For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bell Bottom Movie Review: సీటుకు అత్తుకుపోయే థ్రిల్లర్‌గా... అక్షయ్ కుమార్ మరోసారి మ్యాజిక్

  |

  Rating:
  3.0/5
  Star Cast: అక్షయ్ కుమార్, వాణికపూర్, హ్యుమా ఖురేషి, లారా దత్తా, ఆదిల్ హుస్పేన్
  Director: రంజిత్ ఎం తివారీ

  కరోనావైరస్ కారణంగా ఏడాది కాలంగా స్తబ్దత నెలకొన్న హిందీ చిత్ర పరిశ్రమలో కంటెంట్ ప్రధానంగా సాగే కథలతో బాలీవుడ్ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. గత వారం రోజుల్లో షేర్షా, భుజ్: ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల్లో భావోద్వేగాలను పెంచేలా చేశాయి. లాక్‌డౌన్ కారనంగా ప్రస్తుతం సినీ అభిమానుల్లో నెలకొన్న ఓ రకమైన ఫీలింగ్‌ను దూరం చేసి.. ఉత్తేజాన్ని కలిగించే దిశగా వచ్చిన చిత్రం బెల్ బాటమ్.

  అక్షయ్ కుమార్‌తో అగ్ర తారలు నటించిన ఈ చిత్రం ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 80 దశకంలో ఐఎస్ఐ తీవ్రవాదులు చేసిన ఓ హైజాక్ నేపథ్యంగా వాస్తవ సంఘటనలతో రూపొందిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని పంచిందంటే..

  బెల్ బాటమ్ కథేంటంటే..

  బెల్ బాటమ్ కథేంటంటే..

  దేశ భద్రతను పరిరక్షించే RAW ఏజెంట్‌గా ప్రొటోకాల్ పేరు బెల్ బాటమ్ అలియాస్ అన్షుల్ మల్హోత్రా (అక్షయ్ కుమార్) సేవలందిస్తుంటారు. ప్రధాని ఇందిరా గాంధీ (లారా దత్తా) హాయంలో అప్పటికే నాలుగు హైజాక్స్ జరిగి దేశ ప్రతిష్టకు భంగం కలిగిన నేపథ్యంలో 200కు పైగా ప్రయాణికులు ఉన్న విమానాన్ని మరోసారి హైజాక్‌ చేసి తీవ్రవాదులు సవాల్ విసురుతారు.

  ఆ క్రమంలో బెల్ బాటమ్ రంగంలోకి దిగుతాడు. అయితే కేంద్ర మంత్రులు, ఉన్నత అధికారులు బెల్ బాటమ్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తారు. అయితే తప్పని పరిస్థితుల్లో బెల్ బాటమ్ ఆపరేషన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధానితో సహా అందరూ ఒప్పుకొంటారు. అయితే తీవ్రవాదులు విమానాన్ని లాహోర్‌ నుంచి దుబాయ్‌కు తీసుకెళ్లి బెల్ బాటమ్‌ టీమ్‌కు మరో ఛాలెంజ్ ముందు ఉంచుతారు. కానీ బెల్ బాటమ్ ప్లాన్ చేసిన ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది.

  ట్విస్టులు.. ఎమోషనల్ అంశాలు

  ట్విస్టులు.. ఎమోషనల్ అంశాలు

  బెల్ బాటమ్ ప్లాన్ చేసిన ఆపరేషన్ మిరాజ్ ఎలా ఫెయిల్ అయింది? బెల్ బాటమ్ ఆపరేషన్ విఫలం కావడంతో ప్రధాని ఇందిరా గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది. భారత్‌కు ఐఎస్ఐ తీవ్రవాదులు పెట్టిన డిమాండ్లు ఏమిటి? తన ఆపరేషన్ ఫెయిల్ అయిన తర్వాత బెల్ బాటమ్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేశాడు? దుబాయ్ నిబంధనల ప్రకారం రక్తం చుక్క పడకుండా, ఒక్క మరణం చోటు చేసుకోకుండా బెల్ బాటమ్ ప్రయాణికులను ఎలా రక్షించాడు? దేశ ప్రతిష్టను, ఇందిరా గాంధీ ప్రశంసలు ఎలా అందుకొన్నారనే ప్రశ్నలకు సమాధానమే బెల్ బాటమ్ సినిమా కథ.

