»   » ఎంటర్టెన్మెంట్ విత్ ఎమోషన్ (సల్మాన్ ఖాన్ ‘బజ్రంగి భాయిజాన్’ రివ్యూ)

ఎంటర్టెన్మెంట్ విత్ ఎమోషన్ (సల్మాన్ ఖాన్ ‘బజ్రంగి భాయిజాన్’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

హైదరాబాద్: బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే హడావుడి మామూలుగా ఉండదు. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న ‘బజ్రంగి భాయిజాన్' ఈ రోజు థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఇది కేవలం టిపికల్ సల్మాన్ ఖాన్ మూవీ మాత్రమే కాదు...ఔట్ అండ్ ఔట్ ఎంటర్టెన్మెంట్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాడు దర్శకుడు కబీర్ ఖాన్. మంచి కథ, భావేద్వేగాలతో కూడిన ఈ సినిమాలో సరికొత్త సల్మాన్ ఖాన్‌ కనిపిస్తాడు. ఈ సినిమాకు కథ అందించింది ‘బాహుబలి' చిత్ర రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.

తారాగణం: సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, హర్షాలీ మల్హోత్రా
దర్శకత్వం: కబీర్ ఖాన్

బజ్రంగి భాయిజాన్ కథ:
ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇదరు దేశాల అభిమానులు ఆసక్తిగా చూస్తున్న సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. అదే సమయంలో కెమెరా...సుల్తాన్‌పూర్ విలేజ్‌లోని ప్రెగ్నెంట్ ఉమెన్ వైపు తిరుగుతుంది. ఆమె తన కూతురుకి షహీదా పేరు పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఆరు సంవత్సరాల ముందుకు వెళితే.....షహీదా(హర్షాలీ మల్హోత్రా) సంజోతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ కనిపిస్తుంది. తన కూతురు కండీషన్ గురించి ప్రార్థించడానికి తల్లి ఆమెను ఢిల్లీలోని నిజాముద్దీన్ హజ్రత్ అలీకి తీసుకెలుతూ ఉంటుంది.

తిరుగు ప్రయాణంలో పాకిస్థాన్ వెళ్లాల్సిన షహీదా తన రైలు మిస్సవుతుంది. ఏం చేయాలో తెలియని షహీదా పవన్ కుమార్ చతుర్వేది(సల్మాన్ ఖాన్) వద్దకు చేరుకుంది. ఆమె ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది తెలుసుకోవడానికి సల్మాన్ ఖాన్ చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు.

పవన్ కుమార్ చతుర్వేది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే... తండ్రి అతన్ని ఎందుకూ పనికి రాని వాడిగా చూస్తాడు. తండ్రి మరణం తర్వాత పవన్ కుమార్ ఢిల్లీ బయల్దేరుతాడు. దయానంద్ అకాడాలో చేరుతాడు. ఇక్కడే అతనికి రసికా(కరీనా కపూర్) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు.

ఈ క్రమంలో పవన్ కుమార్ షహీదాను వ్యబిచార ముఠా నుండి కాపాడుతాడు. ఆమెను ఎలాగైనా సేప్ గా ఇంటికి చేర్చాలని నిర్ణయించుకుంటాడు. షహీదాను పవన్ కుమార్ ఇంటికి ఎలా చేర్చాడు? రసికాను పెళ్లాడటానికి ఆమె తండ్రిని ఒప్పించడానికి ఏం చేసాడు అనేది తెరపై చూడాల్సిందే.

రెండు మతాల భావోద్వేగాలు, దేశ సరిహద్దులో పరిస్థితిని బ్యాలెన్స్ చేస్తూ సాగిన బజ్రంగి భాయిజాన్ స్టోరీ పాయింట్ ఆకట్టుకుంది.

పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...

పవన్ కుమార్ చతుర్వేది పాత్రలో సల్మాన్ ఖాన్ పెర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. ఇన్నోసెంట్...సింపుల్ మ్యాన్ క్యారెక్టర్లో ఒదిగి పోయాడు. కరీనా కపూర్ పాత్ర చిన్నదే అయినా తన అందం, అభినయం, పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. నవాజుద్దీన్ సిద్ధికీ తన సహజసిద్దమైన పెర్పార్మెన్స్‌తో మెప్పించాడు. బేబీ హర్షాలీ పెర్పార్మెన్స్ సూపర్. సింగిల్ డైలాగు కూడా లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తో మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, భావోద్వేగాలకు గురి చేస్తుంది.

