twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదే కథ యార్.. (‘డిక్టేటర్‌’ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    సంక్రాంతికి వస్తున్న బాలకృష్ణ సినిమా అంటే ఆ అంచనాలే వేరు. అందులోనూ పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ప్రోమోలు, పోస్టర్స్ తో బాగానే హైప్ క్రియేట్ చేసింది. అయితే దర్శకుడు మాత్రం కేవలం ఆ విషయాల్లోనే జాగ్రత్తలు తీసుకున్నట్లున్నాడు. బాలయ్య గత సినిమాలు చూసి రాసుకున్న స్క్రిప్టుతో వచ్చిన ఈ సినిమా ఫస్టాఫ్ హాలీవుడ్ చిత్రం ఈక్విలైజర్ ని గుర్తు చేసినా ..పూర్తిగా భాషా ఫార్మెట్ లోనే...అంటే...నరసింహనాయుడు, సమరసింహా లాంటి బాలయ్య చేసేసిన లేదా చెప్పేసిన డైలాగులతోనే నడుస్తూ అలరిస్తూంటుంది. హార్డ్ కోర్ బాలయ్య అభిమానులకు నచ్చేటట్లుగా రెడీ అయిన ఈ చిత్రం ఫస్టాఫ్ ఫన్, సెకండాఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపే ప్రయత్నం చేసాడు. ఉన్నంతలో బాలయ్య నటనే సినిమాని చూసేలా చేస్తుంది. అయితే టైటిల్ కు తగ్గ కథ,కథనం లేకపోవటం సగటు సినీ ప్రేక్షకుడుకు బాధిస్తుంది.

    చందు అలియాస్ చంద్ర శేఖర్ ధర్మ(బాలకృష్ణ) ఓ సూపర్ మార్కెట్ లో సాధారణ ఉద్యోగి. భార్య కాత్యాయిని(అంజలి) తో ప్రశాంత జీవితం గడుపుతున్న అతని జీవితంలోకి ఇందు (సోనాలి చౌహాన్) ప్రవేశిస్తుంది. అప్పటికే ఆమె విక్కీ(విక్రమ్ జీత్) గ్యాంగ్ తో వేధింపులకు గురి అవుతూంటుంది. ఆమెను కిడ్నాప్ చేయటంతో రంగంలోకి దిగిన ధర్మ వారిని ఓ రేంజిలో ఆడుకుంటాడు. అదంతా టీవీలో చూసిన విక్కీ అన్నయ్య రాజశేఖర్(సుమన్) ధర్మని చూసి షాక్ అవుతాడు. వెంటనే డిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి ఆ ధర్మా మరెవరో కాదు డిక్టేటర్ అని ప్రకటిస్తాడు. అక్కడ నుంచి కథ...డిక్టేటర్ ..ధర్మ గా ఎందుకు మారి సైలెంట్ గా ఉంటున్నాడు..అతని గతం ఏమిటి.. చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    వాస్తవానికి బాలకృష్ణకు ఇలాంటి కథలు కొత్తవేం కాదు...గత పదిహేళ్లుగా ఇలాంటి కథలు, డైలాగులు,ఎమోషన్స్ ఎన్నో చేసే ఉన్నాడు..ఫస్టాఫ్ అంతా సాదా సీదా జీవితం గడుపుతున్న హీరో ఇంటర్వెల్ అతను సాధారణ వ్యక్తి కాదు...అసాధారణమైన హీరో అని తేలుతుంది. అలా ఎందుకు మారాడన్నది సెంకడాఫ్ లో ప్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. అయితే ఇలాంటి కథల్లో ఫస్టాఫ్ లోనే సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ తర్వాత జరిగే కథ జరుగుతూ ఆసక్తి కలిగిస్తూంటూంది. అంటే ప్రేక్షకుడుకు ఫ్లాష్ బ్యాక్ తెలియదు కాని కథలు పాత్రలకు తెలుసు కదా..అయితే ఎందుకునో ఆ విషయాన్ని ఇందులో మిస్సయ్యారు. పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఏదో వెలితిగా ఉంటుంది. కానీ ఇంటర్వెల్ కి దగ్గరగా వచ్చే హీరో ట్రూ ఐడెంటెటీ రివల్ అవటం అనే ఎమోషన్ మాత్రం విజిల్స్ కొట్టిస్తుంది. అదే ఇక్కడా జరిగింది.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

    అదే పెద్ద మైనస్

    అదే పెద్ద మైనస్

    డిక్టేటర్ లాంటి పవర్ ఫుల్ వ్యక్తికు..లేడీ విలన్ ఉండటం అనేది జీర్ణించుకోవటం కాస్త కష్టమే. ఎందుకనో గతంలో సీమ సింహం సినిమా గుర్తుకు వస్తుంది ఈ విషయంలో...

    టైలర్ మేడ్

    టైలర్ మేడ్

    ఎన్ని చెప్పుకున్నా..ఎన్ని అనుకున్నా..ఇది బాలకృష్ణకు టైలర్ మేడ్ రోల్. అందుకే చకచకా చేసుకుంటూపోయాడు. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు చూసి ఉన్న ప్రేక్షకుడుకే ఇది డైజస్ట్ కావటానికి కాస్త టైం పడుతుంది.

    ఇవే హైలెట్

    ఇవే హైలెట్

    ‘నీ హిస్టరీ లో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్ కే హిస్టరీ ఉంది ',' నేను భరిస్తేనే ఇలా ఉందంటే నేను తెగిస్తే ఇంక ఎలా ఉంటుందో చూసుకో','నా జోలికొస్తే వదిలేస్తా...నాన్న గారి జ్ఞాపకాల జోలికొస్తే చంపేస్తా','నేను చేసే పనికి క్వచ్చిన్ మార్కులు ఉండవు, ఓన్లీ ఫుల్ స్టాఫ్','ఆడవాళ్లకి అహంకారం మగవాళ్లకి అవినీతి మంచిది కాదు' వంటి డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    నయనతారని...

    నయనతారని...

    ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్ అంజలి..బాలయ్యకు తగ్గ జోడీలా గతంలో నయనతార చేసిన పాత్రలలాంటిదే ఇది. సోనాల్ చౌహాన్ గ్లామర్ ఒలకబోస్తూ మాస్ ని ఎట్రాక్ట్ చేసే పనిలో బిజీగా ఉండిపోయింది.

    మరో హైలెట్

    మరో హైలెట్

    ఈ సినిమాలో మరో హైలెట్ ..ఇంట్రెవర్ బ్లాక్, అలాగే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే డిక్టేటర్ సీన్స్. ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ ఫృథ్వీ, ఫ్రబాస్ శ్రీనులతో చేసిన కామెడీ.

    జస్ట్ ఓకే

    జస్ట్ ఓకే

    చాలా గ్యాప్ తర్వాత ముమైత్ ఈ సినిమాలో ఐటం సాంగ్ చేసింది. ఆ సాంగ్ అనుకున్న రీతిలో కిక్ ఇవ్వలేదు..జస్ట్ ఓకే అనిపిస్తుంది.

    టెక్నికల్ గా..

    టెక్నికల్ గా..

    ఈ సినిమాలో కెమెరా వర్క్ కు పూర్తి మార్కులు పడతాయి. తమన్ అందించిన పాటలు రెండు బాగున్నాయి. ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. రొటీన్ కథకు ఆ మాత్రం ఇంట్రస్టింగ్ వచ్చేలా స్క్రిన్ ప్లే రాయటం గొప్ప విషయమే.

    ఎవరెవరు..

    ఎవరెవరు..

    బ్యానర్స్: ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్
    నటీనటులు : బాలకృష్ణ ,అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష , ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు
    ఫైట్స్‌: రవివర్మ,
    ఆర్ట్‌: బ్రహ్మకడలి,
    ఎడిటర్‌: గౌతంరాజు,
    మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌,
    డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు,
    రచన: శ్రీధర్‌ సీపాన,
    మాటలు: ఎం.రత్నం,
    కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌,
    నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌,
    కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.
    విడుదల తేదీ: 14-01-2016.

    ఫైనల్ గా... బాలయ్య ఎన్నో సార్లు చేసిన పాత్రను ఆయన చేయటానికి ఒప్పించటం అంటే మామాలు విషయం కాదు. అందులో బాగానే సక్సెస్ అయిన టీమ్.... ఎన్నో సార్లు ఆ కథను అదే హీరోతో చూసిన ప్రేక్షకుడుని ఏ మేరకు ఒప్పిస్తారనేది చూడాలి.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Nandamuri Balakrishna's ‘Dictator’ released today as Sankranthi Special with average talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X