Baahubali: The Epic First Review: బాహుబలి: ది ఎపిక్ మూవీ ఫస్ట్ రివ్యూ
తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవీనేని సంయుక్తంగా రూపొందించిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ అనే రెండు భాగాలు రిలీజై సంచలన విజయం సాధించాయి. ఇండియాలో విడుదలైన అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో అన్నిచోట్ల రికార్డు కలెక్షన్లను సాధించింది. భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో నూతన అధ్యాయం రచించిన ఈ సినిమాను మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకుల వద్దకు తీసుకొచ్చేందుకు సిద్దమయ్యారు.
ఈ సినిమాను రెండు భాగాలు కలిపి ఒకే భాగం చేసి ది బాహుబలి: ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణన్, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని, కోటగిరి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ రాజమౌళి ఎడిటింగ్ బాధ్యతలను, ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ను అందించారు. ఈ సినిమా 2025, అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఈ సినిమాపై సెన్సార్ అధికారులు, ప్రతినిధుల రివ్యూ, ఫీడ్ బ్యాక్ వివరాల్లోకి వెళితే..

బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలను కలిపి ఒక్క సినిమాగా బాహుబలి ది ఎపిక్ పేరుతో అందించబోతున్నాం. దాదాపు పార్ట్ 1 సినిమా ఇంటర్వెల్ వరకు, పార్ట్ 2 చిత్రం ఇంటర్వెల్ తర్వాత ఉండేలా స్క్రీన్ ప్లేను డిజైన్ చేశాం. అయితే కొన్ని సన్నివేశాలను తొలగించి.. ఇప్పటి వరకు చూడని కొన్ని సన్నివేశాలను యాడ్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు కొన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. కొత్తగా చూసే వారికి మంచి అనుభూతిని పంచేలా ఈ సినిమా ఉంటుంది అని శోభు యార్లగడ్డ తెలిపారు.
బాహుబలి: ది ఎపిక్ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమాను పెద్దగా మార్పులు ఏమీ లేకుండా క్లియరెన్స్ ఇచ్చారు. గతంలో అనుసరించిన విషయాలు కావడంతో ఈ సినిమాలో కొత్తగా ఏవైనా సీన్లు ఉంటే వాటిని పరిశీలించి అందులో స్వల్ప మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. పెద్దగా ఎలాంటి మార్పులు లేకుండా ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక బాహుబలి: ది ఎపిక్ సినిమాను వీక్షించిన తర్వాత యూఏ (UA 16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్లు దాటిన యువతీ, యువకులు చూడటానికి అనుమతించారు. ఒకవేళ 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు ఎవరైనా చూడాలనుకొంటే.. వారి తల్లిదండ్రుల పర్యవేక్షణలో గానీ, అనుమతితో గానీ చూడవచ్చని సెన్సార్ అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్‌లో వెల్లడించారు.
2015 సంవత్సరంలో విడుదలైన బాహుబలి: ది బిగినింగ్ సినిమా నిడివి 158 నిమిషాలు కాగా, బాహుబలి: ది కన్‌క్లూజన్ నిడివి 171 నిమిషాలు. మొత్తం కలిపి 329 నిమిషాలుగా ఉంది. కానీ ఈ సినిమాను బాహుబలి: ది ఎపిక్‌గా రూపొందిస్తూ.. ఆ నిడివిని 225 నిమిషాలకు అంటే.. 3 గంటల 45 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా కథను ఎలా డిజైన్ చేశారు. ఏ సీన్లను తొలగించారు. ఎలా కథలో ఇంటెన్సీని తగ్గించకుండా రాజమౌళి మ్యాజిక్ చేయబోతున్నారనే విషయం ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నది. ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్స్, ఎక్స్ క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి..


Click it and Unblock the Notifications











