For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆర్య - సమీక్ష

  By Staff
  |

  Aarya
  -జలపతి గూడెల్లి

  చిత్రం: ఆర్య

  నటీనటులు: అల్లు అర్జున్‌, అనురాధామెహతా, శివబాలాజీ, బబ్లూ, తదితరులు

  సంగీతం: దేవీశ్రీప్రసాద్‌

  నిర్మాత: రాజు

  కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సుకుమార్‌

  'గంగోత్రి' ద్వారా పరిచయమైన అల్లు అర్జున్‌ నటించిన రెండో చిత్రం 'ఆర్య'. 'దిల్‌' సినిమాకు సంభాషణలు సమకూర్చిన సుకుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తీసిన ఈ సినిమా 'ప్రెజెంటేషన్‌'లో స్టైల్‌గా ఉన్నా, అలరించదు. కారణం దర్శకుడు సుకుమార్‌ 'వండుకొన్న' కథలోనే లోపం. ప్రేమకథలు అన్నీ ఒకేతీరుగా ఉంటాయి, కాబట్టి కొంచెం కొత్తగా 'ద్వేషం'తో మొదలుపెట్టి తీద్దామని అనుకొని ఉంటాడు. అందుకని సరదాగా ఉండే 'ఆర్య' (అల్లు అర్జున్‌) అనే కుర్రాడు - బలవంతంగా ఒకణ్ణి (శివబాలాజీ)ఆల్రెడీ ప్రేమిస్తోన్న 'గీత'(అనురాధా మెహతా)ను ప్రేమించేలా చేసేలా కథను తయారుచేసుకున్నాడు.

  అంతకుముందే ప్రేమిస్తోన్న అమ్మాయి వీడు ఐలవ్యూ అని చెప్పితే, 'ఐ హేట్‌ యూ' అని ఆ అమ్మాయి చెప్పినా, తిరిగి అమ్మాయి చివరికి వీడినే పెళ్ళి చేసుకునేలా కథ నడిపించాలని దర్శకుడు కథ అనుకొని..దానికోసం రకరకాలుగా స్టోరీని 'కుకుడ్‌అప్‌' చేశాడు. 'నా ప్రేమను శాపంగానో..ద్వేషంగానో..' భావించమని వేడుకొని వాడిని కూడా హీరోగా చేసే భావ దౌర్భాగ్యం మన తెలుగు, తమిళ చిత్రాల్లోనే కన్పిస్తుంది. అయితే, అల్లు అర్జున్‌ హీరోయిన్‌ను తనవైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నమంతా సరదాగా తీయడంతో ప్రథమార్థం హాయిగానే ఉంటుంది. కానీ ద్వితీయార్థంలోనే సినిమా సాగిపోతుంటుంది.

  హీరోయిన్‌ ఇందులో డమ్మీ. శివబాలాజీ, అర్జున్‌ ఇద్దరు హీరోయిన్‌ ప్రేమకోసం బలవంతంగానే ప్రయత్నిస్తుంటారు -కానీ, హీరోయిన్‌ అసలు ఫీలింగ్స్‌ ఏమిటో పట్టించుకోకుండా. ఇక, సగటు హీరోయిన్‌ లాగానే, ఆమె శివబాలాజీ వైపు కాసేపు, అర్జున్‌ వైపు కాసేపు 'ప్రేమ'గా చూస్తుంటుంది. శివబాలాజీని, హీరోయిన్‌ను పెళ్ళి చేసుకునేలా చూడడమే నా బాధ్యత అని చెప్పుకొని హీరో, వీరి పెళ్ళికి అడ్డుచెప్పిన శివబాలాజీ తండ్రి (రాజన్‌.పి.దేవ్‌) మనుషులను చంపేసి..వీరిని ఎక్కడో తెలియని అడవుల్లోకి తీసుకెళ్లి రక్షిస్తాడు. అక్కడ హీరోయిన్‌ అర్జున్‌ 'గొప్పతనం' తెలుసుకొని, తన ఫీలింగ్స్‌ చెపుతుంది. కానీ హీరో చెవులు మూసుకొని ఉంటాడు ఆ సమయంలో. సడెన్‌గా మాయయైపోయిన శివబాలాజీ ఆయన తండ్రిని ఒప్పించి హీరోయిన్‌ తీసుకుపోయిందుకు వస్తాడు.

  సో.. ఇక పెళ్ళి. పెళ్ళిపీటలకు ముందు వెళుతున్నప్పుడు..అర్జున్‌ తన ఫీలింగ్స్‌...చెప్పి మళ్ళీ వెంటనే జోక్‌ చేశానని..వెళ్ళిపోతాడు. పెళ్ళిపీటల మీద కూర్చున్నాక, హీరోయిన్‌ 'నాకు ఆర్య కావాలి..' అంటూ ఏడ్చుకుంటూ..అదే పట్టుబట్టలతో పరిగెత్తుకుంటూ.. ఎక్కడో ఊరవతల చెరువుగట్టు మీద కూర్చొన్న ఆర్య దగ్గరికి వెళ్ళి కౌగలించుకుంటుంది. సినిమా అయిపోతుంది.

  సినిమాలో ప్రధానంగా 'బలవంతం' ప్రేమ, బలవంతపు సీన్స్‌ సృష్టించడం లోపం. టేకింగ్‌ మాత్రం బాగుంది. 'సేతు' సినిమాతో అందర్నీ ఆకట్టుకొన్న రత్నవేలు ఫోటోగ్రఫీ సినిమాకు 'మంచి లుక్‌'నిచ్చింది. ప్రతి ఫ్రేము చాలా అందంగా, కొత్త 'కోణం'లో తీశాడు. దానివల్లే సినిమా చాలా స్టైల్‌గా కన్పిస్తుంది. ఇక మరో ప్లస్‌ పాయింట్‌..దేవీశ్రీప్రసాద్‌ సంగీతం. ఒక్క పాట మినహా అన్ని పాటలు బాగున్నాయి.

  అల్లు అర్జున్‌..తొలి సినిమాకన్నా బాగానే చేసినా..ముఖంలో అందం లేదు. హీరోయిన్‌ హీరో కన్నా భారీ ఆకారం, పెద్ద గొప్పగానూ లేదు. శివబాలాజీ అందరికన్నా బాగా చేశాడు. దర్శకుడు మణిరత్నం లవెల్లో మధ్య మధ్యలో పిల్లలను హీరో చుట్టూ వెంటేసి పంపుతూ, హీరోయినికి 'గీతాంజలి' టైఫ్‌లో 'భావుకత' చూపించడం వంటివి చేశాడు..కానీ కథలోనే పస లేదు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X