»   » మాస్, మసాలా ఫార్మూలా (గుంటూరోడు మూవీ రివ్యూ)

మాస్, మసాలా ఫార్మూలా (గుంటూరోడు మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

కరెంట్ తీగ, శౌర్య, ఎటాక్ చిత్రాల ద్వారా అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకులను మెప్పించిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించిన తాజా చిత్రం గుంటూరోడు. టైటిల్ వినగానే మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో పక్కా ఫార్ములా, మాస్ మసాలా చిత్రమని సగటు ప్రేక్షకుడికి అనిపించడం ఖాయం. మనోజ్ లుక్స్, టీజర్ డైలాగ్స్ మంచి మాస్ చిత్రమనే అభిప్రాయాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో మాస్ హీరోగా కనువిందు చేయడానికి గుంటూరోడుగా వచ్చిన మనోజ్ తనదైన శైలిలో మెప్పించడా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

మాస్, మసాలా ఫార్మూలా

మాస్, మసాలా ఫార్మూలా

సూర్యనారాయణకు ఏకైక కుమారుడు కన్నా (మనోజ్). తల్లిని బిడ్డను అతి గారాబంగా పెంచుతాడు. చిన్నతనం నుంచే అన్యాయాన్ని చూస్తే కన్నా సహించలేడు. అలాంటి హైపర్ టెన్షన్ కలిగి ఉన్న కన్నా మూలంగా సూర్యనారాయణకు అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అదే గుంటూరులో పేరుమోసిన క్రిమినల్ లాయర్ శేషు (సంపత్) ఉంటాడు. ఆయన చిరాకు ఎక్కువ. మెంటల్‌గా బిహేవ్ చేస్తుంటాడు. గుంటూరులో తనకు ఎదురులేదనే భ్రమలో బతికే శేషుకు ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉంటుంది. శేషుకు అమృత అలియాస్ అమ్ము (ప్రగ్యా జైస్వాల్) చెల్లెలు ఉంటుంది. తనకు ఏర్పాటు చేసిన పెళ్లిచూపుల కార్యక్రమంలో అమ్ముతో కన్నా ప్రేమలో పడుతాడు. అమ్ము ప్రేమించేలా చేసుకోవడంలో కన్నా సఫలమవుతాడు. కానీ అమ్ము అన్నయ్య శేషుతో ఓ సందర్భంలో గొడవ జరుగుతుంది. ఆ గొడవలో శేషును కన్నా కొడుతాడు. దాంతో కన్నాపై ద్వేషం పెంచుకొని అంతు చూడాలనుకొంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో శేషును కన్నా ఎలా ఎదుర్కొన్నాడు. శేషును మెప్పించి తన అమ్ముతో ప్రేమను పెళ్లి పీటల వరకు ఎలా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో శేషు ఎత్తులకు కన్నా ఎలాంటి పై ఎత్తులు వేశాడు అనేది చిత్ర కథ.


మంచు మనోజ్ కొట్టిన పిండి..

మంచు మనోజ్ కొట్టిన పిండి..

కన్నాగా మంచు మనోజ్ ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. మాస్ పాత్రలను అవలీలగా పోషించే మనోజ్.. ఈ చిత్రంలో కన్నా పాత్రను తనదైన శైలిలో పోషించాడు. ఫైట్స్, పాటలలో ఎప్పటిలానే ఆకట్టుకొన్నాడు. తండ్రి రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి చేసిన భావోద్వేగ సన్నివేశాలను బాగా పండించాడు. తన పాత్ర పరిధి మేరకు మనోజ్ పూర్తి న్యాయం చేయడంలో సఫలమయ్యాడు.


ఉద్వేగ భరిత పాత్రలో రాజేంద్ర ప్రసాద్

ఉద్వేగ భరిత పాత్రలో రాజేంద్ర ప్రసాద్

సూర్యనారాయణగా రాజేంద్ర ప్రసాద్ మంచి పాత్రనే లభించింది. కీలక సన్నివేశాల్లో ఆయన నటన కంటతడి పెట్టించేలా ఉంది. తండ్రి పాత్రలో నటకిరీటి ప్రేక్షకులను మెప్పించాడు. సినిమాకు బలంగా మారాడు.


ఆటపాటకే పరిమితమైన ప్రగ్యా జైస్వాల్

ఆటపాటకే పరిమితమైన ప్రగ్యా జైస్వాల్

అమృత అలియాస్ అమ్ముగా కనిపించిన ప్రగ్యా జైస్వాల్ ఆటపాటలకే పరిమితమైంది. కంచె, ఓం నమో వేంకటేశాయ చిత్రంలో విమర్శకులను మెప్పించిన ప్రగ్యా తన నటనను ఇంకా మెరుగుపరుచుకోవాల్సి ఉంది.


పవర్ ఫుల్ విలన్‌గా మరోసారి

పవర్ ఫుల్ విలన్‌గా మరోసారి

లాయర్ శేషుగా బలమైన విలన్ పాత్రను సంపత్ పోషించారు. సంపత్ విలనిజం పండించడంలో ఏ కాస్త అవకాశం దొరికినా పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. విలనిజానికి కామెడీ టచ్ ఇవ్వడంలో సంపత్‌ది విలక్షణమైన శైలి. కాకపోతే పాత్ర తీరుతెన్నులు పూర్తిస్థాయిలో నటించడానికి అవకాశం ఉండాలి. కాస్త రెగ్యులర్ విలనిజం అయినా సంపత్ పర్వాలేదనించారు.


పొలిటికల్ లీడర్‌గా కోటా

పొలిటికల్ లీడర్‌గా కోటా

ఇక కోటేశ్వర్ రావుగా కోటా శ్రీనివాస్ రావు ఈ మధ్యకాలంలో ఓ ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించారు. శేషు దుష్టచేష్టలను సమర్థించే రాజకీయనేత పాత్రలో ఆయన కనిపించారు. కీలకమైన సన్నివేశాల్లో తనదైన డైలాగ్స్ డెలివరీతో ఆకట్టుకొన్నారు.


అతిథిగా మెరిసిన రావు రమేశ్

అతిథిగా మెరిసిన రావు రమేశ్

మంత్రి కృష్ణారావుగా రావు రమేశ్ నటించాడు. సినిమాలో లేటుగా క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చినా తన మార్కును చూపించాడు. క్లైమాక్స్ సన్నివేశాలకు బలంగా మారాడు.


రొటీన్‌ పాత్రల్లో పృథ్వీ, ప్రవీణ్

రొటీన్‌ పాత్రల్లో పృథ్వీ, ప్రవీణ్

పృథ్వీ పాత్ర నామ్ కే వాస్తే అన్నట్టు ఉంటుంది. మనోజ్ చుట్టు ఉండే స్నేహితుల పాత్రలు మొక్కుబడిగా ఉన్నాయే తప్ప కామెడీకి అంతగా ఉపయోగపడలేదు. ఇన్ స్పెక్టర్ పాత్రలో కనిపించిన రాజా రవీంద్ర అంతగా గుర్తుంచుకొనే పాత్ర కాదు.


రెగ్యులర్ కథ, కథనమే దర్శకుడి అస్త్రం

రెగ్యులర్ కథ, కథనమే దర్శకుడి అస్త్రం

ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా పక్కా మాస్ కథతో మనోజ్‌ను మాస్ హీరోగా ఎలివేట్ చేసే కథాంశాన్ని దర్శకుడు ఎస్కే సత్య ఎన్నుకొన్నారు. రెగ్యులర్ ఫార్మాట్‌లో కొత్తదనం లేని కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం దర్శకుడిగా ఆయన ఓ సాహసమే చేశాడు. మాస్ ఎలిమెంట్స్ దట్టించి రొటీన్ సీన్లను పేర్చుకొంటూ పోయారు. అయితే సీన్లలో కొత్తదనం కనిపించకపోవడం రొటీన్‌గా అనిపించడం వల్ల చిత్ర ప్రథమార్థం బోరింగ్ ఉంటుంది. సెకండాఫ్‌లో కాస్త కొంచెం వేగం పెరిగిన తర్వాత కొంచె లైన్‌లో పడినట్టు కనిపిస్తాడు. కైమాక్స్‌కు వచ్చే సరికి ఏదో ముగించాలన్న ప్రయత్నంలో పడి తడబాటుకు గురైనట్టు కనిపిస్తుంటుంది. చివర్లలో ప్రవేశించిన రావు రమేశ్ క్యారెక్టర్‌తో గందరగోళాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం ఉపశమనం కలిగించే అంశం. కథనం మందగించడం వల్ల ఓ యావరేజ్ చిత్రం చూశామనే భ్రమ ప్రేక్షకుడికి కలుగుతుంది. ఫృథ్వీ, ప్రవీణ్ పాత్రలపై దర్శకుడు ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది.


ఫస్టాఫ్ డల్‌గా.. సెకండాఫ్ వేగంగా

ఫస్టాఫ్ డల్‌గా.. సెకండాఫ్ వేగంగా

రెగ్యులర్ తెలుగు సినిమా ఫార్మాట్‌లోనే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో గుంటురోడు ఫస్టాఫ్ సాగుతుంది. తండ్రి, కొడుకుల మధ్య సన్నివేశాలు, కారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్‌తోనే సగం భాగం నడిచిపోతుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం విలన్ సంపత్, హీరో మనోజ్ మధ్య కాన్‌ఫ్లిక్ట్ అంతగా బలంగా లేకపోవడం క్లైమాక్స్ ఏంటో ముందే ప్రేక్షకుడికి అర్థమవుతుంది. తన దారికి అడ్డుపడుతున్న హీరోను తొలగించుకొనే క్రమంలో సంపత్ వేసే ఎత్తులు కొత్తగా ఉంటే సెకండాఫ్ రంజుగా సాగేది. అయినా మనోజ్ తనకు లభించిన సీన్లను పండించడంతో సెకండాఫ్‌‌‌కు కొంత న్యాయం జరిగింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మాస్ చిత్రాలను అలరించే ప్రేక్షకులకు గుంటూరోడు ఫుల్ మీల్స్ లాంటి చిత్రం.


మాస్ బీట్‌తో డండనకా హుషారు

మాస్ బీట్‌తో డండనకా హుషారు

ఈ చిత్రానికి డీజే వసంత్ సంగీతాన్ని అందించాడు. మంచి మాస్ బీట్‌తో డండనక సాంగ్ హుషారెత్తించింది. సత్య శ్రీనివాస్ రావు కళ, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఒకే. శ్రీ వరుణ్ అట్లూరి నిర్మాణ విలువలు బాగున్నాయి.


మెగాస్టార్ చిరంజీవి వాయిస్ థ్రిల్లింగ్

మెగాస్టార్ చిరంజీవి వాయిస్ థ్రిల్లింగ్

గుంటూరోడు చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణ. కీలక సన్నివేశాల్లో, కథకు బలంగా మారిన సీన్లలో చిరంజీవి గొంతు వినిపించడం ప్రేక్షకులు థ్రిల్ కలిగించే అంశం.


ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

మంచు మనోజ్, ఇతర నటీనటుల యాక్టింగ్
పాటలు


మైనస్ పాయింట్స్
కామెడీ
కథ, కథనం


నటీ నటులు: మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్, సంపత్, రాజేంద్ర ప్రసాద్, కోటా శ్రీనివాసరావు, రావు రమేశ్, ఫృథ్వీ, రాజా రవీంద్ర, ప్రవీణ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్కే సత్య
నిర్మాత శ్రీ వరుణ్ అట్లూరి
బ్యానర్: క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: డీజే వసంత్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి
ఆర్ట్: సత్య శ్రీనివాస్‌రావు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
రిలీజ్ డేట్: మార్చి 3


English summary
Manchu Manoj, Pragya Jaiswal's movie Gunturodu Released This Friday (March 3). SK Satya is the director of the movie and Vasanth has composed tunes to the movie. Actors Kota Srinivasa Rao, Rajendra Prasad and Sampath were a few among other actors who played prominent roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X