twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫరవా లేదనిపించే 'బద్రి'

    By Staff
    |

    Badri
    -సౌమిత్‌
    చిత్రం: బద్రి
    తారాగణం: పవన్‌ కళ్యాణ్‌,అమీషాపటేల్‌, రేణుదేశాయి
    సంగీతం: రమణగోగుల
    నిర్మాత: టి.త్రివిక్రమరావు
    దర్శకత్వం: పూరీ జగన్నాథ్‌

    'తొలిప్రేమ', 'తమ్ముడు' చిత్రాల తర్వాత పవన్‌ కళ్యాణ్‌ పై ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్‌ పెరిగాయి. అందుకనుగుణంగానే 'బద్రి' చిత్రంలో పవన్‌ వన్‌ మ్యాన్‌ షోను ప్రదర్శించారు. 'బద్రి' రోటిన్‌ ప్రేమ కథా చిత్రం. కాకపోతే చివర్లో చిన్న ట్విస్ట్‌ పెట్టి రక్తికట్టించే ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు పూరీ జగన్నాథ్‌. అద్భుతమైన సెట్టింగ్‌ లతో 'రిచ్‌' గా తీశాడు. పాటల చిత్రీకరణ కూడా చాలబావుంది. అయితే వెస్ట్రన్‌ మిక్స్‌ పేరిట రమణగోగుల అందించిన సంగీతం ఎవరికీ అర్థం కాదు. రమణగోల లో పాటల సాహిత్యం అస్సలు వినిపించదు.ప్రథమార్థం హాస్యంతో సాఫీగా సాగిన చిత్రాన్ని, ద్వితీయార్థంలో సెంటిమెంట్‌ తో సాగదీశారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే విషాదగీతం ప్రేక్షకులకు బోర్‌ కొట్టిస్తుంది.‌

    బద్రినాథ్‌ (పవన్‌ కళ్యాణ్‌) యాడ్‌ ఫిలిం మేకర్‌. చిన్ననాటి స్నేహితురాలు వెన్నెల(రేణు దేశాయి) అంటే బద్రికి ప్రాణం. ఇద్దరు కొన్నాళ్ళు పాటలు పాడుకొని ప్రేమించుకున్న తర్వాత పెద్దలు పెళ్ళి చేసుకోమంటారు. అయితే పందాలు అంటే ఇష్టపడే బద్రితో వెన్నెల ఓ పందెం కాస్తుంది. దీని ప్రకారం తను చూపించిన అమ్మాయి సరయు(అమిషా పటేల్‌)ని తన కంటే ఎక్కువగా ప్రేమించేలా చేయాలని ఆమె పందెం కాస్తుంది. తను ఇండియాకు తిరిగి వచ్చేలోగా పందెం గెలవాలంటూ ఆమె విదేశాలకు పయనమవుతుంది. రంగంలోకి దిగిన బద్రి తనకు తెలియకుండానే సరయు ప్రేమలొపడిపోతాడు. సరయు అన్నయ్య నందా(ప్రకాష్‌ రాజ్‌ ) పారిశ్రామిక వేత్త. వెన్నెల, బద్రిల మధ్య అనుబంధం గురించి తెలిసిన నందా వీరి ప్రేమను అంగీకరించడు.‌

    దాంతో సరయు ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఇండియాకు వచ్చిన వెన్నెలకు విషయం తెలుస్తుంది. ఆస్పత్రిలో ఉన్న సరయుకు బద్రి పందెం గురించి చెపుతాడు. దీంతో బద్రిని నువ్వే చేసుకోవాలంటే, నువ్వు చేసుకోవాలంటూ సరయు, వెన్నెల వాదనకు దిగుతారు. చివరకు సరయునే బద్రి వివాహమాడుతాడు. అయితే, వెన్నెలకు ఏదో అనారోగ్యం వల్ల గర్భసంచి తీయాల్సి వచ్చిందని, అందుకే ఆమె విదేశాలకు వెళ్ళిందన్న విషయాన్ని నందా బయటపెడుతాడు. ఈ విషయం తెలిసి బద్రి రోదిస్తాడు. ఆపరేషన్‌ తర్వాత తిరిగి వస్తానని, సవతి పోరుకు సిద్దంగా ఉండు అని వెన్నెల సరయుతో అనడంతో చిత్రం ముగుస్తుంది.‌

    సినిమా మొత్తం ప్రతి ఫ్రేంలోనూ పవన్‌ కన్పిస్తాడు. నటన పరంగా కూడా పవన్‌ కళ్యాణ్‌ ఫుల్‌ మార్కులు కొట్టేస్తాడు. నందా పాత్రలో ప్రకాష్‌ రాజ్‌ అవలీలగా నటించాడు. అమిషాపటేల్‌, రేణుదేశాయిలు కూడా తమ పాత్రలకు న్యాయంచేశారు. విజువల్స్‌ రిచ్‌ గా తీయడంలో మధు అంబట్‌ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పాత్ర నామమాత్రమే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X