Don't Miss!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Avatar movie review అవతార్ విజువల్ వండర్.. జేమ్స్ కామెరాన్ అద్బుత క్రియేషన్
నటీనటులు: సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, స్టెఫాన్ ల్యాంగ్, జోయల్ డేవిడ్ మోర్, దిలీప్ రావు తదితరులు
రచన, నిర్మాత, దర్శకత్వం: జేమ్స్ కామెరాన్
కంపోజర్: జేమ్స్ హార్నర్
సినిమాటోగ్రాఫర్: మారో ఫియోర్
ఎడిటర్స్: స్టెఫాన్ రివ్కిన్, జాన్ రెఫూవా, జేమ్స్ కామెరాన్
బ్యానర్: లైట్ స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్, డ్యూన్ ఎంటర్‌టైన్‌మెంట్
డిస్ట్రిబ్యూటర్: 20th సెంచరీ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2009-12-10

అవతార్ కథ ఏమిటంటే?
చంద్ర గ్రహం పరిమాణంలో ఉండే పండోరా అనే గ్రహం మీద 2154 సంవత్సరంలో అమెరికా సైన్యం అడుగుపెడుతుంది. పండోరా గ్రహంపైన లభించే అమూల్యమైన సహజ వనరులను లూటీ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఆ గ్రహంపై ఉండే మానవ ఆకారాన్ని పోలిన ఏలియన్ జనాభాను నేవీ (Na'vi) అంటారు.
తమ గ్రహానికి సంబంధించిన వారెవరైనా సరే.. వారిని దారుణంగా మట్టుపెడుతారు. అలాంటి వారిని ఎదుర్కొనడానికి నేటివ్స్ డీఎన్‌ఏతో మానవ డీఎన్‌ఏ జోడించి సైనికులను రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే అవతార్ అనే ఆకారాన్ని సృష్టిస్తారు. అమెరికా సైన్యం నేవీలపై యుద్ధానికి పాల్పడుతుంది

అవతార్ కథలో ట్విస్టులు
నేవీలతో జరిగిన యుద్ధంలో అమెరికా సైన్యం ఎలాంటి వ్యూహాలను రచించింది? అమెరికా సైన్యం దాడులను నేవీలు ఎలా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అమెరికా సైన్యానికి చెందిన జాక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్) నేవీకి చెందిన నేత్రీతో ఎందుకు ప్రేమలో పడుతాడు? అమెరికా సైన్యంపై జాక్ సల్లీ ఎందుకు తిరుగుబాటు చేశాడు? నేవీలపై తిరుగుబాటుకు కల్నల్ మైల్స్ రూపొందించిన నిబంధనలు ఏమిటి? చివరకు అమెరికా సైన్యం, నేవీలకు జరిగిన యుద్దంలో ఎలాంటి ఫలితం తేలిందనే ప్రశ్నలకు సమాధానమే అవతార్ సినిమా కథ.

జేమ్స్ కామెరాన్ టెక్నాలజీ అద్బుతం
అవతార్ సినిమా కథ కోసం దర్శకుడు జేమ్స్ కామెరాన్ క్రియేట్ చేసిన కొత్త ప్రపంచమే ఊహకు అందకుండా ఉంటుంది. ఈ సినిమా కోసం ఉపయోగించిన కంప్యూటర్ గ్రాఫిక్, 3డీ టెక్నాలజీ సినీ ప్రేక్షకులకు అద్బుతమైన అనుభూతిని కలిగించింది. గ్రాఫిక్ వర్క్ తెర మీద నభూతో నభవిష్యత్‌గా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించింది. సినిమా చరిత్రలో అవతార్ ఒక మైలురాయిగా నిలువడంలో జేమ్స్ కామెరాన్ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

మానవుడితో ఏలియన్ ప్రేమకథ
జేమ్స్ కామెరాన్ అల్లుకొన్న కథ తెరపైన అద్బుతంగా ఆవిష్కృతమైంది. మానవుడికి, ఏలియన్‌కు మధ్య నడిపించిన ప్రేమకథ ఆయన సృజనాత్మకతకు అద్దం పట్టింది. యుద్ధం, శాంతి అనే కాన్సెప్ట్‌తో కథను నడిపించిన తీరు బాగుంది. యుద్దం, ప్రేమ కోసం క్రియేట్ చేసిన పండోరా ఒక అద్బుతమైన ప్రపంచంగా మారిందని చెప్పవచ్చు.

అవతార్ విజువల్ వండర్‌గా
అవతార్ సినిమాకు మారో ఫియరే అందించిన సినిమాటోగ్రఫి ఒక విజువల్ వండర్. కొత్త అనుభూతిని అందించే విధంగా జేమ్స్ హోనర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. మేస్ట్రో జో లెట్టేరి స్పెషల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. నేవీల రూపు రేఖల కోసం ఉపయోగించిన నీలిరంగు సినిమాకు మంచి ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా మారిందని చెప్పవచ్చు.
జేమ్స్ కామెరాన్ విజన్.. ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులను, కలెక్షన్లను తుఫాన్‌లా కుమ్మరించింది. ఇలాంటి నేపథ్యంలో అవతార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.