Don't Miss!
- Sports
INDvsNZ : తొలి టీ20 ముందు టీమిండియాకు బూస్ట్.. డ్రెస్సింగ్ రూంలో లెజెండ్!
- News
హిందూపురంలో బాలయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం- సుదీర్ఘ విరామం తరువాత రావడంతో..
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Fall Series Review: కన్న వాళ్లే చంపేందుకు ప్రయత్నిస్తే.. అంజలి 'ఫాల్' రివ్యూ.. హైలెట్ గా క్లైమాక్స్!
రేటింగ్: 2.5/5
టైటిల్: ఫాల్ వెబ్ సిరీస్
నటీనటులు: అంజలి, ఎస్పీ చరణ్, సోనియా అగర్వాల్, సంతోష్ ప్రతాప్, నమితా కృష్ణమూర్తి తదితరులు
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి
రచన: కరుణ్ దేల్ రాజేష్, సిద్ధార్థ్ రామస్వామి
దర్శకత్వం: సిద్ధార్థ్ రామస్వామి
సంగీతం: అజేష్ అశోక్
నిర్మాతలు: ఎస్పీ చరణ్, దీపక్ ధర్, రాజేష్ చద్దా
విడుదల తేది: డిసెంబర్ 9, 2022
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఎపిసోడ్స్ సంఖ్య: 7 (డిసెంబర్ 9న 3, 16న 2, 23న 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు)
సూపర్ స్టార్ మహేశ్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్ హిట్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో అచ్చమైన తెలుగు అమ్మాయిగా ముద్ర వేసుకున్న ముద్దుగుమ్మ అంజలి. హీరోయిన్ గానే కాకుండా సరైనోడు, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో కూడా ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో అంజలి ఎక్కువగా ఓటీటీ కంటెంట్ వైపు అడుగులేస్తుంది. ఎక్కువగా వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తోంది.
ఇటీవల యాక్షన్ ఎంటర్టైనర్ ఝాన్సీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అంజలి తాజాగా మరో వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అంజలి, ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఫాల్' (Fall Web Series) వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా డిసెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం!

కథ
దివ్వ (అంజలి) తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ స్పోర్ట్స్ సెంటర్ నడుపుతుంటుంది. ఒకరోజు రాత్రి తన బాయ్ ఫ్రెండ్ డేనియల్ (సంతోష్ ప్రతాప్) గురించి ఒక సీక్రెట్ తెలుసుకుంటుంది. దాని గురించి మాట్లాడాలని తన వదిన, బెస్ట్ ఫ్రెండ్ మలార్ (సోనియా అగర్వాల్) కు మెసేజ్ పంపుతుంది. అదే రోజు రాత్రి తన ఫ్లాట్ పై నుంచి కింద పడి కోమాలోకి వెళ్తుంది. 6 నెలలు గడిచాక దివ్యను చంపేద్దామని ఇంట్లోవాళ్లందరు నిర్ణయించుకుంటారు. కానీ ఇంతలో దివ్య కోమాలో నుంచి బయటకు వస్తుంది. అది తెలిసిన దివ్య చెల్లెలు మాయ (నమితా కృష్ణమూర్తి), అన్నయ్య రోహిత్ (ఎస్పీ చరణ్) కంగారు పడతారు.
కానీ, దివ్య తన గతం మర్చిపోవడంతో ఊపిరి పీల్చుకుంటారు. తన గతాన్ని వెతికే పనిలో ఉంటుంది దివ్య. అప్పుడు దివ్య ఏం తెలుసుకుంది? దివ్యది ఆత్మహత్యా? హత్య? దివ్య స్పోర్ట్స్ సెంటర్ ను అమ్మేందుకు రోహిత్ ఎందుకు ప్రయత్నిచాడు? అందుకోసం ఎవరెవరితో చేతులు కలిపాడు? ఏం చేశాడు? స్పోర్ట్స్ సెంటర్ లోని జీవాకు దివ్యకు ఉన్న సంబంధం ఎలాంటింది? వంటి తదితర విషయాలు తెలియాలంటే ఈ ఫాల్ చూడాల్సిందే.

విశ్లేషణ
ఇటీవల ఝాన్సీ అనే యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న అంజలి మరోసారి ఫాల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు, సింగర్ ఎస్పీ చరణ్ నటించడం విశేషం. గత ఝాన్సీ వెబ్ సిరీస్ లానే ఇదికూడా మెమోరీ లాస్ నేపథ్యంతో సాగింది.
అయితే 2012లో వచ్చిన వర్టీజ్ అనే కెనడా వెబ్ సిరీస్ కు రీమేక్ గా ఈ ఫాల్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. తమిళంలో చిత్రీకరించిన ఈ సిరీస్ ను తెలుగుతోపాటు వివిధ భాషల్లో డబ్ చేశారు. ఈ ఫాల్ సిరీస్ ను ఎపిసోడ్స్ ను విడతల వారీగా విడుదల చేశారు. డిసెంబర్ 9న మూడు, 16న రెండు, 23న ఆఖరి రెండు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు.

ఆ అంశాలపైనే ఎపిసోడ్స్..
దివ్య ఫ్లాట్ పై నుంచి కిందపడే సీన్ తో ఆసక్తిగా ప్రారంభించిన ఫాల్ వెబ్ సిరీస్ లో మొదటి మూడు ఎపిసోడ్స్ అంతా పాత్రల పరిచయానికే అన్నట్లుగా సాగాయి. దివ్య భవనంపై నుంచి పడిపోతే.. వాళ్ల ఇంటి సభ్యులు ఎలా ఫీల్ అయ్యారు. తర్వాత కోమా నుంచి బయటకు వచ్చాక వాళ్ల ప్రవర్తన ఏంటీ అనే దానిపైనే ఆ ఎపిసోడ్స్ సాగాయి.
దివ్య స్పోర్ట్స్ సెంటర్, ఒక మెట్రో ప్రాజెక్ట్, క్యారెక్టర్ల బలాలు, బలహీనతలు, వంటి అంశాలపైనే ఈ ఎపిసోడ్స్ నడిచాయి. అలాగే దివ్య తన గతాన్ని గుర్తు తెచ్చుకోవాడానికి ప్రయత్నించడం, దానికి ఆమె ఫ్రెండ్, వదినా మలార్ (సోనియా అగర్వాల్) సహాయం చేయడం వంటి సన్నివేశాలే ఎక్కువ కనిపిస్తాయి.

హైలెట్ గా క్లైమాక్స్ ట్విస్ట్..
మూడో ఎపిసోడ్ చివరిలో చిన్న ట్విస్ట్ తో క్యూరియాసిటీ పెంచారు. ఇక నాలుగో ఎపిసోడ్ నుంచి ఆసక్తిగానే సాగుతుంది. దివ్య తన గతం, డేనియల్, స్పోర్ట్స్ సెంటర్ లోని కుర్రాడు జీవాతో తనకున్న సంబంధం వంటి తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇంట్రెస్టింగ్ గానే చూపించారు.
స్పోర్ట్స్ సెంటర్ ను అమ్మేందుకు డేనియల్, అతని బిజినెస్ పార్టనర్ కృతికా (శష్టికా రాజేంద్రన్), రోహిత్ ప్లాన్ చేయడం.. వాటిని దివ్య తిప్పికొట్టేందుకు చేసే ప్రయత్నం కొంతవరకు బాగానే ఉంది. లాస్ట్ రెండు ఎపిసోడ్స్ చాలా క్యూరియాసిటీ పెంచుతాయి. అక్కడక్కడ సీరియల్ చూసిన అనుభూతి కలుగుతుంది తప్పా వెబ్ సిరీస్ ను ఆసక్తిగానే మలిచారు డైరెక్టర్ సిద్ధార్థ్ రామస్వామి. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది. అది వెబ్ సిరీస్ కు హైలెట్ గా నిలిచింది.

ఎవరెలా చేశారంటే..
అంజలికి ఇలా గతం మర్చిపోయి.. తన తన కథేంటో వెతుక్కునే పాత్ర చేయడం ఇది రెండోసారి. అంజలి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక ఎస్పీ చరణ్ నెగెటివ్ షేడ్స్ తో కొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇన్నోసెంట్ గా కనిపిస్తూ స్పోర్ట్ సెంటర్ అమ్మి డబ్బు చేసుకోవాలని చూసే వ్యక్తిగా ఒదిగిపోయారు. సోనియా అగర్వాల్ పాత్రకు తగినట్లుగా నటించింది.
మిగతా పాత్రలు కూడా పరిధి మేర నటించి ఆకట్టుకున్నాయి. అజేష్ అశోక్ నేపథ్యం సంగీతం వెబ్ సిరీస్ కు ప్లస్ అని చెప్పవచ్చు. సస్పెన్స్ సన్నివేశాల్లో ఆ మూడ్ క్రియేట్ చేశాడు. డైరెక్టర్ అయిన సిద్ధార్థ్ రామస్వామి సినిమాటో గ్రఫీ కూడా అందించారు. విజువల్స్ బాగున్నాయి. మొదటి మూడు ఎపిసోడ్స్ మినహా మిగతా ఎపిసోడ్స్ ను ఎంగేజింగ్ గా తెరకెక్కించారు.

ఫైనల్ గా చెప్పాలంటే..
అంజలి ఫాల్ వెబ్ సిరీస్ ఒక మంచి వెబ్ సిరీస్. డబ్బు, ఆస్తి, జూదం, అసూయ, డిప్రెషన్ వంటి విషయాలు కుటుంబ సంబంధాలను ఎలా చెడగొడతాయే చూపించే ప్రయత్నం చేశారు. విడతల వారీగా ఎపిసోడ్స్ విడుదల చేయకుండా ఒకేసారి అన్ని (7) ఎపిసోడ్స్ రిలీజ్ చేసి ఉంటే ఇంకా మంచి ఫీలింగ్ కలిగేదేమో. స్పోర్ట్ సెంటర్, మెట్రో ప్రాజెక్ట్, రిలేషన్స్ వంటి మేళవింపుతో చక్కని డ్రామానే ఈ ఫాల్ వెబ్ సిరీస్. వీకెండ్ లో మంచి టైమ్ పాస్ కోసం ఈ 'ఫాల్' ను ఫాలో కావొచ్చు.