For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్రమంగా భయపెట్టే ఆన్యాస్ టుటోరియల్

  |

  ఈ మధ్యకాలంలో తెలుగు హారర్ జానర్ వెలవెలబోతోందనే చెప్పాలి. అడపాదడపా వస్తున్న హారర్ కామెడీలే తప్ప పూర్తిస్థాయిలో నరాలు తెగే ఉత్కంఠ కలిగించే హారర్ సినిమాలు రాలేదనే చెప్పాలి. అయితే ఈ లోటును భర్తీ చేసేందుకు ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆన్యాస్ టుటోరియల్. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కు సిద్ధమైన ఈ వెబ్ సిరీస్ లో రెజీనా, కొత్తగుమ్మ నివేథితా సతీశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ వెబ్ సిరీస్ కథాకమామీషు ఏంటో చూద్దాం.

  కుటుంబ కలహాల నేపథ్యంలో పెరిగే చిన్నారులు, వాటి పర్యావసానాలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ లు కాస్త స్లో నెరేషన్ తో మొదలైనప్పటికీ క్రమంగా ప్రేక్షకులను భయపెడుతూ, ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకు సాగుతుంది. ప్రేక్షకులను క్రమంగా మూడ్ లోకి తీసుకువెళ్లేందుకు ఫిల్మ్ మేకర్లు చేసిన ప్రయత్నమే ఇదని అర్థమవుతోంది.

  Anyas Tutorials Review

  సిరీస్ లో ప్రధాన పాత్ర అయిన ఆన్య మేకప్ టుటోరియల్ ఛానల్ కేంద్ర బిందువుగా కథ మొదలవ్వగా అక్కడి నుంచి క్రమంగా కథ ఊపందుకోవడం ప్రారంభిస్తుంది. అయితే దర్శకుడు కేవలం కొన్ని భయానక ఎపిసోడ్ లకే పరిమితం అవ్వకుండా.. లాక్ డౌన్ నేపథ్యంలో జనాల మానసిక స్థితి, మోడువారుతున్న కుటుంబ బంధాలు వాటి పర్యావసానాల ఆధారంగా ఓ చక్కని హారర్ డ్రామా క్రియేట్ చేశాడనే చెప్పాలి.

  ఇక కథ విషయానికి వస్తే... మధు, లావణ్య అనే అక్కా చెల్లెళ్ల జీవితాల్లో చోటుచేసుకున్న కొన్ని అనూహ్య సంఘటనల సమాహారమే ఈ సిరీస్. చిన్నతనంలో ఎదురైన గడ్డు పరిస్థితులు వారి మనసులను ఎలా ప్రభావితం చేశాయి, వాటి పర్యావాసాలేమిటి అన్నదే కథ. మధు, లావణ్య చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతారు. విధిలేని పరిస్థితుల్లో అప్పటికే ఆర్థిక సమస్యలతో విసిగి వేసారిన తల్లితో పాటూ స్మశానంలోని ఓ ఇంటికి పంచన చేరతారు. అక్కడ లావణ్యకు దెయ్యాల కనిపించడం ప్రారంభిస్తాయి. కానీ, ఆమె మాటలను పట్టించుకునే పరిస్థితిలో తల్లి ఉండదు. అక్క మధు సైతం స్కూలుకు వెళ్లలేకపోతున్నాననే ఫ్రస్ట్రేషన్ లో చెల్లిని తిట్టడం, కొట్టడం ప్రారంభిస్తుంది. ఇది చిన్నారి లావణ్య మనసును తీవ్రంగా కలచివేస్తుంది.

  క్రమంగా కథలోకి వెళ్లిన దర్శకురాలు... ఒక్కో ఎపిసోడ్ ముందుకు సాగుతున్న కొద్దీ ఆడియన్స్ లో క్యూరియాసిటీని కలిగించారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, క్యారెక్టర్లు క్రమంగా తమ అసలు స్వరూపాన్ని ప్రేక్షకుల ముందుకు వస్తాయి. మధు, లావణ్య పాత్రలు పోషించిన చైల్డ్ యాక్టర్లు నందితా, దివ్య తో పాటూ, రెజీనా, నివేదితా తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పాలి. ముఖ్యంగా రెజీనా మధు క్యారెక్టర్ లో ఒదిగిపోయిన తీరు అదిరిపోయింది. అక్క పాత్రలోని కోపం, ప్రేమను చక్కగా బ్యాలెన్స్డ్ గా పోట్రే చేసింది. ఇక తొలి ఎపిసోడ్ లలో నార్మల్ గా కనిపించిన నివేధిత క్రమంలో తనలోని నటిని పరిచయం చేసింది. ముఖ్యంలో లాస్ట్ రెండు ఎపిసోడ్ లలో ఆమె అభినయం చక్కగా కుదిరింది.

  ఇక టెక్నికల్ టీమ్ కు ప్రత్యేకమైన క్రెడిట్ ఇవ్వాల్సిందే. కథకు తగ్గ మూడ్ క్రియేట్ చేయడం టీమ్ సక్సస్ అయింది. ఆర్ట్ డైరెక్టర్లు అభిషేక్ రాఘవ్, తిరుమల, నాగేంద్ర, సౌండ్ డిజైనర్ గౌతమ్ నైర్, మ్యూజిక్ కంపోజర్ అరోల్ కోరెల్లీ, ఎడిటర్ రవితేజ గిరిజాల, సినిమాటోగ్రాఫర్ విజయ్ కె. చక్రవర్తి అద్భుతమైన పనితనంతో ఆకట్టుకున్నారు.

  సోషల్ మీడియాకు పెరుగుతున్న క్రేజ్ పలు జీవితాలను, ముఖ్యంగా యువతను ఏ విధంగా ప్రభావితం చేస్తోంది అన్న కోణంలో సౌమ్యా శర్మ రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు స్లోగా ఎక్కేస్తుంది అనడంలో సందేహమేలేదు. ఇక పల్లవి గంగిరెడ్డి సిరీస్ ను తెరకెక్కించిన తీరు సాంతం ఉత్కంఠభిరతంగా సాగుతుంది. కథను అర్ధాంతరంగా ముగించినట్లు అనిపించినప్పుటికీ, సీజన్ 2 పై భారీ అంచనాలనే క్రియేట్ చేసింది. మరి, అది కూడా ఇదే రేంజ్ లో ఆకట్టుకుంటుందేమో చూడాలి.

  English summary
  A spine chilling web series Anya’s Tutorial is all set to streaming on AHA. Regina Cassandra, Nivetha Satish plays lead roles in the series. The horror thriller is all set to stream on AHA from July 1st.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X