»   » ప్చ్ ...ఇది ‘బిస్కెట్’ మాత్రమే.. (రివ్యూ)

ప్చ్ ...ఇది ‘బిస్కెట్’ మాత్రమే.. (రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5

రీసెంట్ గా వచ్చే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ..ప్రోమోలతో ప్రేక్షకులకు 'బిస్కెట్' వేయిటం మీదే పూర్తి దృష్టి పెడుతున్నారు...కానీ తర్వాత ప్రోమోకు తగ్గ సీన్ సినిమాలో ఉండేలా చూసుకోవటం లేదు. గతంలో వైకుంఠపాళి చిత్రంతో పలకరించిన దర్శకుడు ఈ సారి క్రైమ్ కామెడీ అంటూ మరోసారి ముందుకు వచ్చాడు. అయితే క్రైమ్ కి పెద్దగా న్యాయం చేయకపోయినా,కామెడీకి ఓకే అనిపించాడు...ఉన్నంతలో తాగుబోతు రమేష్ తో నవ్వించాడు. అతని ఫ్యాన్స్ కు బాగా ఈ సినిమా స్వీట్ 'బిస్కెట్'.

అశ్విన్‌ (అరవింద్‌ కృష్ణ), చిట్టి రాజు(వెన్నెల కిషోర్) మంచి ప్రెండ్స్. వీరిద్దరూ ఓ రోజు తమ బాస్ లు(అజయ్,రఘు)పై విసుగెత్తిపోయి...వారిని చంపాలని అనుకుంటారు. అందుకోసం షాడో(అలీ)కి సుపారి ఇస్తారు. అయితే ఈలోగా రఘు మర్డర్ అవుతాడు. దాంతో ఆ మర్డర్ అశ్విన్‌,చిట్టి రాజుల పై పడుతుంది. ఈ కేసు నుంచి వీళ్లెద్దరు ఎలా తప్పించుకుని అసలు హంతకులును ఎలా పట్టించి బయిటపడ్డారన్నదే తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Arvind krishna's latest Biscuit review

హీరో మర్డర్ కేసులో ఇరుక్కుపోవటం...దాని నుంచి బయిటపడటం అనేది క్రైమ్ కామెడీ జెనర్ లో వచ్చే చిత్రాలకి కొత్త పాయింట్ ఏమీ కాదు. కానీ పాత పాయింట్ ని కొత్తగా చెప్పాలన్నారు. స్టైయిట్ గా క్లాసిక్ నేరేషన్ లో సాగిన ఈ చిత్రం కథ పాత నేరేషన్ లోనే సాగటంతో చాలా ప్రెడిక్టుబులిగా మారి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇలాంటి సబ్జెక్టులకు చివరిదాకా సస్పెన్స్ మెయింటైన్ చేయటం అనేది మరో కీలకాంశం. అదీ ఈ సినిమాలో మిస్సైంది. అయితే తాగుబోతు రమేష్ ..రాకెట్ గా చేసిన కామెడీ ఈ లోపాలని కొంతవరకూ దాచగలిగింది. ముఖ్యంగా పరమ రొటీన్ గా మారిన క్లైమాక్స్ కి ప్రాణం పోసాడనే చెప్పాలి. ఈ సినిమాకు మరో మైనస్..స్లో నేరేషన్... కథలో ఉన్న వేగం ...కథనంలో కొరవడింది.

నటీనటుల్లో అరవింద్ కృష్ణ బాగా చేసాడు. అజయ్ కూడా బాగున్నాడు. తాగుబోతు రమేష్...నవ్వించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. హీరోయిన్..చెయ్యటానికి ఏమీ లేదు కాబట్టి గ్లామర్ డాల్ గానే మిగిలింది. దర్శకుడే ..సంగీత దర్శకుడు అయినా సంగీత పరంగా జాగ్రత్తలు తీసుకోలేదు. రీరికార్డింగ్ మాత్రం బాగుంది. సినిమా చూస్తున్నంతసేపూ ఎడిటర్ మీద కోపం వస్తూనే ఉంటుంది. టెక్నికల్ గా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదో తెలియదు కానీ సినిమాలో లింప్ సింక్ జరగలేదు. అది స్పష్టంగా ప్రతీ సీన్ లోనూ తెలిసిపోతూంటుంది.

ఫైనల్ గా ఈ 'బిస్కెట్' ని కేవలం తాగుబోతు రమేష్ కామెడీ కోసం చూడాలి. టీజర్ చూసి గొప్ప క్రైమ్ కామెడీ చూద్దామని ఫిక్స్ అయితే మాత్రం ఎక్సపెక్టేషన్స్ చేస్తే ..దానికి తగ్గ రేంజిలోనే నిరాశ ఎదురౌతుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఈ సినిమా రిలీజ్ కాకుండా ఉంటే బాగుండేది.

చిత్రం: బిస్కెట్‌
సంస్థ: గోదావరి ప్రొడక్షన్స్‌
తారాగణం: అరవింద్‌కృష్ణ, డింపుల్‌ చోపడే, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, అజయ్‌, తాగుబోతు రమేష్‌, వెన్నెల కిషోర్‌, భరత్‌, చలపతిరావు తదితరులు.
నిర్మాత: స్రవంతి, రాజ్‌
సంగీతం, దర్శకత్వం: అనిల్‌ గోపిరెడ్డి
విడుదల: జనవరి 1, 2014 (బుధవారం)

English summary
A new movie on the banner of Godavari Productions title “Biscuit” releaed with average talk. “Its My Love Story” and “Rushi” fame Arvind krishna is playing a lead role in this movie, directed by Anil Gopi Reddy and Produced by Shravanthi and Raj. Dimple Chopade is in the female lead. The music for this movie is given by Anil G. Cinematography by Jayapal Yadav. Thanikella Bharani, Vennala Kishore, Ravi Babu and M.S Narayana are in the support cast. Director said that this movie is a complete comedy entertainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu