Just In
- 7 hrs ago
చిరంజీవి సినిమా ఫస్ట్‌షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్
- 8 hrs ago
రైతు బిడ్డ రైతే కావాలి.. ఆ రోజు వస్తుంది.. వ్యవసాయం లాభసాటిగా.. ఆవేశంగా ప్రసంగించిన చిరంజీవి
- 8 hrs ago
చిరంజీవి వారసత్వం ఎవ్వరికీ దక్కదు... ఆ స్థాయి ఆ ఒక్కడికే.. శర్వానంద్ షాకింగ్ కామెంట్స్
- 9 hrs ago
శర్వానంద్ నా బిడ్డలాంటి వాడు.. రాంచరణ్ ఫోన్ చేసి.. శ్రీకారం ఫంక్షన్లో చిరంజీవి ఎమోషనల్
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- News
మోడీపై దీదీ గుస్సా.. దేశం పేరు కూడా మారుస్తారని ధ్వజం
- Finance
భారీగా పడిపోయిన బంగారం ధరలు, 10 గ్రాములు రూ.44,200 మాత్రమే!
- Sports
India vs England: 'సాహా అత్యుత్తమ కీపర్.. కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలి'
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Ashwathama మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టాలీవుడ్ యువ హీరోల్లో కొత్తగా ప్రయత్నించాలనే తపన కలిగిన హీరో నాగశౌర్య. ఎప్పటికప్పుడు డిఫరెంట్ రోల్స్‌తో ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తుంటాడు. గత కొన్ని సినిమాలు ఆశించినంతగా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తానే కథకుడిగా మారి అశ్వత్థామ చిత్రంతో ముందుకొచ్చాడు. 31 జనవరి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నాగశౌర్యకు ఎలాంటి ఫలితానని అందించింది. తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమైన రమణ రాజ ఆకట్టుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కథ, కథనాలు ఏంటో తెలుసుకొందాం..

కథ
యూఎస్ రిటర్న్ గణ (నాగశౌర్య) హ్యాపీగా లైఫ్‌ను ఎంజాయ్ చేసే విశాఖపట్నం అబ్బాయి. తన విశాఖలో అమ్మాయిలు అదృశ్యం కావడం, ఆ తర్వాత మరుసటి రోజే కనపడటం జరుగుతుంటుంది. ఆ తర్వాత మూడు నెలలకు గర్భవతులు అవుతుంటారు. ఇలాంటి క్రమంలో తన సోదరికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురువుతుంది.

కథలో మలుపులు
విశాఖలో అమ్మాయిల కిడ్నాప్ వెనుక కుట్ర ఏమిటి? వారిని ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశాడు? అదృశ్యమైన అమ్మాయిలు గర్భవతులు కావడం వెనుక కారణమేమిటి? తన చెల్లెలికి జరిగిన అన్యాయానికి గుణ ఎలాంటి పరిష్కారం చూపారు. అమ్మాయిల కిడ్నాప్ చేసే ముఠాను గుణ ఎలా భగ్నం చేశాడు? చివరకు ఆ ముఠాకు ఎలా చెక్ పెట్టారు అనే ప్రశ్నలకు సమాధానమే అశ్వత్థామ సినిమా కథ.

ఫస్టాఫ్ అనాలిసిస్
అశ్వత్థామ సినిమా ఓ అమ్మాయిని ట్రాప్ చేయడమనే సీన్‌తో కథ ప్రారంభమవుతుంది. పవన్ కల్యాణ్ వాయిస్‌తో కుటుంబాన్ని పరిచయం చేయడం స్పెషల్‌గా ఉంటుంది. తొలి భాగంలో ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండటంతో ప్రేక్షకుడు కథలో లీనం కావడానికి అవకాశం ఉంటుంది. హీరో ఇంట్రడక్షన్, చెల్లెలు నిశ్చితార్థం లాంటి సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గా ఉంటాయి. తాను అమితంగా ప్రేమించే చెల్లెలు ప్రియా ఆత్మహత్యకు పాల్పడటం ఎమోషనల్‌గా ఉంటుంది. తొలి భాగంలో కథనం వేగంతో సాగుతుంది.

