూడా కొత్త కధలు లేదా కొత్త పాయింట్లేమీ కాదు కానీ చెప్పే విధానం కొత్తగా మాస్ ని ఆకట్టుకునే విధంగా చూసుకుంటూంటాడు. ఇక్కడా అదే ప్రయత్నం చేసాడు. అయితే హీరో కు తగ్గ విలన్ పడలేదనిపిస్తుంది.

ఆది పినిశెట్టి విలన్ గా బాగానే నటించాడు...కానీ అల్లు అర్జున్ యాక్షన్ బిల్డప్...ముందు తేలిపోయాడు. విలన్ ఎంత బలంగా ఉంటే హీరో కి అంత ఇమేజ్ బూస్ట్ అవుతుంది. అదే ఇక్కడ లోపించింది. దానికి తోడు విలన్ కి హీరో ఫలానా అని తెలిసే సరికి ...స్క్రీన్ కాలం కాలా చాలా ఖర్చైపోయి కేవలం క్లైమాక్స్ , ప్రీ క్లైమాక్స్ మాత్రమే మిగలాయి.

దాంతో కమర్షియల్ యాక్షన్ చిత్రాల్లో ఉండే... హీరోని ఎదుర్కోవటానికి విలన్ ఎత్తులు వేయటం, వాటిని చిత్తు చేయటం అనే సీక్వెన్స్ కు చోటే లేకుండాపోయింది. స్క్రీన్ ప్లే భాషలో చెప్పాలంటే హీరో యాక్టివ్ ప్యాసివ్ రోల్ పోషించాడు అని చెప్పాలి. తొలిసారి విలన్, హీరో ఢీ కొన్నప్పుడే.. హీరో అతన్ని చంపేయచ్చు... చివరిదాకా ఉంచటమెందుకు, కేవలం కథ నడపటానికి కాకపోతే అనేలా ఆ సీన్ డిజైన్ చేసారు.

మిగతా హైలెట్స్, మైనస్ లు స్లైడ్ షోలో

ఫస్టాఫ్ ఓకే కానీ..

ఫస్టాఫ్ ఓకే కానీ..

సినిమాలో ఫస్టాఫ్ బాగుందనిపిస్తుంది. అదే సెకండాఫ్ వద్దకు వచ్చేసరికి సినిమా తేలిపోయిందనిపిస్తుంది. ఫస్టాఫ్ లో రొమాన్స్, యాక్షన్, కామెడీలకు సరైన ప్రయారిటి ఇచ్చాడు. కానీ సెంకడాఫ్ లో వూక దంపుడులా కొట్టుకుంటూ పోయాడు.

కొత్తేం లేదు

కొత్తేం లేదు

బోయపాటి మొదటి నుంచి చెప్తున్నట్లుగానే సినిమా అంతా స్టైలిష్‌గా తీశారు. అలాగే కథ విషయంలో తన పాత కథ భధ్ర ను గుర్తు చేస్తూ ముందుకు వెళ్లాడు. కథనం అయితే నీరసం తెప్పించింది. ఇక రెగ్యులర్ గా బోయపాటి సినిమాల్లో హైలెట్స్ ..ఇక్కడ కూడా హైలెట్స్ అయ్యాయి.

మూడు షేడ్ లలో

మూడు షేడ్ లలో

ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ ఫ్యామిలీ మెంబర్ గా, లవర్ గా, అన్యాయాలు సహించలేనివాడిగా మూడు షేడ్స్ ఉన్న పాత్రలో చాలా బాగా చేసాడు.

హైలెట్

హైలెట్

ఫస్టాఫ్ లో వచ్చే కోర్టు సీన్ లో అల్లు అర్జున్ నటన హైలెట్ గా చెప్పవచ్చు. బోయపాటి స్కూల్లో ఓవర్ ప్లే చేసే అవకాసం ఉన్నా సాధ్యమైనంత వరకూ ఓవర్ డోస్ ఇవ్వలేదు.

బ్రహ్మీ ఫెయిల్ ..

బ్రహ్మీ ఫెయిల్ ..

ఈ సినిమాలో ఏకైక రిలీఫ్..బ్రహ్మానందం పాత్ర అది పూర్తిగా ఫెయిలైంది. అయితే ప్రదీప్ రావత్, 30 ఇయిర్స్ ఇండస్త్రీ పృధ్వీ మధ్య వచ్చే ఒక ఫన్ సీన్ మాత్రం బాగా పేలింది.

హీరోయిన్స్

హీరోయిన్స్

హీరోయిన్స్ కేధరిన్, రకుల్ ప్రీతి సింగ్ ఇద్దరూ తమ శక్తి మేరకు..పాటల్లో డాన్స్ చేసారు. అంతకుమించి సీన్ వారికి లేదు.

ఫైట్స్ బాగున్నా

ఫైట్స్ బాగున్నా

నిజానికి ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగా కంపోజ్ చేసారు. కానీ అంత ఎఫెక్టివ్ గా లేవు. అందుకు కారణం కేవలం ఎమోషన్ మిస్సవటమే.

దృష్టంతా

దృష్టంతా

దర్శకుడు దృష్టి మొత్తం అల్లు అర్జున్ ఫిజిక్ మీదే పెట్టాడని చాలా సీన్స్ లో బాడీని ఎలివేట్ చేస్తూంటే అర్దమవుతుంది.

అదిరిందయ్యా శ్రీనూ

అదిరిందయ్యా శ్రీనూ

బోయపాటి బలం అంతా ఇంటర్వెల్ సీన్ దగ్గర చూపెట్టాడు. కంటెంట్ పరంగా ఓకే అనిపించినా, యాక్షన్ బ్లాక్స్ షాట్స్, మేకింగ్ పరంగా అదిరాయినే చెప్పాలి. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు హైలెట్.

రెండు పాటలూ

రెండు పాటలూ

సి నిమాలో "దిసీజ్ ద ప్రెవేట్ పార్టీ పాట", "బ్లాక్ బస్టరే" పాట చాలా బాగా చిత్రీకరించారు.

 శ్రీకాంత్ పెద్దగా ఉపయోగం లేదు

శ్రీకాంత్ పెద్దగా ఉపయోగం లేదు

శ్రీకాంత్ పాత్ర సినిమాకు కీలకమూ కాదు. పెద్దగా ఉపయోగపడనూ లేదు. ఇంకా చెప్పాలంటే శ్రీకాంత్ లాంటి హీరో ఇమేజ్ ఉన్న ఆర్టిస్టుని సరిగా వాడుకోలేదు.

సోసో

సోసో


బ్లాక్ బస్టర్ సాంగ్ కోసం అంజలిని ప్రత్యేకంగా తీసుకున్నారు. పాట, చిత్రీకరణ రెండు బాగున్నాయి కానీ అంజలి ని మాత్రం హైలెట్ చేయలేదు. ఈ పాటకు అంజలి మాత్రమే చేయనక్కర్లేదు..ఎవరైనా చేయవచ్చు అనేలా ఉంది.

 దమ్ము గుర్తుకు వస్తుంది

దమ్ము గుర్తుకు వస్తుంది

ఈ సినిమా చూస్తూంటే ఎన్టీఆర్ దమ్ము సినిమా గుర్తుకు రావటం జరుగుతుంది.

బ్యాడ్ లవ్ ట్రాక్

బ్యాడ్ లవ్ ట్రాక్

ఎమ్మల్యే అయిన హీరోయిన్ ని ప్రేమలో పడేయటానికి హీరో చేసే ఛీఫ్ ట్రిక్ లు, సీల్లీగా అనిపిస్తాయి. ఆ విషయంలో ఇంకాస్త జాగ్రత్తులు తీసుకోవాల్సింది.

క్యారక్టరైజేషన్

క్యారక్టరైజేషన్

హీరో ..మిలిట్రీ పర్శన్...సమాజ ఉద్దరణ కోసం వచ్చేసాడు అని ఎస్టాబ్లిష్ చేసారు. ఇక్కడ కొచ్చిన హీరో తండ్రి చేత తిట్లు తింటూ.. అన్యాయాలను ఎదుర్కుంటమే ఏదో వృత్తిగా పెట్టుకున్నట్లు బిహేవ్ చేయటమే వింతగా అనిపిస్తుంది.

డైలాగులు ఇకాస్త

డైలాగులు ఇకాస్త

బోయపాటి సినిమాలు హీరోయిజం ప లికే డైలాగులకు పెట్టింది పేరు. ఎందుకనో ఈ సినిమాలో డైలాలుగు ఆ రేంజిలో పేలలేదు.

ఎక్కువైంది

ఎక్కువైంది

ఈ సినిమాకు రన్ టైమ్ ఎక్కువైందనే చెప్పాలి. 159 నిముషాల రన్ టైమ్ లో ఓ ఇరవై , ఇరవై ఐదు నిముషాలు ఎడిటింగ్ లో ట్రిమ్ చేస్తే డ్రాగ్ చేసిన ఫీలింగ్ రాదు.

మరో హైలెట్

మరో హైలెట్

సినిమాలో హైలెట్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ఏమిటీ అంటే.. రిషి పంజాబి కెమెరా వర్క్ అని చెప్పాలి. ప్రతీ ఫ్రేమ్ తీర్చిదిద్దినట్లుగా డిజైన్ చేసాడు.

ఎవరెవరు..

ఎవరెవరు..

బ్యానర్ : గీతా ఆర్ట్స్
నటీనటులు: అల్లు అర్జున్, రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, సురేఖావాణి, విద్యుల్లేఖ, దేవదర్శిని, అంజలి (ప్రత్యేక పాట) తదితరులు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు,
ఫైట్స్: రామ్‌లక్ష్మణ్,
కెమెరా: రిషి పంజాబి,
మాటలు: ఎం.రత్నం,
సంగీతం: ఎస్.ఎస్.థమన్,
నిర్మాత: అల్లు అరవింద్,
దర్శకత్వం: బోయపాటి శ్రీను.
విడుదల తేదీ: 22, ఏప్రియల్ 2016.

ఫైనల్ గా...కామెడీ సినిమాలో సీరియస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఎక్సపెక్ట్ చేయకూడదో అలాగే బోయపాటి సినిమాలో యాక్షన్ తప్ప మిగతా ఎలిమెంట్స్ ఏమీ ఎక్సపెక్ట్ చేయకూడదని నొక్కి చెప్పటానికి తీసినట్లుంది. మితిమీరిన హింస తో బన్నికు అలవాటైన ఫ్యామిలీ ప్రేక్షకులు దూరం పెట్టే అవకాసం ఉంది. కేవలం యాక్షన్ అభిమానులకు, బన్ని అభిమానులకు ఈ సినిమా నచ్చుతుంది.

English summary
Allu Arjun and the massy director Boyapati Srinu's Sarainodu is aimed to push the actor an inch closer to the masses. Read the review to know whether the mission is a 'blockbuster'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu