For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Appudu Ippudu movie Review: గ్రామీణ నేపథ్యంగా ఆకట్టుకొనే ప్రేమకథా చిత్రం

  |

  Rating 2.5/5
  నటీనటులు : సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు
  దర్శకత్వం: చలపతి పువ్వల
  నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు
  సినిమాటోగ్రఫీ: కల్యాణ్ సమి
  సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్
  ఎడిటింగ్: వీవీఎన్‌వీ సురేష్
  ఆర్ట్: ఠాగూర్
  సాహిత్యం: చిరావూరి విజయకుమార్
  విడుదల : 03+09-2021

  Appudu Ippudu movie Review

  రాజకీయ నేతల స్వార్ధపూరిత కక్షల కారణంగా రెండుగా విడిపోయిన ఓ ఊరిలో చదువు గాలికి వదిలేసి బాధ్యతారాహిత్యంగా తిరిగే చలాకీ అబ్బాయి అర్జున్ (సుజన్). జీవితంలో ఏదో జాక్‌‌పాట్ కొట్టాలని కలలు కంటుంటాడు. ఈ నేపథ్యంలో ఓ గ్రామంలోని జెడ్పీటీసీ, చోటా రాజకీయ నేత కుమార్తె (తనిష్క్ రాజన్)‌తో ప్రేమలో పడుతాడు.

  రెండు గ్రామాల పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే సమయంలో సుజన్ తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేశాడు. అర్జున్ ప్రేమలో పడిన రాజకీయ నేత కూతురు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నది. రెండు గ్రామాల మధ్య వైరం పెరగడానికి కారణాలు ఏవి? రెండు గ్రామాల మధ్య ఉన్న విభేదాలను అర్జున్ ప్రేమ పరిష్కరించిందా? అనే ప్రశ్నలకు సమాధానమే అప్పుడు ఇప్పుడు కథ.

  గ్రామీణ నేపథ్యంతో ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రస్ అయిన విలేజ్ పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌గా స్టోరీని చలపతి పువ్వల ఎంచుకొన్న తీరు బాగుంది. దానిని పూర్తి కథగా తెరకెక్కించే ప్రయత్నంలో దాదాపు సఫలమ్యారు. అయితే స్క్రిన్ ప్లేను పక్కాగా, పకడ్బందీగా రాసుకొంటే మంచి నేటివిటి సినిమాగా మారి ఉండేది. సెకండాఫ్‌లో కొంత వేగం మందగించినా క్లైమాక్స్‌కు వచ్చే సరికి కాస్త కుదుటపడినట్టు కనిపిస్తాడు. కథా ప్రయాణంలో గమ్యాన్ని చేరే క్రమంలో కాస్త తడబాటు చలపతిలో కనిపిస్తుంది.

  ఇక సుజన్ విషయానికి వస్తే.. హీరోగా అతడికి తొలి చిత్రం. కానీ కొత్తవాడిలా ఎక్కడా కనిపించడు. మంచి ఈజ్‌తో నటించేందుకు ప్రయత్నించాడు. నటనపరంగా ఇంకా కొన్ని లోపాలను సరిద్దుకోవాల్సి ఉంది.

  Appudu Ippudu movie Review

  ఇటీవల రిలీజైన ఇష్టంగా సినిమాతో గ్లామర్ పరంగా ఆకట్టుకొన్న తనిష్క రాజన్ రాజకీయ నేత కూతురిగా నటించారు. మరోసారి తెలుగు ప్రేక్షకులకు అందంతోనే కాకుండా అభినయంతో ఆకట్టుకొన్నారు. సుజన్‌తో కెమిస్ట్రీని అద్భుతంగా పడించారు. మోడరన్ దుస్తుల్లో క్రేజీగా కనిపించింది. మిగితా నటీనటులు శివాజీరాజా,, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. గ్రామీణ నేపథ్యంగా ఉండే సన్నివేశాలను కల్యాణ్ సమీ అందంగా తెరకెక్కించారు. పద్మనాభ్ భరద్వాజ్ సంగీతం బాగుంది. ముఖ్యంగా రీరికార్డింగ్ కొన్ని సన్నివేశాలకు హైలెట్‌గా మారింది. సురేష్ ఎడిటింగ్, ఆర్ట్ విభాగానికి సంబంధించిన టాగూర్ పనితీరు ఒకేలా ఉంది.

  గ్రామీణ రాజకీయాల్లో ఉండే పగ, ప్రతీకారాల నేపథ్యంగా ఉండే కథకు లవ్ స్టోరిని జోడించిన చిత్రం అప్పుడు ఇప్పుడు. అయితే చిన్న బడ్జెట్ చిత్రమైనా కొన్ని సన్నివేశాలు చాలా రిచ్‌గా అనిపిస్తాయి. ప్రేమ కథలు, గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి అప్పుడు ఇప్పుడు తప్పుకుండా నచ్చుతుంది.

  English summary
  Appudi Ippudu movie Review: A Village backdrop love story
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X