For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రేక్షకుల్ని కూడా క్షేత్ర పాలకుల్ని చేసిన బద్రీనాధ్ (బద్రీనాధ్ రివ్యూ)

  By Nageswara Rao
  |


  సంస్థ: గీతా ఆర్ట్స్‌
  నటీనటులు: అల్లు అర్జున్‌, తమన్నా, ప్రకాష్‌ రాజ్‌, కెల్లీ దోర్జ్‌, అశ్వనీ కల్‌శేఖర్‌, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, వేణుమాధవ్‌, గీతాసింగ్‌, కృష్ణభగవాన్‌ తదితరులు.
  రచన: చిన్నికృష్ణ
  సంగీతం: ఎం.ఎం.కీరవాణి
  నిర్మాత: అల్లు అరవింద్‌
  దర్శకత్వం: వివి వినాయక్‌

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ గా తన స్టామినను నిరూపించుకోవటానికి ఓ డైనమిక్ పాత్రలో 'బద్రీనాథ్' సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పద్మశ్రీ అల్లు రామలింగయ్య సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ ఫై అల్లు అరవింద్ ప్రతిస్థాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జంటగా తమన్నా హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తొలిసారి వినాయక్ సినిమాకు కీరవాణి బాణిలను అందించారు. విడుదలకు ముందే ఎన్నో అంచనాలకు కేంద్ర బిందువు అయింది ఈ సినిమా. దీనికి కారణం ఈ సినిమా నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకి ఇచ్చినటువంటి పబ్లిసిటీ. విడుదలకు ముందు ఎవరినోట విన్నా బద్రీనాథ్ సూపర్ డూపర్ హిట్ అంటూ ఊదరగోట్టారు. మనరాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా తనకు ఏర్పడిన ఇమేజ్ ను వ్యాపారంగా మార్చుకోవాలని ప్రయోగాలను పక్కన పెట్టి సంచలనం కోసం బద్రీనాథ్ సినిమాతో ఒక అడుగు ముందుకేసిన అల్లు అర్జున్ ఆ ప్రయత్నం లో ఎంతవరకు విజయం సాధించాడో, పరాజయం పాలయ్యాడో చూద్దాం. ఎక్కువ పబ్లిసిటీ, మరన్ని అంచనాలతో విడుదలైనటువంటి బద్రీనాథ్ అభిమానుల అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం..

  భీష్మనారాయణ్‌ (ప్రకాష్‌రాజ్‌) ఉత్సాహవంతులైన యువ బృందానికి శిక్షణ ఇచ్చి యోధుల్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ యోధులలో ఒకరు బద్రి(అల్లు అర్జున్). భీష్మనారాయణ్‌ ఇచ్చినటువంటి కఠినమైనటువంటి ట్రైనింగ్ శిక్షణలో తనదైన ముద్రని వేస్తాడు బద్రి. అతని నైపుణ్యాలను చూసినటువంటి భీష్మనారాయణ్‌ ఒక్కొక్కరినీ ఒక్కో పుణ్యక్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా నియమిస్తారు. బద్రినాథ్‌కి బద్రినాథ్‌ క్షేత్రం దక్కుతుంది. ఒకరోజు బద్రినాధ్ క్షేత్రానికి అలకానంద (తమన్నా) వస్తుంది. అలకానంద యువతికి దేవుడంటే నమ్మకం లేదు. అలక ప్రాణాలకు శంకర్(కెల్లీ దోర్జి) నుంచి ముప్పు ఉందని తెలుసుకున్న బద్రి ఆమెను కాపాడే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకొంటాడు‌. కానీ బద్రి సాహసాలకు, భక్తికి మెచ్చిన భీష్మ నారాయణ అతన్ని తక్షశిలకు తన తరవాత గురువును చేయాలనుకుంటాడు. అలా ఉండాలంటే ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండాలి. దాంతో బాధపడుతున్న అలకనందను ఓదారుస్తూ ఆమె ప్రేమిస్తుంది తననే అని తెలియక బద్రీనాథ్ కు మొక్కుకో నీ ప్రియుడు నీకు దక్కుతాడు అని చెబుతాడు బద్రి. అటువంటి సమయంలో అలకనందాదేవి బద్రినాధ్ ప్రేమలో పడడం, తన ప్రేమని సక్సెస్ చేయాల్సిందిగా బద్రినాధ్ దేవుడుని ప్రార్దించడం జరుగుతుంది. ఆ తరవాత ఏం జరిగింది? బద్రినాథ్‌-అలకల మనసులు ఎలా కలిశాయి అనేదే చిత్ర కథ.

  గతంలో రచయిత చిన్ని కృష్ణ రచించినటువంటి గంగోత్రి, నరసింహానాయుడు, ఇంద్ర లాంటి కధలతో సంబందం లేకుండా కొత్త కధను తయారు చేశారు. ముఖ్యంగా కధను తయారు చేసేటప్పుడు చిన్ని కృష్ణ గారు ప్రేమ గోప్పదా లేక బాధ్యత గోప్పదా అనే రెండు అంశాలను దృష్టిలో పెట్టుకోని ఎవరికీ అర్ధం కాకుండా కధను తయారు చేసినట్లు ఉన్నారు. సినిమాని చూసిన వారందరికి చిన్ని కృష్ణ ఇంత కాలం బద్రినాధ్ కధ గురించి చెప్పినటువంటి మాటలు అంతా తేలిపోయాయి. ఈ సినిమాలో హీరో పాత్ర తప్ప మిగిలినటువంటి ఎవరి పాత్రలు కూడా అంత ఆసక్తిగా లేవు. కధనంలో పట్టులేదు. ఇక సినిమా మొదటి భాగానికి వస్తే సగంలోనే కధ మొత్తం అర్దం అయిపోవడంతో సెకండ్ హాఫ్ అంతా భారంగా నడుస్తుంది. గతంలో వివి వినాయక్ తీసినటువంటి సినిమాల్లో పెద్దగా కధ లేకపోయినప్పటికీ సూపర్ డూపర్ హిట్ కోట్టినటువంటి సందర్బాలు ఉన్నాయి.

  అసలు వివి వినాయక్ నుండి ఆయన అభిమానులు ఇటువంటి కధను మాత్రం ఆలోచించి ఉండకపోవచ్చు. నాకు తెలిసి ఈ సినిమా వివి వినాయక్ గతంలో తీసినటువంటి సినిమాలతో పోల్చితే గనుక కొంచెం సత్తా లోపించింది అనే చెప్పాలి. చిన్ని కృష్ణ రచించినటువంటి కధలో స్పష్టత లేకపోవడంతో ఈసినిమాకి పనిచేసినటువంటి మిగతా సాంకేతిక నిపుణులు కష్టం మొత్తం వృధా అయిందని చెప్పాలి. ఈ సినిమాలో మనం ఇంకోదాని గురించి చెప్పుకోవాలి. అదేంటి అంటే చాలా వరకు అల్లు అర్జున్ మెగాస్టార్‌ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో కూడా విఫలం అయ్యాడనే చెప్పుకోవాలి. ఎప్పుడైనా మెగాస్టార్ నుండి నేర్చుకోవాలే గానీ ఆయన అంత అవ్వాలని అల్లు అర్జున్ అనుకోవడం అవివేకం. భీష్మ నారాయణగా ప్రకాష్ తన సహజ శైలిలో నటించిన పాత్రలో క్లారిటీ లేక చివరికి వచ్చేసరికే తెల్లబోయింది. ఇత కమెడియన్స్ బ్రహ్మానందం, యం.యస్, కృష్ణ భగవాన్, ధర్మవరం చేసినటువంటి కామెడీ కొంచెం ఫరవాలేదని అనిపించింది.

  చివరగా ఈ సినిమాకి పెద్ద ఆకర్షణగా మాత్రం అల్లు అర్జున్ డాన్సులేనని చెప్పుకోవాలి. మొదటి భాగంలో కామెడీ ఫరవాలేదని అనిపించింది. పీటర్ హెయిన్స్ చేసినటువంటి ఫైట్స్ మాత్రం అదరహో అని అనిపించాయి. సెకండ్ హాఫ్ గనుక మరింత బాగుంటే ఈసినిమా గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. సినిమాలో హింసను కూడా ఎక్కువగా ఉంది. తమన్నా మాత్రం అభినయం కంటే కూడా అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాదాన్యం ఇచ్చింది. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్‌కి సినిమా ఏమంత ఎక్కక పోయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మాత్రం నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి సినిమాలోను ఏదో కొంత వైవిధ్యాన్ని ప్రదర్శించాలని అల్లు అర్జున్ అనుకుంటాడు కాబట్టి.

  English summary
  Allu Arjun's latest movie badrinath raised so many expectations due to its package and publicity. The film looked like a blockbuster written all over it. Even the makers confidence suggested the same. With aggressive publicity Badrinath is surrounded by huge hype and the expectations continued to scale new heights by the day.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X