twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆంధ్రావాలా'- చూడాలా? మానాలా?

    By Staff
    |

    Andhrawala
    చిత్రం: ఆంధ్రావాలా
    నటీనటులుః ఎన్టీఆర్‌, రక్షిత, రాహుల్‌ దేవ్‌, శాయాజీ షిండే,
    సంఘవి, నాసర్‌, బెనర్జీ తదితరులు
    సంగీతం: చక్రి
    నిర్మాత: గిరి
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్‌

    తెలుగు సినిమాలోని వివిధ విభాగాల్లో ఈ మధ్య బాగా కన్పిస్తున్న క్రియేటివిటీ తెలుగు సినిమా కథల్లో అంతగా గోచరించడం లేదనడానికి తాజా ఉదాహరణ 'ఆంధ్రావాలా'. అనగనగా ఒక ఆంధ్రుడు. బతుకు తెరువు కోసం ముంబాయి వెళ్ళి రిక్షావాలాగా బతుకుతుంటాడు. పరిస్ధితుల ప్రభావం వల్ల శంకర్‌ పహిల్వాన్‌ (ఎన్టీఆర్‌)గా మారతాడు. ముంబాయిలో పేరుమోసిన గూండా బడే మియా(శాయాజీ షిండే)తో తలపడతాడు.

    ఒక రోజు బడే మియా మనుషులు శంకర్‌ ను అతని భార్య (సంఘవి)ని హత్య చేస్తారు. ఈ దంపతులకున్న కొడుకు మున్నాను ఒకరు రక్షించి దూరంగా ఫుట్‌ పాత్‌ మీద విడిచిపెడతారు.

    కత్తులతో పరుగెత్తుకొస్తున్న గూండాలనుంచి చిన్నారి మున్నా(ఎన్టీఆర్‌)ను రక్షించే సీన్‌ తో సినిమా ఓపెన్‌ అవుతుంది. ఎలాగో హైదరాబాద్‌ చేరుకుని ఇక్కడ మురికివాడలో బతుకుతున్న మున్నాను చంపడానికి బడేమియా పంపిన బెటాలియన్‌ హైదరాబాద్‌ కు చేరుకుంటుంది. మున్నాను రక్షించడానికి భాషా, చంపేయడానికి బడే మియా ప్రయత్నిస్తుంటారు. పెద్దవాడైన మున్నా తన తలిదండ్రులను చంపేసిన బడేమియాను అంతం చేయడానికి ముంబాయి చేరుకుంటాడు. సెకండాఫ్‌ అంతా కత్తులు, నెత్తురు, హత్యల పరంపర. చివరికి హీరో గారు విలన్‌ ను ఎలా అంతం చేస్తాడో సినిమాలోనే చూస్తే బాగుంటుంది.

    రికార్డులు బద్దలు చేసిన సింహాద్రి తర్వాత వచ్చిన ఆంధ్రావాలాలో ఎన్టీఆర్‌ అభిమానులే గాక సామాన్య ప్రేక్షకులు కూడా ఏదో ఉంటుందనని ఆశించారు. ఫస్టాఫ్‌ స్లోగా ఉండడం, ట్రీట్‌ మెంట్‌ సరిగా లేకపోవడం వల్ల ప్రేక్షకులు కొంత బోర్‌ ఫీలవుతారు. సెకండాఫ్‌ స్పీడ్‌ గా ఉన్నా కథనంలో చిక్కదనం లేకపోవడం వల్ల గంద్రగోళం కన్పిస్తుంది. సినిమాలో ముంబాయి సన్నివేశాల్లో చాలా హిందీ డైలాగులున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రజలు వీటి భావాన్ని గ్రహించగలిగినా కథలో లీనమై పోయేటంతగా అర్ధం చేసుకోలేరు.

    హీరోయిన్‌ రక్షిత ఇందులో మిస్‌ ఇండియా. మిస్‌ ఇండియాలు భాషలోను, ప్రవర్తనలోను ఆధునికంగా, హుందాగా ఉంటారు. కానీ రక్షిత పచ్చిగా నటించింది. ఆమె మాస్‌ డైలాగులు హద్దులు మీరాయి. ఒక లక్ష్యం పెట్టుకుని రక్షితను రేప్‌ చేయడానికి ఎన్టీఆర్‌ వెళ్ళినప్పుడు ఆ గదిలో అతడినే రేప్‌ చేయడానికి రక్షిత ప్రయత్నించడం నవ్వు తెప్పించినా ఈ సన్నివేశం కథకు ఏమాత్రం మేలు చేయదు.

    పాత కథ అయినా శ్యాం కె నాయుడు కెమెరా పనితనం గొప్పగా ఉంది. చక్రి సంగీతం సాదా సీదాగా ఉంది. ఫాంలో ఉన్న మాస్‌ హీరో, అగ్రశ్రేణి డైరెక్టర్‌, కవ్వించే హీరోయిన్‌, భారీ బడ్జెట్‌- ఇవన్నీ ఉన్నా కథనంలో చిక్కదనం లోపిస్తే ప్రేక్షకులు నిరాశ చెందుతారని 'ఆంధ్రావాలా' నిరూపిస్తుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X