సల్మాన్ ఖాన్, హర్షాలీ మధ్య వచ్చే సన్నివేశాలు గుండెలకు హత్తుకునే విధంగా ఉంటాయి. కొన్ని సీన్లు మిమ్మిల్నీ భావోద్వేగ పరిచి కళ్లలో నీళ్లు సుడులు తిరిగేలా చేస్తాయి. అదే సమయంలో సల్మాన్ ఖాన్, నవాజుద్దీన్ మధ్య వచ్చే హాస్యభరితమైన, ఎంజాయబుల్ సీన్లు మిమ్మల్ని అలరిస్తాయి.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే...
దర్శకుడు కబీర్ ఖాన్ గ్రేట్ స్టోరీ ఎంచుకున్నాడు. కథకు తగిన విధంగా ఎమోషన్స్ తెరపై చూపించడంతో పాటు పిక్చరైజేషన్ అద్భుతంగా చేయించాడు. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లు మాత్రం బోర్ తెప్పిస్తాయి. కథా రచయిత విజయేంద్రప్రసాద్ అద్భుతమైన కథ అందించారు. ఈ సినిమాకు కథే ప్రాణంగా నిలిచింది..సినిమా అద్భుతంగా రావడానికి తోడ్పడింది.

చివరగా...
సినిమా ఫస్టాఫ్ సింపుల్ గా ఉంది. సెకండాఫ్ కామెడీ, ఎంటర్టెన్మెంటుతో ఆకట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తప్పకుండా చూడాల్సిన సినిమా.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

పవన్ కుమార్ చతుర్వేది పాత్రలో సల్మాన్ ఖాన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్ ఇలాంటి పాత్ర చేసారు.

హర్షాలీ మల్హోత్రా

హర్షాలీ మల్హోత్రా

ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా పెర్ఫార్మెన్స్ హైలెట్. సినిమా మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది.

సల్మాన్-హర్షాలీ

సల్మాన్-హర్షాలీ

సల్మాన్ ఖాన్, హర్షాలీ మల్హోత్రా మధ్య సన్నివేశాలు హార్ట్ టచింగా ఉన్నాయి.

కంటతడి పెట్టిస్తాయి

కంటతడి పెట్టిస్తాయి

సినిమాలో సల్మాన్ ఖాన్ కంటతడి పెట్టే సన్నివేశం మిమ్మిల్నీ భావోద్వేగానికి గురి చేస్తుంది.

యాక్షన్

యాక్షన్


సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా అభిమానులను అలరించే విధంగా తెరకెక్కించారు.

కరీనా

కరీనా

సినిమాలో కరీనా కపూర్ చిన్నపాత్రే చేసినా...ఉన్నంతలో తన సత్తా చాటింది.

సల్మాన్-కరీనా

సల్మాన్-కరీనా

సినిమాలో ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు తక్కువే అయినా...ఇద్దరి జోడీ ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు.

నవాజుద్దీన్

నవాజుద్దీన్

సల్మాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి.

క్వావాలి

క్వావాలి

అద్నాన్ సమీ పాడిన క్వావాలీ పాట ఆకట్టుకునే విధంగా ఉంది.

కామెడీ సీన్స్

కామెడీ సీన్స్

సినిమాలో సల్మాన్ ఖాన్ బుకఖా వేసే సీన్స్ నవ్వు పుట్టించే విధంగా ఉన్నాయి.

English summary
For long, Salman Khan has been giving the Bollywood Box Office super hit blockbuster movies, that are not only loved by the viewers and his fans but contain the true entertainment value.This time with Bajrangi Bhaijaan, he has outdone himself! This is not just a typical Salman movie that is out an out entertainment, this Kabir Khan directorial has story, emotions, a star performance and most important of all, you will see Salman Khan act like he has never done before.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu