For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jhansi Web Series Review: 'ఝాన్సీ'గా అదరగొట్టిన అంజలి.. ఆసక్తిగా ఉందా అంటే..?

  |

  Rating:
  2.5/5

  టైటిల్: ఝాన్సీ
  నటీనటులు: అంజలి, చాందినీ చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, రాజ్ అర్జున్, సంయుక్త హోర్నాడ్, ముమైత్ ఖాన్, రుద్ర ప్రతాప్ తదితరులు
  రచన: గణేష్ కార్తీక్
  సంగీతం: శ్రీచరణ్ పాకాల
  ప్రొడక్షన్ బ్యానర్: ట్రైబల్ హార్స్ ఎంటర్టైన్ మెంట్స్
  నిర్మాతలు: కృష్ణ కులశేఖరన్, కెఎస్. మధుబాల
  దర్శకత్వం: తిరు
  విడుదల తేది: అక్టోబర్ 27, 2022
  ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (ఎపిసోడ్స్ 6)

  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో అచ్చమైన తెలుగు అమ్మాయిగా ముద్ర వేసుకున్న హీరోయిన్ అంజలి. హీరోయిన్ గానే కాకుండా సరైనోడు, మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో కూడా ఆకట్టుకుంది. అంజలి ప్రధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ ఝాన్సీ. అంజలితోపాటు చాందినీ చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హోర్నాడ్ కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు తిరు దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ అండ్ సైకాలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అక్టోబర్ 21 విడుదల అయింది. మరి ఝాన్సీగా అంజలి ఏ మేర ఆకట్టుకుందో ఇవాళ్టి రివ్యూలో చూద్దాం.

  కథ:

  కథ:


  ఝాన్సీ (అంజలి) ఒక బొటిక్ నడుపుతూ సంకీత్ (ఆదర్శ్ బాలకృష్ణ)తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటుంది. సంకీత్ పాప మేహాను చాలా బాగా చూసుకుంటుంది ఝాన్సీ. అయితే సంకీత్ కు ఐదేళ్ల క్రితం అడవిలో దొరుకుతుంది ఝాన్సీ. ఆమె తన గతం మర్చిపోతుంది. ఇంటికి తీసుకొచ్చి ఝాన్సీకి తన గతం గుర్తుకు వచ్చేందకు ట్రీట్ మెంట్ ఇస్తాడు సంకీత్. ఈ క్రమంలోనే తనకు పీడ కలలు రావడం, గతం తాలుకు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తుంటాయి. ఆ జ్ఞాపకాలు ఏంటి? ఝాన్సీ గతం ఎలా ఉండేది? తను ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? అసలు తను ఎవరు? గతం మర్చిపోడానికి ముందు తనను చంపేందుకు ప్రయత్నించి మోడార్ (రుద్ర ప్రతాప్) ఎవరు? అతని బాస్ ఎవరు? అతన్ని కాపాడిన బార్బీకి (చాందినీ చౌదరి) ఝాన్సీకి సంబంధం ఏంటి? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఝాన్సీని చూడాల్సిందే.

  విశ్లేషణ:

  విశ్లేషణ:


  ఝాన్సీ కథ కొత్తేం కాదు. తన గతాన్ని మర్చిపోయిన ఓ యువతి తన గతాన్ని తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ ఝాన్సీ కథ. అయితే ఇటీవల ఓటీటీలో పాత కథలను కూడా కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో డైరెక్టర్ తిరు సక్సెస్ కాలేదనే చెప్పవచ్చు. ఝాన్సీపై అటాక్ తో ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేసిన వెబ్ సిరీస్ తర్వాత చాలా స్లోగా సాగుతోంది. కథనంలో కొత్తదనం లేకపోవడంతో సాగదీతలా బోరింగ్ గా ఉంటుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో చాలా సమాజంలో జరిగే చాలా అంశాలను టచ్ చేశారు. ముఖ్యంగా వుమెన్ ట్రాఫికింగ్, మాఫీయా కథను నేపథ్యంగా తీసుకున్నారు. ఈ కథలో ప్రాస్టిట్యూషన్, చైల్డ్ అబ్యూసింగ్, చిన్న పిల్లలపై రేప్, చైల్డ్ ట్రాఫికింగ్, కిడ్నాప్, యాసిడ్ దాడులు, ధర్నాలు, కోర్టు పిటిషన్ లు అంటూ తదితర విషయాలు చూపించారు. ఇవన్నీ మనం ఇదివరకు సినిమాలు, సిరీస్ లలో చూశాం. వాటిని కొత్తగా చూపిస్తే తప్పా కనెక్ట్ కాలేం. అందుకే ఎపిసోడ్స్ బోరింగ్ గా ఉంటాయి.

