twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరి (బంధు) చిత్రమయా (రివ్యూ)

    By Srikanya
    |
    Andari Banduvaya
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    చిత్రం: అందరి బంధువయా
    నటీనటులు: శర్వానంద్‌, పద్మప్రియ, నరేష్‌, ఆర్కే, విజయ్ సాయి, ప్రగతి, ఆనంద్ తదితరులు.
    కథ,మాటలు: బలభద్రపాత్రుని రమణి
    సంగీతం: అనూఫ్ రూబిన్స్
    పాటలు: చైతన్య ప్రసాద్
    కెమెరా: జయకృష్ణ గుమ్మడి
    ఎడిటింగ్: నందమూరి హరి
    నిర్మాత: ఆర్కే, చంద్ర సిద్దార్ద
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చంద్ర సిద్దార్ద
    రిలీజ్ డేట్: మే 14, 2010

    'ఆ నలుగురు' తో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు చంద్రసిద్ధార్థ్‌ మరోసారి మానవతా విలువలను అద్దుతూ అందరి బంధువయాను అందించారు. స్లో నేరేషన్ తో నడుస్తుంది అని మొదట్లో వినిపించినా సినిమాలో విషయం ఉండటం, ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండటంతో పాజిటివ్ టాక్ మెల్లిగా స్పెడ్ అవుతోంది. అయితే సెకెండాఫ్ కి వచ్చేసరికి ఎత్తుకున్న విషయం,టైటిల్ వదిలేసి వేరే సబ్ ప్లాట్ లోకి వెళ్ళిపోవటంతో కాస్త డీవియేట్ అయ్యినట్లు అనిపిస్తుంది. అలాగే టేకింగ్ పరంగా దూరదర్శన్ టీవీ సీరియల్స్ ను గుర్తు తెస్తుంది. అయితే పద్మప్రియ అద్భుత నటన, హ్యూమన్ ఏంగిల్ కలిగి ఉండటంఆ లోపాల్ని హైలెట్ కానివ్వవు.

    సాప్ట్ వేర్ ఉద్యోగం కోసం పల్లె నుంచి హైదరాబాద్ ‌కు వస్తాడు నందు (శర్వానంద్‌). ఎవరికీ ఏ సమస్య వచ్చినా అది తనదే అనుకునే అతనికి అక్కడే పద్దు (పద్మప్రియ)తో పరిచయం అవుతుంది. పరమ పీనాసిగా ప్రవర్తించే ఆమె..నందు ప్రేమలో పడి మారుతుంది. ఈ లోగా తన మాస్టారుకి ఓ అవసరం వచ్చి ఐదు లక్షలు అవసరమై అప్పుకోసం ఆ ఏరియా దాదా (ఆర్కే) ని ఆశ్రయిస్తాడు. తాకట్టుగా తన కళ్లు, గుండె పెట్టి అగ్రిమెంట్‌ రాస్తాడు. ఆ తర్వాత ఆ డబ్బు చెల్లించలేకపోతాడు. మరో ప్రక్క పద్దు అక్కని చేసుకుంటానంటూ వచ్చిన బావ ఆ తర్వాత పద్దుపై మనస్సు పడతాడు. ఇద్దరూ అలా సమస్యల్లో పడతారు. ఆ సమస్యలను వాళ్ళు ఎలా అధిగమించారు అన్న కోణంలో కథ నడుస్తుంది.

    పక్షికి ఇన్ని నూకలు...పశువుకు ఇంత దాణా..మనిషికి చిన్న సాయం..ఇంతకు మించిన సేవలేదనేది పాయింట్ ను హైలెట్ చేస్తూ చేసిన కొన్ని సన్నివేశాలు సినిమాకు ప్రాణమై నిలుస్తాయి. అయితే షేక్పియర్ మర్చంట్ ఆఫ్ వెన్నీస్ అనే డ్రామా ఆధారంగా చేసినట్లున్న (హీరో గుండె, కళ్ళు తాకట్టు పెట్టి అప్పు తీసుకోవటం) కథకు కీలకమైనా సరిగ్గా డీల్ చేయలేదనిపిస్తుంది. చివర్లో హఠాత్తుగా విలన్ మారిపోయి నీ కళ్ళతో నా కొడుక్కి దారి చూపించు, నీ గుండెలో నా కొడుక్కి స్ధానం ఇవ్వు వంటి డైలాగులు చెప్పటం విచిత్రంగా అనిపిస్తుంది. అలాగే అప్పు తీసుకున్న హీరో దానిని తీర్చటానికి కొంచెం కూడా ప్రయత్నం చేయడు. ప్రయత్నం చేసి ఆ క్రమంలో ఓడిపోయాడన్నా బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక హీరోయిన్..అంతులేని కథలో జయప్రద పాత్రనుంచి ప్రేరణ పొందినట్లున్నారు. ఆమె తన తండ్రి అప్పుల్లో వదిలేసిన కుటుంబాన్ని ఆమె కష్టపడి ఈదుతుంటుంది. అందుకోసమే ఆమె పీనాసిగా కనిపిస్తుంది. ఆ సన్నివేశాలు బాగా పండాయి.

    హీరో తండ్రిగా సినిమాకు హైలెట్ గా నిలిచిన సీనియర్ నరేష్ పాత్ర ను సగంలో ఎంటర్టైన్మెంట్ కోసం కట్ చేసినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా నడుస్తున్న కథకు సంభందం ఉండదు. అలాగే సెకెండాఫ్ లో హీరోయిన్ బావ తనని చేసుకుంటానంటే అది తప్పించుకోవటం కోసం ఆమె తను వర్జిన్ కానని, తనకు అబార్షన్ అయిందని నాటకమాడటం..ఎంటర్టైన్ మెంట్ గా అనిపించినా చెప్తున్న పాయింట్ కు దానికీ సంభందం లేదని స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక బలభద్ర పాత్రుని డైలాగులు చాలా చోట్ల బాగా పేలాయి. శర్వానంద్..ప్రస్ధానం తర్వాత మంచి నటన ప్రదర్శించిన చిత్రం ఇది. డిఫెరెంట్ గా వెళ్థున్నాడు అనిపిస్తోంది. ఇక పద్మప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆమె ఆల్రెడీ నటిగా ఎన్నో సార్లు ప్రూవ్ అయిందే. అలాగే ఎన్నారై గా చేసినతను కూడా బాగా చేసాడు. ఇక ఫ్యామిలీలు కూడా రావాలని తీసినప్పుడు కృష్ణ భగవాన్ బూతు కామిడీ డైలాగులు అనవరసరం అనిపిస్తుంది. పాటలు మరింత కిక్ ఉండాలి. కెమెరా ఈ సినిమాకు మైనస్. సెకెండాఫ్ లో పాటలు మధ్య గ్యాప్ తగ్గిపోయింది ఎడిట్ చేస్తే మరింత స్పీడుగా కథనం నడుస్తుంది.

    ఏదైమైనా మంచి ప్రయత్నం ఇది. మౌత్ టాక్ తో ముందు రోజుల్లో నిలబడుతుందని ఆశిద్దాం. ఇలాంటి చిత్రాలు వర్కవుట్ అయితే చంద్ర సిద్దార్ధ లాంటి మరింత మంది ముందుకు వస్తారు. చిన్న సినిమాలు పెద్ద సినిమాల్లో నిలబడతాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X