  ఫస్టాఫ్‌లో కథలో హైలెట్స్

  ఫస్టాఫ్‌లో కథలో హైలెట్స్

  భారత్‌లోని పలు ప్రాంతాలను విచ్ఛిన్నం చేసే కుట్రగా పాకిస్థాన్ అమలు చేసిన ఆపరేషన్ టోపాజ్‌ను ఛాలెంజ్ చేస్తూ బెల్ బాటమ్ ప్లాన్ చేసిన ఆపరేషన్ మిరాజ్ నేపథ్యంగా కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. తొలి భాగంలో తీవ్రవాదుల హైజాక్ ఘటనలో బెల్ బాటమ్ తల్లి మరణించడం కథను మరింత ఇంటెన్సివ్‌గా, ఎమోషనల్‌గా మార్చుతుంది.

  ఇలాంటి పరిస్థితుల మధ్య ఐదోసారి విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేసిన సంఘటన సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. ప్రధాని ఇందిరా గాంధీతో జరిగిన సమావేశంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఓ వ్యూహాన్ని బెల్ బాటమ్ అమలు చేసిన అంశం మరింత ఉద్వేగంగా మారడం ఫస్టాఫ్‌లో కీలకంగా కనిపిస్తాయి.

  సెకండాఫ్‌లో ఎలా ఉందంటే..

  సెకండాఫ్‌లో ఎలా ఉందంటే..

  ఇక సెకండాఫ్‌లో ఆపరేషన్ మిరాజ్ ఎగ్జిక్యూట్ చేయడం సినిమా మొత్తానికి హైలెట్‌గా మారుతుంది. చివరి 20 నిమిషాలు సినిమా చాలా గ్రిప్పింగ్‌గా, ఇంటెన్సివ్‌గా సాగుతుంది. అక్షయ్ కుమార్ ఎప్పటి మాదిరిగానే ఆద్యంతం కంపోజ్డ్‌గా కనిపించడం సినిమాకు సానుకూలంగా మారిందనిపిస్తుంది. చివర్లో భార్య (వాణి కపూర్) పాత్రకు సంబంధించిన ట్విస్ట్ ఆలరిస్తుంది. ఓవరాల్‌గా సెకండాఫ్ ఫీల్‌గుడ్ ఉండటం సినిమాకు మరింత పాజిటివ్‌గా ఓ అనుభూతిని కలిగిస్తుంది.

  దర్శకుడి విజన్, స్క్రిప్టు బలంగా

  దర్శకుడి విజన్, స్క్రిప్టు బలంగా

  వాస్తవ సంఘటనలను జోడిస్తూ సినిమాటిక్ అంశాలతో దర్శకుడు రంజిత్ ఎం తివారీ రాసుకొన్న స్క్రిప్టు ఈ సినిమా సక్సెస్ ప్రధాన కారణం. కత్తి మీద సాము లాంటి ఇందిరా, ఇతర కేంద్ర మంత్రుల పాత్రలు, రా, ఐబీ వర్గాలకు సంబంధించిన సీన్లు తెర మీద ఉత్తమ విలువలతో కనిపిస్తాయి. అక్షయ్ కుమార్ పాత్రతోపాటు వాణి కపూర్, లారాదత్తా, హ్యుమా ఖురేషి పాత్రలు సినిమాను ముందుకు నడిపించేలా అనుసరించిన దర్శకుడి విధానం ఆకట్టుకొంటుంది. దర్శకుడి ఆలోచనలకు తోడుగా అసీమ్ అరోరా, పర్వేజ్ షేక్ రచనా సహకారం బెల్ బాటమ్‌ను ఫీల్‌గుడ్‌గా మార్చేందుకు దోహదపడ్డాయి.

  అక్షయ్ కుమార్ ఫెర్ఫార్మెన్స్

  అక్షయ్ కుమార్ ఫెర్ఫార్మెన్స్

  RAW ఏజెంట్‌గా అక్షయ్ కుమార్ ఫిట్‌గాను, ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ బెల్ బాటమ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడా అనిపిస్తుంది. పాక్ తీవ్రవాదుల చేతిలో తల్లి మరణించిన సీన్లలో భావోద్వేగమైన నటనతో ఆకట్టుకొన్నాడు. ఇక సినిమా క్లైమాక్స్‌లో అక్షయ్ బాడీ లాంగ్వేజ్ మరోసారి ఇంప్రెస్ చేస్తుంది. కేవలం యాక్షన్ పార్ట్‌లోనే కాకుండా వాణి కపూర్‌తో రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా అలరించాడు. టైలర్ మేడ్‌లా కనిపించే బెల్ బాటమ్ రోల్‌ను అక్షయ్ కుమార్‌ సునాయసంగా చేశారని చెప్పవచ్చు.

  లారా దత్తా హుందాగా, వాణికపూర్ చిలిపిగా

  లారా దత్తా హుందాగా, వాణికపూర్ చిలిపిగా

  బెల్ బాటమ్ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్ర ఇందిరా గాంధీగా కనిపించిన లారా దత్తా. మేకప్, హావభావాలతో మాజీ ప్రధానిని మైమరిపించింది. కథాపరంగా సీరియస్ సన్నివేశాల్లో లారా దత్తా నటన హుందాగా ఉండటమే కాకుండా ఆమెలోని మెచ్యురిటీని కనిపించేలా చేసింది. ఇక వాణి కపూర్‌ పాత్ర చిన్నదైనా ఆ పాత్రలోని కెమిస్ట్రీ, సినిమా ముగింపులో ఉండే ఓ కొసమెరపు ఆ రోల్‌ను మరింత పెద్దగా కనిపించేలా చేస్తుంది. హ్యుమా ఖురేషి ఉన్నంత సేపు మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. రా చీఫ్‌గా ఆదిల్ హుస్సేన్. విదేశాంగ మంత్రిగా తలైవాసల్ విజయ్, పౌర విమానశాఖా మంత్రిగా అభిజిత్ లాహిరి ఆకట్టుకొన్నారు.

  సినిమాటోగ్రఫి, మ్యూజిక్ గురించి

  సినిమాటోగ్రఫి, మ్యూజిక్ గురించి

  సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు మ్యూజిక్ వెన్నముకగా నిలిచింది. సినిమా కథంతా 80వ దశకంలో సాగడం వల్ల ఆ కాలానికి సరిపోయే విధంగా పాత తరహా మ్యూజిక్ అందించడం వల్ల ఆ కాలపు నాటి మూడ్, ఫీల్ కొనసాగింది. పాటలకు పెద్దగా స్కోప్ లేకపోయినా రీరికార్డింగ్ చాలా బాగుందనిపిస్తుంది. కథ ఎక్కువగా అవుట్ డోర్‌లోను, లండన్‌లోను సాగడంతో అక్కడి వాతావరణాన్ని అద్బుతంగా సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి అందిపుచ్చుకొన్నారు. క్లైమాక్స్‌కు సంబంధించిన సీన్లు సినిమాకు హైలెట్‌గా మారాయి. చందన్ అరోరా ఎడిటింగ్‌ కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. వశు భగ్నానీ బృందం పాటించిన నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకొనేలా ఉంటాయి.

  బెల్ బాటమ్ తుది తీర్పు..

  బెల్ బాటమ్ తుది తీర్పు..

  బెల్ బాటమ్ సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పుకోవాలంటే.. దేశభక్తి, ఎమోషనల్, యాక్షన్ అంశాలు కలబోసిన చిత్రంగా చెప్పకోవచ్చు. RAW అధికారులు దేశం కోసం ఎలా తెగిస్తారనే విషయాన్ని చెప్పుకోవడానికి ఈ చిత్రం ఓ మచ్చు తునక. 80లో జరిగిన హైజాక్ సంఘటనలను కళ్లకు కట్టినట్టుగా తెరకెక్కిచడంలో సఫలమయ్యారు.

  అక్షయ్ కుమార్, లారా దత్తా ఫెర్ఫార్మెన్స్, రంజిత్ టేకింగ్ సినిమాకు ఆకర్షణగా మారాయి. కథ, కథనాలు ప్రేక్షకుడిని హైజాక్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దేశభక్తి ప్రధానంగా సాగే యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా తెగ నచ్చుతుంది. వీకెండ్‌లో ఫీల్‌గుడ్ సినిమా చూడటానికి బెల్ బాటమ్ కేరాఫ్ అడ్రస్.

  Rangu Movie Public Talk రంగు మూవీ పబ్లిక్ టాక్ | Filmibeat Telugu
  బెల్ బాటమ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు

  బెల్ బాటమ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: అక్షయ్ కుమార్, వాణికపూర్, హ్యుమా ఖురేషి, లారా దత్తా, డెంజిల్ స్మిత్, అనిరుధ్ ధావే, ఆదిల్ హుస్సేన్, థలైవాసై విజయ్ తదితరులు
  దర్శకత్వం: రంజిత్ ఎం తివారీ
  నిర్మాతలు: వశూ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, మోనీషా అద్వానీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ తదితరులు
  సినిమాటోగ్రఫి: రాజీవ్ రవి
  మ్యూజిక్: డేనియల్ బీ జార్జ్ (బీజీఎం), అమల్ మాలిక్, తాన్షిక్ బాగ్చీ, శంతను దత్తా, కుల్వంత్ సింగ్ భమ్రా, గుర్నాజర్, మణిందర్ బుట్టర్
  ఎడిటింగ్: చందన్ అరోరా
  బ్యానర్: పూజా ఎంటర్‌టైన్‌మెంట్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్
  రిలీజ్ డేట్: 2021-08-19

  English summary
  Bell Bottom Movie Review: Akshay Kumar's latest movie released in Theatres on August 19. In this occassion, Filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X