twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బా(ద్‌)షా(రివ్యూ)

    By Srikanya
    |

    -సూర్య ప్రకాష్ జోశ్యుల

    Rating:
    2.0/5
    'బాద్‌ షా డిసైడయితే వార్ వన్‌సైడయిపోద్ది' వంటి పంచ్ డైలాగులు వెంటేసుకుని యాక్షన్ కామెడీ చేస్తూ బాద్ షా ధియోటర్స్ లో దిగేసాడు. బాద్‌ షా గా,వెడ్డింగ్ ప్లానర్ గా... మరో కీలకమైన పాత్రలోనూ(ట్విస్ట్)గా ఎన్టీఆర్ ఎప్పటిలాగే అదరకొట్టాడు. అయితే బాషా సినిమాను కామెడీ వెర్షన్ లో చూసినట్లున్న ఈ చిత్రం శ్రీనువైట్ల రెగ్యులర్ మార్క్ కు తగినట్లు లేదు. కానీ నందమూరి అభిమానులను అలరించే ఎలిమెంట్స్ మెండుగా పెట్టుకోవటంతో వారికి బాగా నచ్చే అవకాసం ఉంది. అప్పటికీ బ్రహ్మానందం... పిల్లి పద్మనాభ సింహం గా రెడీ టైపు కామెడీతో నిలబెట్టే ప్రయత్నం చేసాడు. ఎంతో ఎక్సెపెక్ట్ చేసిన రివేంజ్ నాగేశ్వరరావుగా రామ్ గోపాల్ వర్మని పేరడీ చేస్తూ సాగిన ఎమ్ ఎస్ నారాయణ మాత్రం పెద్దగా పేలలేదు. కథలో ఆ పాత్ర కలవకపోవటమే కారణం కావచ్చు.

    ఇటలీలో ఉంటున్న జానకి(కాజల్) ని అనుకోని పరిస్ధితుల్లో కలిసిన(ఆ తర్వాత అనుకునే కలిసాడని రివిల్ అవుతుందనుకోండి) రామారావు(ఎన్టీఆర్)ఆమెని తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఆమె ఎప్పుడూ చెప్పే బంతి థీరిని తెగ మెచ్చుసుకుంటూ ఆమెని బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తాడు. మరో ప్రక్క అతన్ని ఇంటర్నేషనల్ మాఫియా వెంటాడుతూ చంపేసే ప్రయత్నం చేస్తుంది. వారితో చేసిన ఫైట్ ని తనకోసమే చేసాడుకున్న జానికి అతనితో ప్రేమలో పడిపోయి... పాటలు పాడేసుకుంటుంది. ఇంతకీ ఇతరదేశాలు వచ్చి మరీ రామారావు ఈమెనే ఎంపిక చేసుకుని ప్రేమలో దింపటానికి కారణం ఏమిటి... అతన్ని అంత పెద్ద మాఫియా వెంటేడేటంత గతం ఏమిటి... ఇంతకీ బాధ్షాకీ, ఎన్టీఆర్ కు ఉన్న రిలేషన్ ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    సినిమాలో హీరో గెటప్ ల మీద పెట్టిన శ్రద్ద ని దర్శకుడు కథ మీద పెట్టలేదనిపిస్తుంది. ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో సాగిన ఈ చిత్రం సూపర్ హిట్ రజనీకాంత్ బాషా ని పూర్తి స్దాయిలో గుర్తు చేస్తూ సాగుతుంది. అంతేగాక శ్రీను వైట్ల గత చిత్రాలు ప్రబావం కూడా ఈ సినిమాలో బాగా కనిపిస్తుంది. శ్రీనువైట్ల సక్సెస్ రహస్యమే.. ప్రెష్ కామెడీ. అయితే ఇందులో కీలకంగా సెకండాఫ్ లో జరిగే డ్రీమ్ కామెడీ.. పూర్తిగా.. రెడీ చిత్రంలో బ్రహ్మానందం పాత్రను గుర్తు చేస్తూ సాగటంతో అంత కిక్ ఇవ్వలేదు. అలాగే.. ఎంతో ఎక్సపెక్ట్ చేసిన ఎమ్.ఎస్ నారాయణ స్టార్ డైరక్టర్ పాత్ర కథతో కనెక్టివిటీ లేకపోవటంతో పేలలేదు. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే... విలన్స్ ని ఇరికించటానికి హీరో వేసే ఎత్తుకు.. పై ఎత్తులు లేకపోవటంతో హీరో పాత్ర చాలా చోట్ల ప్యాసివ్ గా మారి... కేవలం బిల్డప్ ల మీద నడపాల్సి వచ్చింది. అయితే ముందే చెప్పుకున్నట్లు ఎన్టీఆర్ మాత్రం చిత్రాన్ని పూర్తిగా తన భుజాల మీద పెట్టుకుని మోసే ప్రయత్నం చేసాడు. ఆయన ఆహార్యం చాలా చోట్ల మెచ్చుకునే రీతిలో సాగింది. ఇక నటనకు, డాన్స్ లకు ఎన్టీఆర్ కు వంక పెట్టే ప్రశ్నే లేదు.

    మిగతా రివ్యూ స్లైడ్ షో లో....

    బా(ద్‌)షా(రివ్యూ)

    ప్రతీ డిపార్టమెంట్ నుంచి ఎక్సలెంట్ వర్క్ తీసుకున్న శ్రీనువైట్ల ఈచిత్రాన్ని యాక్షన్ కామెడీగా మలుద్దామనుకునే ప్రాసెస్ లో... యాక్షన్.. కామెడీ దేని బ్లాక్ దానికే అన్నట్లు విడిపోయాయి. అయితే దర్శకుడుకి పట్టున్న కామెడీ విభాగానికే మంచి మార్కులు పడతాయి.

    బా(ద్‌)షా(రివ్యూ)

    ఈ చిత్రంలో షో మ్యాన్ కేవలం ఎన్టీఆర్... అతని నటన. ముఖ్యంగా అతని కామెడీ టైమింగ్ ని దర్శకుడు బాగా వాడుకున్నాడు... డైలాగులు కూడా న్యాచురల్ గా మంచి ప్లో లో చెప్పటంతో విజిల్స్ వేయిస్తాడు. ముఖ్యంగా తన తాతగారు వేసిన జస్టిస్ చౌదరి గెటప్ లో అయితే థియోటర్ మారు మ్రోగిపోయింది. పెద్ద ఎన్టీఆర్ హిట్ పాటలకు డాన్స్ చేయటం కూడా ఫ్యాన్స్ ని అలరించే అంశమే.

    బా(ద్‌)షా(రివ్యూ)

    నిజం చెప్పాలంటే కాజల్ కు పెద్ద స్కోప్ లేని పాత్ర ఇందులో. అయితే అమాయికమైన ఫేస్ తో... బంతి ఫిలాసపీ చెప్తూ... ఆమె నవ్వులు పూయిస్తుంది. మ్యాటర్ ఏమీ లేకపోయినా ఫస్టాఫ్ నడిచిపోయిందంటే ఆమె క్యారక్టరైజేషనే.

    బా(ద్‌)షా(రివ్యూ)

    వెన్నెల కిషోర్ సినిమా ఫస్టాఫ్ లో మంచి కామెడీనే చేసారు. అతని పాత్ర ఉన్నంతలో బాగానే వర్కవుట్ అయ్యింది.

    బా(ద్‌)షా(రివ్యూ)

    ఇన్సపెక్టర్ పద్మనాభ సింహగా బ్రహ్మానందం పాత్ర... గతంలో చేసిందే అయినా బాగా నవ్వించాడు. ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబినేషన్ బాగా వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా నాజర్ తో బ్రహ్మానందం ఆడుకునే సీన్స్ కు థియోటర్స్ లో బాగా రెస్పాన్స్ వచ్చింది.

    బా(ద్‌)షా(రివ్యూ)

    చిత్రంలో కథని చెప్పటానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ని చాలా చోట్ల ఎఫెక్టివ్ గా వాడారు దర్శకుడు. అది మంచి ఫలితమే ఇచ్చింది.

    బా(ద్‌)షా(రివ్యూ)

    ఇక సిద్దార్ద చేసింది చాలా చాలా చిన్న రోల్ అయినా కథకు కీలకం. దాన్ని కూడా ప్రస్తుత పరిస్దితులకు అణుగుణంగా ప్రసెంట్ చేయటం బాగుంది.

    బా(ద్‌)షా(రివ్యూ)

    నాసర్, సుహాసిని, నవదీప్, ప్రగతి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, తణికెళ్ల వంటి సీనియర్ నటులు కొత్తగా చేయకపోయినా... ఉన్నంతలో ఇమిడిపోయారు.

    బా(ద్‌)షా(రివ్యూ)

    కెమెరా వర్క్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమాలో హైలెట్స్ లో అది ఒకటి. మంచిలైటింగ్ స్కీమ్స్ తో కనుల విందుగా ఉంది.

    బా(ద్‌)షా(రివ్యూ)

    ఎడిటింగ్ సెకండాఫ్ మరింత షార్ప్ గా ఉంటే బావుండేది. డైలాగ్స్ కూడా బాగా పేలాయి.

    బా(ద్‌)షా(రివ్యూ)

    నటీనటులు: ఎన్టీఆర్, కాజల్, నవదీప్, సిద్దార్ద్, బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ తదితరులు.
    సంగీతం: థమన్ ఎస్.ఎస్,
    మాటలు: కోనా వెంకట్, గోపీమోహన్,
    కెమెరా: ఎ.ఎస్.ప్రకాష్,
    ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ,
    నిర్మాత: బండ్ల గణేష్,
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్ల.


    నందమూరి అభిమానులకు బాగా నచ్చే ఈ సినిమా.. కామెడీని ఇష్టపడేవారికి కూడా అదే రేంజిలో అలరిస్తుంది. అయితే పూర్తి స్దాయి శ్రీనువైట్ల మార్క్ చిత్రంలా ఉండాలని వెళితే మాత్రం నిరాసపరుస్తుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Junior NTR has teamed up with ace director Srinu Vaitla for his latest movie Baadshah, which has been carrying very high expectations released today. Bandla Ganesh Babu is producing the film under his home banner Parameshwara Art Productions. The film is a good action entertainer with all other commercial elements like comedy, romance, punch dialogues and good music. But It has a routine story and weak climax. The second half is quite interesting, when compared to the first half.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X