twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి పిడుగు ఢాం

    By Staff
    |

    Allari Pidugu
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: అల్లరి పిడుగు
    విడుదల తేదీ: అక్టోబర్‌ 5, 2005
    నటీనటులు: బాలకృష్ణ, కత్రినా కైఫ్‌, చార్మి,
    పునీత్‌ ఇస్సార్‌, రాహుల్‌ దేవ్‌, పరుచూరి వెంకటేశ్వరరావు,
    చలపతిరావు, కోట శ్రీనివాసరావు, సుబ్బరాజు, రఘుబాబు,
    తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, విజయరంగ రాజు, సుమిత్ర, కవిత, తదితరులు.
    కథ, స్క్రీన్‌ప్లే: పరుచూరి బ్రదర్స్‌
    సంగీతం: మణిశర్మ
    సినిమాటోగ్రఫీ: అజయ్‌ విన్సెంట్‌
    కళ: అశోక్‌
    ఫైట్స్‌: విక్రమ్‌ ధర్మ
    ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
    బ్యానర్‌: పిబి ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌
    నిర్మాత: ఎంఆర్‌వి ప్రసాద్‌
    దర్శకత్వం: జయంత్‌ సి పరాన్జి

    'లక్ష్మీనరసింహ' అనంతరం బాలకృష్ణ- జయంత్‌ల కాంబినేషన్‌లో వచ్చిన మరో పోలీసు కథా చిత్రమిది. పాత్రలు పరిచయమయ్యే సరికే సగం సినిమా పూర్తి కావడం, కథ పాత ద్విపాత్రాభినయ చిత్రాలను గుర్తుకు తేవడం, సహనానికి పరీక్షపెట్టే స్క్రీన్‌ప్లే 'అల్లరి పిడుగు'ని అభాసుపాలు చేశాయి. బాలకృష్ణ గెటప్‌, నటన బాగా ఉన్నప్పటికీ స్క్రిప్టు సుడిగుండంలో అవన్నీమునిగిపోయాయి.

    ఎక్ర్‌స్టా అనుకునే కొడుకు ఎ్రక్స్టార్డినరీ అని ఎలా అనిపించుకుంటాడు? అనే పాయింటుతో నడిచే ఈ కథలో బాలకృష్ణ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేశారు. మేజర్‌ చక్రవర్తి కొడుకులు రంజిత్‌, గిరి (బాలకృష్ణ). చిన్ననాటి నుంచి గిరి చేసే అల్లరి చేష్టలకు తండ్రి విసుగుచెందుతాడు. పెరిగి పెద్దయినా అదే ఒరవడి కొనసాగించే కొడుకు ప్రయోజకుడు కావాలను కోరుకుంటాడు. పెద్ద కొడుకు ఐపిఎస్‌ పూర్తి చేసి ఎసిపిగా జాయినవుతాడు. సర్ఫ్‌రోష్‌ సినిమాలో లాగా ఆయుధాలు స్మగ్లింగ్‌ చేసే జికె (ముఖేష్‌ రుషి)తో తలపడతాడు. గిరి హోటల్‌ పెట్టుకుని సెటిలవుదామనుకుంటాడు. మరో పక్క మరదలు సుబ్బలక్ష్మి (చార్మి)తో ప్రేమాయణం నడుపుతుంటాడు. రంజిత్‌, ఐపిఎస్‌ తానేమీ తక్కువ కాదన్నట్టు జాగింగ్‌కు వచ్చే స్వాతి (కత్రినా కైఫ్‌)తో పాత పాటలు రీమిక్సింగ్‌లో పాడుకుంటూ ఉంటాడు. కథ పాకాన పడేయడానికి రంజిత్‌ స్మగ్లింగ్‌ ముఠాతో పెట్టుకుంటాడు. జికె ప్లాన్‌ ప్రకారం గిరినే స్మగ్లింగ్‌ కేసులో ఇరికించి, అన్న రంజిత్‌తో అరెస్టు చేయిస్తాడు. ఈలోగా గిరికి తన తండ్రికి కూడా జికె వల్ల దెబ్బతిన్న విషయం తెలుస్తుంది. గిరి ఎలా దేశాన్ని రక్షించి, తన తండ్రి పగను, అన్న బాధ్యతను నెరవేర్చాడన్నది మిగితా కథ.

    గజిబిజిగా ఉండి హీరోను ఎప్పడూ బిజీగా ఉంచే స్క్రీన్‌ప్లే చిత్రానికి మరణశాసన ం లాంటింది. అటువంటి స్క్రీన్‌ప్లేను ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్‌ అందించారు. ఇంటర్వల్‌ వచ్చేస్తున్నా పాత్రల పరిచయం పూర్తవదు. కథలోకి రాకపోవడంతో ప్రేక్షకులకు అసహనం కలుగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథ మొత్తం కూరేయాలన్న తాపత్రయంలో రెండో మలుపు, క్లెయిమాక్స్‌కి ప్రిపేర్‌ చేయడం మిస్సై మిసైల్‌లా సినిమాను పేల్చేశాయి. మరో పక్క హీరోలిద్దరూ విలన్‌ చేష్టలకు ఎదురుతిరగకుండా పాసివ్‌గా ఉండిపోయి చివర్లో తలపడతారు. కాబట్టి కాసేపైనా ఆసక్తి రేగింది. అలాగే సెకండాఫ్‌లో చార్మి రెండు బాంబులు తెచ్చి రఘుబాబు సంచిలో వేస్తుంది. పల్లెటూరి అమ్మాయికి ఆ బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయో అర్ధం కాదు. తండ్రి కొడుకు గిరిని ఎందుకు చీదరించుకుంటాడో సరిగా ఎస్టాబ్లిష్‌ కాలేదు. తండ్రీకొడుకుల మధ్య సంబంధమున్న సీన్లు పండకపోవడంతో ఆత్మ లోపించింది. విలన్స్‌ చాలామంది ఉండడంతో ఎవరు మెయిన్‌ విలనో స్పష్టం కాదు. కోట పాత్ర క నీసం కరివేపాకులా కూడా లేకపోవడం విచారకరం. హీరోయిన్లు ఇద్దరూ పోటీలు పడి అందాలు ఒలకబోశారు తప్ప కథని వారు అంగుళం కూడా ముందుకు కదపరు. విలన్‌ హీరోని లొంగదీసుకోడానికి ఎవరో అమ్మాయిని ప్రయోగిస్తానంటాడు. మరిచిపోతాడు. ఇలా స్క్రిప్టులో ఇన్ని లోపాలున్నా బాలకృష్ణ బాగా నటించాడు. రెండు పాత్రల మధ్య తేడాని చక్కగా చూపించాడు. 'నేడే ఈనాడే' పాటను రీమిక్స్‌ చేసి చెడగొట్టారు. దర్శకత్వ పరంగా పెద్దగా మెరుపులు లేవు. కెమెరా ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్‌. నేటి సినిమా ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌ బాగా పెరిగాయి. కొత్త దనాన్ని, స్పార్క్‌ను వారు కోరుకుంటున్నారు. 'అల్లరి పిడుగు' లో అవిలేవు.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X