సెకండాఫ్ అనాలిసిస్
సెకండాఫ్‌లో కథ కాస్త రొటీన్‌గా మారి వేగం మందగించినట్టు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో నాగశౌర్య చేసిన సినిమాల్లో బెటర్ అనే ఫీలింగ్‌తో ముగుస్తుంది. పోస్ట్ మార్టం స్పెషలిస్ట్ అయిన డాక్టర్ మనోజ్ కుమార్ (జిషుసేన్ గుప్తా) ఎంట్రీ.. అతని క్రూరత్వాన్ని పరిచయం చేయడం లాంటి సీన్లతో సెకండాఫ్ మొదలవుతుంది. గణ వెంబడించిన ఆ నలుగురిని మనోజ్ కిరాతకంగా చంపడంతో అతనేంత క్రూరుడో చూపించడం, వీరు చనిపోయారని తెలియక గణ వెతకడం లాంటి సీన్లతో అలా ముందుకు వెళ్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె కూడా కిడ్నాప్‌కి గురవడంతో కథ చకచకా ముందుకు సాగుతుంది. ఇక అక్కడినుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కథ ఆసక్తికరంగా సాగుతుంది. అయితే క్లైమాక్స్ ను సాదాసీదాగా ముగించినట్టు అనిపిస్తుంది.

దర్శకుడి ప్రతిభ
అశ్వత్థామ చిత్రంతో తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమైన రమణ తేజ మంచి పాయింట్‌తో కథను సిద్ధం చేసుకొన్నట్టు కనిపిస్తుంది. సినిమాను సిస్టర్ సెంటిమెంట్‌తో సైకో థ్రిల్లర్ మలిచేందుకు ప్రయత్నించడం కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే కథను డీల్ చేయడంలో అనుభవం రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాకపోతే తొలి చిత్ర దర్శకుడిగా ఓ వర్గం ప్రేక్షకుల మన్ననలను అందుకోవడం ఖాయం.

నాగశౌర్య డిఫరెంట్‌గా
ఇక లవర్ బాయ్‌గా కనిపించే నాగశౌర్య అశ్వత్థామలో ఓ డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాడు. అమ్మాయిలు, చెల్లెలికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకొనే పాత్రలో ఒదిగిపోయాడు. ఓ రకమైన ఇమేజ్ ముద్ర పడకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం నాగశౌర్య అభిరుచికి అద్దం పట్టింది. యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. ఫ్యామిలీ కథతో తన ప్రతిభను చాటుకొనేందుకు చేసిన ప్రయత్నంగా అనిపిస్తుంది. కథను కూడా తాను అందించడం విశేషం.

మెహ్రీన్, ఇతర పాత్రల్లో
నాగశౌర్య ప్రియురాలిగా మెహ్రీన్ కనిపిస్తుంది. పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో ఆమె తన టాలెంట్‌ను ప్రదర్శించడానికి అవకాశం లేకపోయింది. గ్లామర్ పండించడంతోపాటు ఆటపాటలకే పరిమితమైంది. ఇక నాగశౌర్య సోదరి భర్తగా ప్రిన్స్, క్రూరమైన విలన్‌గా జిషుసేన్ గుప్తా ఆకట్టుకొన్నాడు. ఇతర కీలక పాత్రల్లో పోసాని తదితరులు కనిపిస్తారు.

టెక్నికల్‌గా
అశ్వత్థామ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించారు. రెండు సిస్టర్ సెంటిమెంట్ పాటలు బాగున్నాయి. మెహ్రీన్‌తో డ్యూయెట్ ఒకే అనిపిస్తుంది. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ విభాగానికి ఇంకా చాలానే పనుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ ఎఫర్ట్ ఓకే.

ఫైనల్‌గా
అశ్వత్థామ సీరియస్‌గా సాగే ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా. ఆసక్తికరమైన పాయింట్‌ను సరిగా తెర మీద కన్విన్సింగ్ చెప్పడంలో తడబాటుకు గురయ్యారని చెప్పవచ్చు. కామెడీ ఆశించే ప్రేక్షకులకు కొంత నిరాశే. సీరియస్, థ్రిల్లర్ సినిమాలను ఆశించే వారికి నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం.

బలం, బలహీనతలు
ప్లస్ పాయింట్స్
నాగశౌర్య,
ఫీల్ గుడ్ కథ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
కథ గమనానికి అడ్డుపడేలా పాటలు
సాగదీతగా అనిపించే కొన్ని సీన్లు

నటీనటులు
నటీనటులు: నాగశౌర్య, మెహ్రీన్ పిర్జాదా, ప్రిన్స్, పోసాని కృష్ణమురళి, జిషుసేన్ గుప్తా
దర్శకత్వం: రమణ తేజ
కథ: నాగశౌర్య
స్క్రీన్ ప్లే: రమణ తేజ, ఫణీంద్ర బిక్కిన
డైలాగ్స్: పరశురాం
నిర్మాత: ఉషా ముల్పూరి
సంగీతం: జిబ్రాన్, శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫి: మనోజ్ రెడ్డి
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
రిలీజ్ డేట్: 2020-01-31