  అలాగే ఝాన్సీ తనెవరో

  అలాగే ఝాన్సీ తనెవరో

  అలాగే ఝాన్సీ తనెవరో తెలుసుకునే ప్రయత్నం అంత ఎంగేజింగ్ గా ఏముండదు. నిజానికి ఇలాంటి సైకలాజికల్ లేక క్రైమ్ థ్రిల్లర్ కథలకు ప్రధాన బలం ఎంగేజింగ్ గా స్టోరీ నడపడం. అందులో డైరెక్టర్ విఫలమయ్యారనే చెప్పవచ్చు. అయితే ఈ సిరీస్ హాలీవుడ్ మూవీ నేకేడ్ వెపన్ (Naked Weapon) ఛాయలు కనిపిస్తాయి. ఆ స్టోరీనే ప్రధాన అంశంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ దాన్ని ఈ సీజన్ లో పూర్తిగా చెప్పలేదు. తర్వాతి సీజన్ లో చెప్పే అవకాశం ఉండొచ్చు. ఇక ఎపిసోడ్స్ స్టార్టింగ్ లో ఇచ్చే హింట్స్ క్యూరియాసిటీని పెంచకపోగా.. సస్పెన్స్ రివీల్ చేసినట్లే ఉంది. ఆ ఎపిసోడ్ లోని ప్రధానమైన పాయింట్ ను ముందుగానే చూపించేసరికి ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి కొత్తగా ఉందన్న ఫీలింగ్ మిస్ అవుతుంది. కొన్ని విషయాలు లాజిక్ కు అందకుండా ఉంటాయి. ఇక చివర్లో సిరీస్ కు ఒక ముగింపు ఇస్తూ కంటిన్యేషన్ లా రెండో సీజన్ కు హింట్ ఇస్తే బాగుండేది. అయితే ఒక క్లారిటీ లేకుండానే సీజన్ ముగించారన్న ఫీలింగ్ గట్టిగా ఉంటుంది.

  ఎవరెలా చేశారంటే..

  ఎవరెలా చేశారంటే..

  ఈ వెబ్ సిరీస్ లో ఝాన్సీ పాత్రకు అంజలి చాలా బాగా సెట్ అయింది. ఆమె ఇదివరకు నిశబ్దం చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా చేసిన అనుభవం కచ్చితంగా ఉపయోగపడిందనే చెప్పవచ్చు. యాక్షన్ సీన్లు బాగా చేసింది. అలాగే కనపడింది కొద్దిసేపు అయిన చక్కగా ఆకట్టుకుంది చాందినీ చౌదరి. అయితే ఆమె పాత్రను ఎక్కువగా చూపించలేదు. ఇక మిగిలిన క్యారెక్టర్స్ ఆదర్శ్ బాలకృష్ణ పాత్ర పరిధి మేర నటించాడు. ఇక మిగిలిన పాత్రలు పర్వాలేదనపించాయి. శ్రీ చరణ్ పాకాల నేపథ్యం సంగీతం బాగుంది. సన్నివేశాలకు తగినట్లు బీజీఎం ఇచ్చారు. ఇదివరకు గోపిచంద్ తో చాణక్య సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ తిరు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. సమాజంలోని అనేక అంశాలను చెప్పాలన్న ఇంటెన్షన్ బాగుంది కానీ, ఆసక్తికరంగా చెప్పకపోవడం మైనస్ గా మారింది.

  ఫైనల్ గా చెప్పాలంటే..

  ఫైనల్ గా చెప్పాలంటే..


  అంజలి యాక్షన్ సీన్స్, నటన చాందినీ చౌదరి ప్రజెన్స్ బాగున్నా ఎంగేజింగ్ గా ఈ ఝాన్సీ లేదు. సమాజంలో జరిగే లోపాలను చెప్పే క్రమంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సరిగా పండించలేకపోయారు. తన గతం కోసం ఆరాటపడే ఝాన్సీ చివరికీ ఏం తెలుసుకుందనేది వచ్చే సీజన్ లోనే చూడాలి. అసంపూర్తిగా ఉన్నఈ ఝాన్సీని వీకెండ్ లో టైమ్ పాస్ కోసం మాత్రం కచ్చితంగా చూడొచ్చు.

  English summary
  Anjali Chandini Chowdary Starrer Crime Thriller Web Series Jhansi Review And Rating In Telugu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X