For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హా... నారాయణా (‘శ్రీమన్నారాయణ’ రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  1.0/5
  బాలకృష్ణ సినిమా రిలీజయ్యే ప్రతీసారీ అది మరో సమరసింహా రెడ్డో, సింహానో, నరసింహనాయుడో అని భారీగా ఆశలు పెట్టుకుని థియేటర్‌కి వెళ్లటం,అంత సీన్ మీకు లేదని సినిమా తేల్చేయటంతో ఉసూరుమంటూ బయిటపడటం పరిపాటైపోయింది. తాజాగా ఆ లిస్ట్ లో చేరిన మరో చిత్రరాజం శ్రీమన్నారాయణ. బాలకృష్ణ పంచ్ డైలాగుల పవర్ తెలుసుకుని వాటితో ఓ ప్రోమో వదిలి క్రేజ్ తెచ్చిన ఈ చిత్రం ఎనభైల నాటి తండ్రిని చంపిన వారిని తిరిగి చంపుట అనే ముతక ఫార్ములాతో నడిచి థియేటర్స్ లో విలన్స్ తో పాటుగా ప్రేక్షకులని చావబాదినట్లైంది. ఈ మద్య కాలంలో బాలకష్ణ చిత్రాల్లో ఇంతగా నిరాశపరిచంది ఇదేనేమో...

  సంస్థ: ఎల్లో ప్లవర్స్
  నటీనటులు: బాలకృష్ణ, పార్వతీమెల్టన్, ఇషాచావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు
  మాటలు: పోలూర్ ఘటికాచలం,
  కెమెరా: టి.సురేందర్‌రెడ్డి,
  సంగీతం: చక్రి,
  ఎడిటింగ్: గౌతంరాజు,
  ఆర్ట్: నాగేందర్,
  నిర్మాత: రమేష్ పుప్పాల,
  కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.
  విడుదల: ఆగస్టు 30,2012

  అత్యంత సాహసంతో జేమ్స్ బాండ్ తరహాలో స్కూప్ లు బయటకు తీసే జర్నలిస్టు శ్రీమన్నారాయణ(బాలకృష్ణ). అతని తండ్రి కల్కి నారాయణ మూర్తి(విజయకుమార్) పేదలు అంటే ప్రాణమిచ్చే వ్యక్తి. ఆయన జై కిసాన్ అనే సంస్ధను ఏర్పాటు పేద రైతుల కోసం ఐదు వేల కోట్లు ఫండ్ వసూలు చేస్తాడు. ఈ విషయం రొటీన్ గా విలన్స్ (జయప్రకాష్ రెడ్డి, నాగినీడు, సురేష్, కోట వగైరా) బ్యాచ్ కి తెలుస్తుంది. దాంతో వారు రంగంలోకి దిగి ఆ ఐదు వేలు కోట్లు నొక్కేసి తమకు అన్నిటికీ అడ్డుపడుతున్న మన జర్నలిస్ట్ హీరోని ఆ కేసులో ఇరికించేసి (అంత తెలివైన వాడిని ఎలా ఎరికించాడని అడగొద్దు) జైలుకు పంపేస్తారు. అప్పుడు జైల్లో ఉన్న శ్రీమన్నారాయణ ఏ విధంగా తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకుని, ఆ జై కిసాన్ ఫండ్ ని రైతులుకు చేరేలా చేసాడు....అలాగే హీరోయిన్స్ (ఇషా ఛావ్లా, పార్వతి మిల్టన్) కి ఈ కథలో పాత్రేమిటి..అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చివరి వరకూ చూడాల్సిందే.

  పాత కథను కొత్త నేరషన్ లో చెప్పాలంటారు..కొత్త కథను పాత నేరేషన్ లో చెప్పాలంటారు. కానీ పాత ..పాత నేరషన్ లో చెప్పాలనుకుంటే ఏమౌతుంది అంటే ...శ్రీమన్నారాయణ అవుతుందని చెప్పచ్చు. 'బాదడానికి బయోడేటా ఎందుకురా' వంటి కొన్ని పేలీ పేలని పంచ్ డైలాగులు, లక్ష్మి నరసింహ స్వామి వంటి కొన్ని గెటప్స్ పెట్టుకుని ధీమాగా చేసుకున్న స్క్రిప్టు ఇది. ఎక్కడా మలుపులుగానీ, మెరుపులుగానీ లేకుండా చేసిన ఈ కథ బాలకృష్ణ ఎలా ఓకే చేసాడా అనిపిస్తుంది. కథ, కథనం పాతవే పోనీ టేకింగ్ అయినా కొత్తగా ఉందా అంటే అదీ దానికి తగినట్లుగానే సాగింది. అలాగా పాత్ర అంత బోరు కొట్టడానకి ముఖ్య కారణం...పూర్తి ప్యాసివ్ గా నడవటం. ఫస్టాప్ లో హీరో ఎక్కడా సమస్యలో పడడు. హీరో సమస్య లో పడి విలన్స్ ఎవరో తెలిసే సరికి ఇంటర్వెల్. ఆ తర్వాత ఆ విలన్స్ ని చంపుకుంటూ పోవటమే సరిపోయింది. అంతేగానీ ఆ విలన్స్ ఎదురుదాడికి తిరగటం కానీ, హీరోకి అడ్డం పడి అతన్ని లక్ష్యానికి దూరం చేయటం కానీ చేయలేరు. పేరుకి ఆరుగురు విలన్స్ ఉంటారు ..అందరూ హీరో చేతిలో దెబ్బలు తిని చావటానికి తప్ప ఎందుకూ పనికిరారు. హీరోకు ఎక్కడా సవాల్ విసరరు. అదీ పూర్తిగా స్క్రీన్ ప్లే సమస్య.

  నటీనటుల్లో బాలకృష్ణ అప్పటికీ సినిమాని నిలబెడదామనే ప్రయత్నం చేసారు. ఆయన చెప్పే పంచ్ డైలాగులు బాగానే పేలాయి. అలాగే పాటల్లో కొన్ని స్టెప్స్ కు విజిల్స్ పడ్డాయి. కానీ పాటల్లో బాలకృష్ణ కు కాస్ట్యూమ్స్ పై మరింత శ్రద్ద పెట్టాల్సింది. ఇక పార్వతీ మిల్టన్ ...జీరో సైజు, బాలకృష్ణ ముందు తేలిపోయింది. సరైన జోడీ అనిపించలేదు. అలాగే బాలకృష్ణ వంటి ఫ్యామిలీలు కూడా వెళ్లి చూసే హీరో చేత అడల్ట్ డైలాగులు చెప్పించకుండా ఉండాల్సింది. ఘటికాచలం డైలాగులు సోసోగా ఉన్నాయి. ఆ మాత్రం అయినా బాగున్నాయనిపించాయంటే అది బాలకృష్ణకే క్రెడిట్ చెందుతుంది. పాటలు విజువల్ గా బాగా తీయలేదు. అలాగే ఆడియోలోనూ రెండు మాత్రమే బాగున్నాయి. కెమెరా, ఎడిటింగ్, రీ రికార్డింగ్ సోసోగా ఉన్నాయి.

  ఫైనల్ గా ఈ సినిమా బాలకష్ణ అభిమానులనైనా అలరిస్తుందా అంటే సందేహమే. ఇలాంటి ముతక కథలకు ఇకనైనా బాలకృష్ణ దూరంగా ఉంటే బాగుంటుంది అని ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది. అలాగే సినిమాని చూసి బయటకు వచ్చేవారు టైటిల్ ని స్మరించుకోకుండా ఉండలేరు. బాలకృష్ణ నటన, డైలాగ్ డెలివరీ కోసమే అయితే సినిమా చూడవచ్చు.

  -సూర్య ప్రకాష్ జోశ్యుల

  English summary
  Balakrishna's Srimannarayana has released with negative talk. Balakrishna's action and dialogue delivery will be plus points.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X