twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఔను..ఇది సాధారణ చిత్రం

    By Staff
    |

    Aunu Valliddar Istapaddaru
    చిత్రం: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
    నటీనటులు: రవితేజ, కళ్యాణి, ప్రసన్న
    సంగీతం: చక్రి
    నిర్మాత: వల్లూరిపల్లి రమేష్‌
    సమర్పణ: ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: వంశీ

    ఎక్కడా బోర్‌ కొట్టించకుండా, మనకు తలనొప్పి రాకుండా..హాయిగా ఉంటే..దాన్ని మంచి సినిమాగానే పరిగణించాలి వస్తే..ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రాన్ని అదే కేటగిరీలో జత చేయాలి. కానీ కొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తే..ఇందులో బోల్డన్ని లోపాలు. వంశీ కొంచెం గ్యాప్‌ తర్వాత తీసుకొని...తన యూజువల్‌ స్టైల్‌ లో తీసినా, అతను ఇంకా 'ఫామ్‌'లోకి రాలేదనే చెప్పాలి. పూర్తిగా కామెడీని ఉపయోగించుకొని మధ్య తరగతి జీవితాలను ప్రతిబింబంచడం వంశీ స్టైల్‌. కథలో ట్విస్ట్‌ ఉండడం ఆయన ప్రత్యేకత. కానీ ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారులో మాత్రం అక్కడ అక్కడ మెరుపుల్లా కామెడీ మినహా వినగానే అతుక్కుపోయేలా లేదు. ఇందులో ఆయన చెప్పినదే మళ్ళీ కొత్తగా చెప్పడానిక ప్రయత్నించాడు కానీ...దర్శకుడిగా ఆయన బోలెడన్ని తప్పులు చేశాడు. ప్రధానంగా సీన్స్‌ లో కంటిన్యూటీని పాటించకపోవడాన్ని క్షమించలేం.

    ఈ సినిమాకు ప్రధాన ఎస్సెట్‌ - చక్రి అందించిన మెలోడియస్‌ గీతాలు. వంశీకి ఇళయారాజా అందించిన మాదిరిగా చాలా చక్కటి సంగీతాన్ని అందించాడు. ఇవి వినడానికి చాలా బాగున్నాయి. కానీ వచ్చిన చిక్కల్లా...కథలో పాటలు అవసరం లేనప్పుడు రావడం, వాటిని చిత్రీకరించిన విధానం చాలా పేలవంగా ఉండడంతో..వంశీ క్రియేటివిటి సన్నగిల్లందని మనం రూడీ అయిపోతాం.

    రవితేజ, కళ్యాణిలిద్దరూ కష్టాల్లో ఉన్న బ్యాచిలర్స్‌. కళ్యాణి ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఓ రూంలో ఉంటుంది. వాచ్‌ మెన్‌ ఉద్యోగం సంపాందిచిన రవితేజకు కూడా ఇదే రూంను కేటాయిస్తాడు ఓనర్‌. నైట్‌ అంతా రవితేజ ఉండడు, పగలు అంతా..కళ్యాణి ఉండదు కదా! సో ఇద్దరి దగ్గర రెంట్‌ తీసుకోవచ్చు అని ఓనర్‌ ప్లాన్‌. ఇలా ఒకరొకరు చూసుకోకుండా కలిసి ఉంటారు. కానీ రవితేజ...సిన్సియర్‌ గా ఆమెకు ఒక లెటర్‌ పెట్టి జరిగిందంతా వివరిస్తాడు. ఇక వీళ్ళ ఉత్తరప్రత్యుత్తరాలు ప్రేమకు దారితీస్తాయి. కానీ ఇద్దరూ కలుసుకోరు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ...రవితేజకు..తన రూంమేట్‌ ఎవరో తెలుస్తుంది. కానీ కళ్యాణికి తెలియదు. చివరికి వీళ్లద్దరూ ఎలా ఒకటవుతారనేది కథ.

    ఎమ్మెస్‌ చేసిన కామెడీ డైలాగ్స్‌, కృష్ణ భగవాన్‌ రిటార్ట్‌ లు వినడానికి బాగున్నాయి. కానీ ఎమ్మెస్‌ డైలాగ్‌ ల పవర్‌ 'సుడిగాలి'లో కొట్టుకుపోతాయి. ఇక ఎమ్మెస్‌ కు పిచ్చి ఉందో, కృష్ణ భగవాన్‌ కు ఉందో ప్రేక్షకుడికి అర్థం కాదు. వంశీ మరేదో పిచ్చిలో పడిపోయి, కన్ఫ్యూజ్‌ అయి ఉంటాడు. శేషు చిత్రం ద్వారా కావేరిగా పరిచయమైన కళ్యాణిగా చాలా అందంగా ఉంది. ఇది వంశీ స్టైల్‌ అందం. బాగా నటించింది కూడా. రవితేజ ఫర్వాలేదు. మొత్తమ్మీద ఏ మాత్రం బోర్‌ కొట్టించిన సాధారణ చిత్రం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X