Baahubali: The Epic Twitter Review: బాహుబలి: ది ఎపిక్ ట్విట్టర్ రివ్యూ

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క శెట్టి, రానా, తమన్నా భాటియా లీడ్ రోల్స్ పోషించిన చిత్రం బాహుబలి. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మించగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజ్, అడవి శేష్, రోహిణి, కల్పలత, రోహిణి, తనికెళ్ల భరణి, ప్రభాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, దర్శకుడు రాజమౌళిలు గెస్ట్ పాత్రలో కనిపించగా.. నోరా ఫతేహి ఐటెం సాంగ్‌లో మెరిశారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటిండ్ నిర్వహించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు.

బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ పేరుతో రెండు భాగాలుగా విడుదలైన ఈ బాహుబలి సిరీస్ బాక్సాఫీస్ లెక్కలను మార్చేసింది. తాజాగా ఈ రెండు భాగాలను కలిపేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు మరోసారి తీసుకురానున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి ది ఎపిక్‌కు సంబంధించి నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో అక్టోబర్ 30వ తేదీ ఉదయం నుంచే ప్రీమియర్స్ పడుతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రముఖుల అభిప్రాయాల్లోకి వెళితే..

Baahubali  The Epic Twitter Review in Telugu  SS Rajamouli extravagant feet Indian onscreen

ఫస్టాఫ్ బ్లాక్‌బస్టర్.. క్రిస్ప్, క్లీన్ అండ్ పర్ఫెక్ట్. అన్‌లిమిటెడ్ గూస్‌బంప్స్‌తో నింపేశారు. రీ రిలీజే కదా అని చూడకపోతే ఆ అనుభూతి మిస్ అవుతారు. అసలు నెక్ట్స్ లెవల్ హై అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

పదేళ్లు అయినాఇంకా అదే ఎమోషన్, అదే గూస్‌బంప్స్. ఒక్కసారిగా ఆ రిలీజ్ డే మెమొరీస్ అన్ని గుర్తొచ్చాయి. ఇది నీ బెస్ట్ ఫిలిం జక్కన్న. బాహుబలి ది ఎపిక్‌ను థియేటర్‌లో మిస్ అవ్వొద్దని ఓ అభిమాని కామెంట్ చేశారు.

బాహుబలి ది ఎపిక్‌ను ఖచ్చితంగా చూడండి. మీరు ముందు చూసినా కానీ, మళ్లీ వెళ్లండి. ఆ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఫైర్. బెస్ట్ స్క్రీన్, బెస్ట్ సౌండ్ ఉన్న థియేటర్స్‌లో వెళ్లండి. బాహుబలి ది ఎపిక్ ఇప్పటికీ ఫ్రెష్ ఫిల్మ్ అన్న అనుభూతిని కలిగిస్తోందని ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు.

యూఎస్ ప్రీమియర్ ముగిసింది. మొదటి సగం హడావిడిగా అనిపిస్తోంది. కానీ సెకాండాఫ్ మాత్రం డ్రామా, యాక్షన్, ఎమోషన్స్‌తో పూర్తి సంతృప్తికరంగా ఉంది. సింగిల్ పార్ట్‌గా సవరించిన బాహుబలి ది ఎపిక్ తప్పక చూడాలనిపించేలా ఉంది అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

ఐమ్యాక్స్‌ని సరిగ్గా ఆప్టిమైజ్ చేశారు. ఇమేజ్, సౌండ్ క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. డబ్బు సంపాదించడానికి చేసే చౌకైన రీ రిలీజ్‌లా కనిపించడం లేదు. బాహుబలి ప్రపంచాన్ని మన కోసం, ప్రపంచం కోసం మరోసారి ప్రదర్శించినందుకు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన బృందానికి ధన్యవాదాలని ఓ యూజర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు.

బాహుబలి ది ఎపిక్ ఫస్టాఫ్ ఇప్పుడే పూర్తయ్యింది. ఈ కళాఖండం స్కేల్, ఎమోషన్, సినిమాటిక్ ఫోర్స్ ఇప్పటికీ ప్రతి ఫ్రేమ్‌లోనూ గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయి. బాహుబలి విడుదలై 10 సంవత్సరాలు అయ్యింది. లెక్కలేనన్ని పీరియాడికల్, వార్ చిత్రాలు వచ్చి వెళ్లిపోయాయి. అయినప్పటికీ బాహుబలిలోని యుద్ధ సన్నివేవశాలు అపూర్వమైనవి. ఏ సినిమా కూడా దాని దరిదాపుల్లోకి రాలేదు. ఈ గొప్ప కళాఖండాన్ని తిరిగి తీసుకురావడానికి వీలు కల్పించిన శోభు యార్లగడ్డకు ధన్యవాదాలని ఓ అభిమాని ట్వీట్ చేశారు.

ఎస్ఎస్ రాజమౌళి.. బాహుబలి రెండు భాగాలు పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లను పునర్నిర్వచించిన గేమ్ ఛేంజర్‌లు. రెండు భాగాలను చూడటానికి ఎక్కువ నిరీక్షించలేను. బాహుబలి ది ఎపిక్ వంటి ప్రయోగం తెలుగు సినిమాకు మొదటిది. ఒక పెద్ద సినిమాలోని రెండు భాగాలు కలిసి ఓ కథను ఏకం చేస్తాయని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

న్యూయార్క్‌లోని ఏఎంసీ లింకన్ స్క్వేర్ 13 వద్ద కిక్కిరిసిన ఐమ్యాక్స్‌లో బాహుబలి ది ఎపిక్‌ను చూస్తున్నా. దశాబ్ధం తర్వాత 3 గంటల 58 నిమిషాల రన్‌టైమ్‌తో కూడా బాహుబలి ఇప్పటికీ రిపీటేడ్‌గా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. మొదటిసారి చూసేవారిని ఇది సీట్ల అంచున కూర్చోబెడుతోంది. రాజమౌళి గారు ఇది ఖచ్చితంగా అసాధారణం అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

షోలే తర్వాత బాహుబలిని అతిపెద్ద, బాగా సెలబ్రేట్ చేసుకున్న భారతీయ చిత్రంగా ఎందుకు పరిగణిస్తారు? దీనికి సమాధానం కావాలంటే యూఎస్ఏలో బాహుబలి ది ఎపిక్ అడ్వాన్స్‌లను చూడండి. రీ రిలీజ్‌లో అక్కడ ఈ చిత్రం వార్ 2.. బుకింగ్‌లను కూడా దాటింది. వందేళ్లకు ఇలాంటి ఓ సినిమా వస్తుంది.

More from Filmibeat

Read more about: ss rajamouli prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X