»   »  థ్రిల్లింగ్, సస్పెన్స్ డ్రామా...(అనామిక రివ్యూ)

థ్రిల్లింగ్, సస్పెన్స్ డ్రామా...(అనామిక రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5
హైదరాబాద్: బాలీవుడ్‌లో సక్సెస్‌ అయిన 'కహాని' చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'అనామిక' నయనతా ప్రధాన పాత్రలో పోషించిన ఈచిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. పేరుకు రీమేక్ అయినా మక్కికి మక్కి దించచకుండా తెలుగు నేటివిటీకి తగిన విధంగా చాలా మార్పులు చేసి తెరకెక్కించాడు దర్శకుడు. హిందీలో హిట్టయిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా తెలుగులో ఏమాత్రం వర్కౌట్ అయిందో చూద్దాం...

కథ విషయానికొస్తే...

పీపుల్స్ ప్లాజాలో బాంబు పేలుళ్ల తర్వాత పాత హోంమినిస్టర్ రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలు ఆది కేశవయ్య(నరేష్) చేపడతాడు. మతకలహాలు మొదలవుతాయనే సాకుతో పేలుళ్ళకి కారణం అయిన మిలింద్ అంజీ మీద విచారణ వద్దని యంటి టెర్రరిస్ట్ సెల్ అధికారి ఖాన్ (పశుపతి) ని ఆదేశిస్తాడ ఆది కేశవయ్య. అదే సమయంలో అమెరికా నుండి ఉద్యోగ రీత్య హైదరాబాద్‌ వచ్చిన అజయ్‌ శాస్త్రి(హర్షవర్ధన్ రాణె) కనిపించకుండా పోతాడు. దాంతో అజయ్‌ శాస్త్రి భార్య అనామిక భర్తను వెతుకుతూ హైదరాబాద్‌ వస్తుంది. తన భర్త కనిపించడం లేదని శంసీర్ గంజ్ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇస్తుంది. అయితే అనామిక కంప్లైంట్‌ ఆ స్టేషన్‌ సీఐ పట్టించుకోడు. అయితే స్టేషన్లో పని చేస్తున్న పోలీస్‌ సారధి(వైభవ్‌) అజయ్‌ శాస్త్రిని వెదకడంలో సహయపడతాడు. అజయ్‌ శాస్త్రీ ఆచూకి తెలిసిన ప్రతీ వారు చనిపోతూ ఉంటారు. అనామికను కూడా చంపాలని చూస్తారు. పీపుల్స్ ప్లాజా పేలుళ్లకి....అనామిక భర్త మిస్సింగుకు కారణం ఏమిటనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్ పరంగా నయనతార తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్రకు ఆమె తప్ప మరెవరూ సూట్ కారన్నంతగా అద్భుతంగా నటించింది. ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు తగిన విధంగా ఓకే అనిపించుకున్నాడు. పాత్రల ఎంపిక విషయంలో దర్శకుడు బాగా కేర్ తీసుకున్నాడు. స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు...

సాంకేతిక అంశాలు

సాంకేతిక అంశాలు

కీరవాణి అందించిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్వ్ య్యేలా చేసింది. మ్యూజిక్ పరంగా ఆయన పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. విజయ్.సి కుమార్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు మరో హైలెట్. సినిమా కోసం వేసిన సెట్స్ బాగన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. మార్తాండ్ కె వెంకటేష్ మొదటి భాగం ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

యడమూరి వీరేంద్రనాథ్-శేఖర్ కమ్ముల

యడమూరి వీరేంద్రనాథ్-శేఖర్ కమ్ముల

యండమూరి వీరేంద్రనాథ్, శేఖర్ కమ్ముల కలిసి ఈ చిత్రానికి అందించిన డైలాగులు బాగున్నాయి. మాతృకలో చేసిన మార్పులు పర్ ఫెక్టుగా సెట్టయ్యాయి.

శేకర్ కమ్ముల

శేకర్ కమ్ముల

శేఖర్ కమ్ముల డైరెక్షన్ ఓకే కానీ, థ్రిల్లర్ కథాంశం కాబట్టి కథనం స్పీడుగా ఉంటే బాగుండేది. అదే సమయంలో క్లైమాక్స్‌లో కాస్త క్లారిటీ తగ్గింది. హిందీ ‘కహానీ'లో మాదిరి ‘అనామిక'లో కూడా హీరోయిన్ గర్భవతి అయి ఉంటే ప్రేక్షకులు కథకు కనెక్టయ్యే తీరు ఇంకాస్త బాగుండేది.

భిన్నంగా

భిన్నంగా

సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంటుంది. అయితే ఈ సినిమా అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. కథలోని థ్రిల్లర్, సస్సెన్స్ అంశాలు ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

థ్రిల్లింగ్, సస్సెన్స్

థ్రిల్లింగ్, సస్సెన్స్

అనామిక చిత్రాన్ని మంచి థ్రిల్లర్ మూవీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ తరహా చిత్రాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. అయితే కమర్షియల్ అంశాలు లేక పోవడం వల్ల ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది ప్రేక్షకుల జడ్జిమెంటుపై ఆధారపడి ఉంటుంది.

ప్రొడక్షన్ టీం

ప్రొడక్షన్ టీం

నిర్మాణం: ఎండమోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్స్
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
తరాగణం: నయనతార, పశుపతి, వైభవ్, హర్షవర్ధన్ రాణె, నరేష్
సంగీతం: ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రపీ: వియజ్ సి కుమార్
విడుదల: 1 మే, 2014

English summary
Prior its release, Telugu movie Anamika has garnered huge positive buzz as it is the remake of hit Hindi suspense thriller Kahaani starring Vidya Balan. Critically-acclaimed director Sekhar Kammula and popular South Indian actress Nayantara's association with this project has added more to the curiosity of the viewers. Released in theatres today, the movie manages to live up to the audiences' expectations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu