»   » సోల్ మిస్సైనోడు( 'స్పీడున్నోడు' రివ్యూ)

సోల్ మిస్సైనోడు( 'స్పీడున్నోడు' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

---సూర్య ప్రకాష్ జోస్యుల

ఎన్నో సార్లు చెప్పుకున్నట్లు రీమేక్ సినిమా ఎప్పుడూ కత్తి మీద సామే. అయితే ఆ కత్తి యుద్దంలో ఆరితేరిపోయినవాడు భీమినేని. కెరీర్ ప్రారంభం నుంచి అన్నీ రీమేక్ లే చేస్తూ ఎక్కువ శాతం సక్సెస్ లు ఇస్తూ వచ్చిన ఆయన ఈ మధ్య ఎందుకనో ...సినిమా...సినిమాకీ గ్యాప్ ఇస్తున్నారు. ఆ క్రమంలో దాదాపు ఆయన్ను మర్చిపోయినంత గ్యాప్ ఆ మధ్య తీసుకుని ...సుడిగాడు అంటూ సుడిగాలిలా..మరో రీమేక్ తో వచ్చి కలెక్షన్స్ సునామీ సృష్టించాడు.


అదే ఉత్సాహం కంటిన్యూ చేస్తూ సుందర్ పాండ్యన్ అనే రీమేక్ కొని సినిమా మొదలెట్టి...అందుకు తగ్గ హీరోలు దొరక్క ఆగి..ఇంత కాలానికి మళ్లీ స్లోగా వచ్చినా స్పీడున్నోడు టైటిల్ తో క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఈ సారి ఆయన రీమేక్ కు సరిగ్గా సాన పట్టలేదనిపిస్తోంది. అచ్చ తమిళ నేటివిటీ తో సాగే ఆ తమిళ చిత్రం ఇక్కడ అసలు ఎక్కడ జరుగుతోందనే డౌట్ తెచ్చేలా తయారైంది. అంతేకాదు కమర్షియాలిటీ పేరుతో నేటివిటీ,నాచురాలిటీతో ఉన్న సినిమాని సమ్మెట దొబ్బలు కొట్టేసాడు.


దాంతో ఒరిజనల్ సినిమాలో ఉన్న స్నేహం అనే సోల్ మిస్సై...హీరోయిజం అనే యాంగిల్ వచ్చి చేరింది. పోనీ పూర్తిగా అదే యాంగిల్ ని కంటిన్యూ చేసేలా కథనాన్ని మార్చేసినా బాగుండేది. ఒరిజనల్ సినిమా కొన్నాం కదా అని . చాలా భాగం ఉన్నదున్నట్లు..సేమ్ టు సేమ్ లొకేషన్స్ తో దించేసి,దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపేసి కలగాపులగం చేసేసారు.దాంతో ఎటో మొదలై..ఎటో వెళ్తున్న సినిమాగా తయారైంది.


చదువు పూర్తై ఆవారాగ తిరుగుతున్న శోభన్ (బెల్లంకొండ శ్రీనివాస్) కు ఉన్న బలహీనత ఫ్రెండ్ షిప్. అందుకోసం ఏదైనా చేయటానికి, ఎంతదూరం అయినా వెళ్లటానికి రెడీ అవుతూంటాడు. అలాంటి శోభన్ ..తన ఫ్రెండ్ గిరి (మధు) ప్రేమను గెలిపించటానికి రంగంలోకి దిగుతాడు. ఎవరా ఆ అమ్మాయి అని చూస్తే తన ఫ్లాష్ బ్యాక్ లో తన ప్రేమను నిరాకరించిన వాసంతి(సోనారిక) అని అర్దమవుతుంది. అయినా సరే...ఆమెను తన ఫ్రెండ్ కు సెట్ చేయాలని ఆ ప్రయత్నంలో ఉండగా...ఇప్పుడు నీ ప్రేమను ఓకే చేసాను అంటుంది ఆమె. మరో ప్రక్క ఆమెకు జగన్ (కబీర్ సింగ్ దుహాన్) తో మ్యారేజ్ సెటిల్ అవుతుంది. అప్పుడు శోభన్ ఏం చేసాడు.. తన ఫ్రెండ్ కోసం తన ప్రేమను త్యాగం చేసాడా లేక ప్రేమ కోసం ఫ్రెండ్ నే వదిలించుకుంటాడా.. ఎలా మ్యానేజ్ చేసాడు..ఆ క్రమంలో ఏం జరిగింది అనేది మిగతా కథ.


ఇంటర్వెల్ కు వచ్చేదాకా హీరో కు సమస్య రాదు. ఆ వచ్చిన సమస్య కూడా ఇప్పటికి తెలుగు సినిమాల్లో కొన్ని వందల సార్లు చూసినదే (హీరోయిన్ తండ్రికి హీరో..ప్రేమ విషయం తెలియటం). దాంతో నో కాంఫ్లిక్ట్ ..నో డ్రామా..నో సినిమా అన్నట్లు ఓ కామెడీ బిట్, ఓ సాంగ్, ఫైట్ అంటూ సాగిపోయింది. పోనీ ఇంటర్వెల్ కు అయినా సమస్యలో పడ్డాడు అంటే...ఆ సమస్యపై కథ తర్వాత పొరపాటున కూడా నడవదు..వేరే వైపు టర్న్ తీసుకుంటుంది. అలాంటప్పుడు ఆ ఇంటర్వెల్ వేయటం ఎందుకు..


ఒరిజనల్ ఫిల్మ్ లో ఇంటర్వెల్ ..ఎక్కడ వేసారో అదే పాయింట్ పై క్లైమాక్స్ డిజైన్ చేసారు. దాంతో ఫెరఫెక్ట్ గా దర్శకుడు ఏదైతే ప్రేక్షకుడుకు చెప్పాలనుకున్నారో అది రీచ్ అయ్యింది. తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి కథ ఫ్రెండ్ షిప్ మీద అని ప్రారంభించారు..ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి...అది లవ్ స్టోరీ పై ట్విస్ట్ వస్తుంది. క్లైమాక్స్ మళ్లీ ఫ్రెండ్ షిప్ మీదే. ఇలా డిజైన్ ని ఇష్టమొచ్చినట్లు మార్చేయటం చూసేవారిని ఇబ్బందికి గురి చేసింది. అయినా ఫ్రెండ్ షిప్ మీద కథ నడిచేటప్పుడు ఆ ప్రెండ్ షిప్ ని బలపరిచే మరిన్ని సీన్స్ సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది.


రియలిజమో లేక సినిమాటెక్ ఫన్ .. వీటిలో ఏదో ఒకటి ఎంచుకుని కథ చెప్పితే బాగుండేది. ముఖ్యంగా అక్కడ సుందరపాండ్యన్ వచ్చేటప్పటికి..నాడోడిగల్, సుబ్రమణ్యపురం హిట్టై ఓ డిఫెరెంట్ వాతావరణం ఏర్పడి ఉంది. దాంతో వాటిలో చేసిన శశి కుమార్ నటించిన సినిమా అనగానే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యిపోయి హిట్ చేసేసారు. తెలుగులో అలాంటి సినిమా మూడ్ లేదు.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ...


కామిడీ మిస్

కామిడీ మిస్

అలాగే ఫస్టాఫ్ లో అయినా ఓకే అనిపించే కామెడీ ఉంది కానీ... సెకండాఫ్ పూర్తి సీరియస్ నోట్ తో సాగింది. ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ ఈ మధ్యకాలంలో ఫెయిలైంది ఈ సినిమాలోనేనేమో. అలీ ఎందుకు వస్తాడో..వెల్తాడో అర్దం కాదు.


ఇంకా ఈ రోజుల్లోనా...

ఇంకా ఈ రోజుల్లోనా...

పెద్ద డబ్బున్న కుటుంబం అమ్మాయి...(హీరోయిన్) మినిమంలో మినిమం సొంత హోండా ఏక్టివ్ లో మెయింటైన్ చేస్తూంటుంది. అలాంటిది ఆర్టీసి సిటీ బస్ లో వెళ్లటం..అక్కడ లవ్ స్టోరీ నడవటం ఏమిటో అర్దం కాదు.


హీరోయిన్ ...

హీరోయిన్ ...

తమిళ వెర్షన్ లో హీరోయిన్ లక్ష్మి మీనన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది . ఇక్కడ హీరోయిన్ ..(మేకప్ కూడా సరిగ్గా లేకుండా) మిస్ ఫైర్ అయ్యింది.


మిస్టరీ ఏదీ

మిస్టరీ ఏదీ

సినిమాలో కాలేజీకి వచ్చే కుర్రాడు చనిపోవటం... హీరో సస్పెక్ట్ అయ్యి జైలుకు వెళ్లటం ఎపిసోడ్..ఎమోషన్ తో కథను లాక్ చేస్తుంది. ఇక్కడ ఆ ఎమోషన్ సీన్స్ మొత్తం లేపేసారు.క్లైమాక్స్ పండలేదు

క్లైమాక్స్ పండలేదు

ఒరిజనల్ లో ఉన్న బలం అంతా క్లైమాక్స్ లోనే. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, ఎమోషన్ ప్రేక్షకుడిని కట్టిపారేసాయి. ఇక్కడ అవేమీ పండలేదు.


టెక్నికల్ గా..

టెక్నికల్ గా..

విజయ్ ఉలగనాధ్..కెమెరా వర్క్ బాగుంది. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ కూడా తెరపై బాగా ఎలివేట్ అయ్యింది. డ్రాగ్ అయిన కొన్ని సీన్స్ లేపేసి ఎడిటింగ్ చేస్తే కాస్త బోర్ తప్పేది.


మరో ఫిల్లర్

మరో ఫిల్లర్

ఈ సినిమాలో హీరో కన్నా అతని ప్రక్కన ఉన్న శ్రీనివాస రెడ్డే మంచి ఈజ్ తో చేసారు. హీరో శ్రీనివాస్ పేస్ లో ఎమోషన్స్ పండటం లేదు. విగ్రహం బాగుంది కానీ దానికి తగ్గ హోం వర్క్ చేస్తేనే అలరించగలుగుతాడు.


ఎవరెవరు..

ఎవరెవరు..

సంస్ద: గుడ్ విల్ బ్యానర్
నటీనటులు :బెల్లంకొండ శ్రీనివాస్ , సోనారిక బరోడియా, ప్రకాష్ రాజ్, రావు రమేష్ అలీ, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, మధునందన్, చైతన్యకృష్ణ, కబీర్, సత్య అక్కల, షకలకశంకర్, రమాప్రభ, ప్రగతి తదితరులు
మెయిన్ స్టోరి: ఎస్.ఆర్.ప్రభాకరన్,
డైలాగ్స్ ప్రవీణ్ వర్మ, భీమనేని శ్రీనివాసరావు,
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె,
ఫైట్స్: రవివర్మ,
ఎడిటర్ గౌతంరాజు,
మ్యూజిక్ డి.జె.వసంత్,
సినిమాటోగ్రఫీ: విజయ్ ఉలగనాథ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల,
నిర్మాత: భీమనేని సునీత,
స్టోరీ డెవలప్ మెంట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.
విడుదల తేదీ 5-2-2016.ఫైనల్ గా...సుందరపాండ్యన్ చూసి ఈ సినిమా చూస్తే వెంటనే మరోసారి సుందరపాండ్యన్ చూడాలనిపిస్తుంది. సుందరపాండ్యన్ చూడనివారు ఈ సినిమా చూస్తే ...అదెలా అక్కడ ఆడిందా అనే సందేహం ఖచ్చితంగా వస్తుంది. అలాగే రీమేక్ ని సరిగ్గా ప్రెజెంట్ చేయకపోతే మేకులా మారి మంటపుట్టేలా గిచ్చుతుందని మరోసారి ప్రూవ్ చేస్తుంది.

English summary
Bellamkonda Srinivas' second outing, Speedunnodu is out in theaters. Ironically, the film's title is an exact opposite to its pace. Though the film was entertaining at parts, its sloppy screenplay, five songs in the first half, strained comedy and the overdose
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X