For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bhuj: The Pride of India review.. పాక్‌పై ఇండియా వార్.. ఆకట్టుకొన్న అజయ్ దేవగన్ ఒంటరిపోరాటం

  |

  RATING:2.75/5

  1947లో భారత్, పాకిస్థాన్ విడిపోయినప్పుడు తీసుకొన్న నిర్ణయమే దేశానికి శాపంగా మారింది. దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్థాన్‌కు 75 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బుతోనే ఆయుధాలు, రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు భారతీయ సైనికులపై గుళ్ల వర్షం కురిపిస్తున్నారు. 1971లో పాకిస్థాన్‌తో భారత్ చేసిన యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే ఇతి వృత్తంతో భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని కలిగించిందంటే...

  భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా కథ ఏమిటంటే..

  భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా కథ ఏమిటంటే..

  ఈస్ట్ పాకిస్థాన్‌లో బంగ్లాదేశ్ విమోచన కోసం బంగ్లాదేశీయులు పోరాటం చేస్తున్న సమయంలో భారత సైన్యం వారికి అండగా నిలిచింది. భారత బలగాలు ఈస్ట్ పాకిస్థాన్‌లో పాక్ సైన్యాన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ సమయంలోనే పాకిస్థాన్ అధ్యక్షుడు చంఘీజ్ ఖాన్ భుజ్ అనే ఆపరేషన్‌కు ప్లాన్ చేశాడు. కచ్ ద్వారా పశ్చిమ భారత్‌లోకి ప్రవేశించి దేశంపై దాడి చేయాలని ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్‌ను అడ్డుకొనేందుకు స్క్ర్వాడ్రన్ లీడర్ విజయ్ శ్రీనివాస్ కార్నిక్ (అజయ్ దేవగన్) యుద్ద రంగంలోకి దూకుతాడు. కానీ పాక్ సేనలు కచ్‌లోని భుజ్ ప్రాంతంలోని ఎయిర్‌బేస్‌ను నాశనం చేయడంతో సైన్యం అక్కడికి చేరుకోవడానికి కష్టమవుతుంది. ఆ రన్‌వేను మరమ్మత్తు చేసే బాధ్యతను విజయ్ కార్నిక్ అప్పగిస్తారు.

  కథలో మలుపులు ఇలా..

  కథలో మలుపులు ఇలా..

  పాకిస్థాన్‌పై దాడిని భారత సేనలు ఎలా కొనసాగించారు? రన్ వేను విజయ్ కార్నిక్ ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్ని నిర్మించాడు. పాక్ ఎత్తుగడలను భారత సైన్యం ఎలా తిప్పికొట్టింది. రన్ వే ఏర్పాటుకు కచ్ ప్రాంతంలోని మాదాపూర్ గ్రామంలోని మహిళల సహకారం ఎందుకు తీసుకొన్నారు. రన్ వేను నిర్మించానికి సుందర్ బెన్ (సోనాక్షి సిన్హా) ఎలాంటి సహకారం అందించింది అనే ప్రశ్నలకు సమాధానమే భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా కథ.

  ఎమోషనల్ అంశాలతో ఫస్టాఫ్

  ఎమోషనల్ అంశాలతో ఫస్టాఫ్

  భారత్‌పై పాకిస్తాన్ కుట్రలు నేపథ్యంగా కథ మొదలవుతుంది. పాక్ సేనలు, గూఢచారి వ్యవస్థను ఎదుర్కోవడమేనే అంశాలు ఆసక్తికరంగా కొనసాగుతాయి. ఇక పాక్ సరిహద్దులో ఉండే సాధారణ వ్యక్తి రాంచోర్దాస్ పాగి (సంజయ్ దత్) రా ఏజెంట్‌గా మారడం, ఆపరేషన్ హూన్ ప్రాతినిథ్యం వహించే అంశం సినిమాలో ఉత్తేజకర అంశంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కచ్ ప్రాంతంలోకి పాక్ సేనలు చొరబడుతుందనే వార్త నేపథ్యంలో అక్కడికి భారత సేనలు చేరుకోవడానికి అడ్డంకిగా మారుతుంది. రన్‌వే నిర్మించే బాధ్యతను ఎత్తుకొని భుజ్ ఏయిర్ బేస్‌కు వెళ్తారు. కానీ అక్కడ పరిస్థితి చూసి కూలీలు పారిపోతారు. దాంతో తొలి భాగం ఇంట్రెస్టింగ్‌గా ముగుస్తుంది.

  మహిళా శక్తి బలమే సెకండాఫ్

  మహిళా శక్తి బలమే సెకండాఫ్

  ఇక సెకండాఫ్‌లో మాదాపూర్ గ్రామంలో సుందర్ బెన్ అనే మహిళ సహకారం తీసుకోవడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలోని 300 మహిళలందరూ భారత సైన్యానికి మద్దతు తెలియజేసే సన్నివేశాలు ఎమోషనల్‌గా మారుతాయి. ఈ క్రమంలో కచ్‌పై దాడికి పాల్పడటానికి సిద్ధమైన పాక్ సేనల నిలువరించడానికి మిలటరీ ఆఫీస్ రామ్ కరణ్ భారత సేనల్లో ధైర్యాన్ని నింపుతాడు. చివరి రక్తం బొట్టు వరకు పోరాటం చేసి పాక్ సేనల్ని కచ్ ప్రాంతంలో అడుగుపెట్టకుండా అడ్డుకొందామని అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ సేనలతో భారత్ చేసిన యుద్ధం బంగ్లాదేశ్ ఏర్పడటానికి ఎలా కారణమైందనే అంశంతో సినిమా ముగుస్తుంది.

  అజయ్, సంజయ్ ఎలా నటించారంటే

  అజయ్, సంజయ్ ఎలా నటించారంటే

  విజయ్ శ్రీనివాస్ కార్నిక్‌గా అజయ్ దేవగన్ ఎమోషనల్ పాత్రలో కనిపిస్తారు. ఆపరేషణ్ చంఘీజ్ ఖాన్ భుజ్ ఆపరేషన్ అడ్డుకొనేందుకు కీలక సైనికాధికారి పాత్రలో ఒదిగిపోయాడు. కీలక సన్నివేశాల్లో భావోద్వేగంతో కనిపించారు. యాక్షన్ సీన్లలో తనదైన శైలిలో మెప్పించారు. ఈ సినిమాను ఒంటిచేత్తో నడిపించే ప్రయత్నం చేశాడు. ఇక భారత సరిహద్దుల్లో నివసించే గ్రామీణ వాసిగా, రా ఏజెంట్‌గా సంజయ్ దత్ కనిపించాడు. పాకిస్థాన్‌తో జరిగే యుద్దంలో విజయం సాధించేంత వరకు తాను తలపాగా ధరించనని రాం చోర్దాస్‌గా సంజయ్ దత్ ఆకట్టుకొంటాడు. మిలటరీ ఆఫీసర్‌గా శరద్ కేల్కర్ కీలక పాత్రలో కనిపిస్తాడు.

  సోనాక్షి సిన్హా, ప్రణీత సుభాష్ యాక్టింగ్ ఎలా అంటే

  సోనాక్షి సిన్హా, ప్రణీత సుభాష్ యాక్టింగ్ ఎలా అంటే

  ఇక అజయ్ దేవగన్‌గా భార్యగా ప్రణీత సుభాష్ కనిపిస్తుంది. ఆమె పాత్రకు నిడివి ఎక్కువగానే ఉన్నప్పటికి పెర్ఫార్మెన్స్ పెద్దగా స్కోప్ లేని పాత్రగా కనిపిస్తుంది. ఇక కచ్ ప్రాంతంలో నివసించే సాధారణ మహిళ, ధైర్యశాలి సుందర్ బెన్‌గా సోనాక్షి సిన్హా నటించారు. గ్రామంలో మగవాళ్లందరూ బతుకు తెరువు కోసం పట్టణాలకు వలసపోవడంతో ఇంటి, గ్రామ సంరక్షణను చూసుకొనే మహిళల్లో ఒక్కరిగా సోనాక్షి ఆకట్టుకొన్నాడు. హింస తప్పే కానీ.. ఎదుటి వాళ్ల ప్రాణాల తీసేటప్పుడు హింస తప్పనిసరి అని కృష్ణభాగవానుడు చెప్పాడు లాంటి పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఆకట్టుకొంటుంది.

  సాంకేతిక విభాగాల పనితీరు..

  సాంకేతిక విభాగాల పనితీరు..

  సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. అసిమ్ బజాజ్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. యుద్ధ సన్నివేశాలను సహజసిద్దంగా ఉండేలా చిత్రీకరించారు. అమర్ మొహిలే తదితరులు అందించిన బ్యాక్ గ్రౌైండ్ స్కోర్ బాగుంది. చాలా సన్నివేశాలను ఉద్వేగంగా మలచడం మ్యూజిక్ తోడ్పడింది. ఎడిటింగ్ విభాగానికి ఇంకా కొంత పని ఉందనిపిస్తుంది. చాలా సన్నివేశాల నిడివి ఎక్కువగా అనిపిస్తాయి. గ్రాఫిక్ వర్క్ చాలా నాసిరకంగా ఉన్నాయనే ఫీలింగ్ కలుగుతుంది.

  తుది తీర్పు ఎలా అంటే..

  తుది తీర్పు ఎలా అంటే..

  భారత్, పాక్ యుద్ధమంటేనే ఒక ఎమోషనల్ అంశం. దేశభక్తి, మానసిక సంఘర్షణ అనేవి సినిమాకు కీలకంగా మారాలి. కానీ అలాంటి అంశాలు పెద్దగా ఆకట్టుకోలేకపోవడం ఈ సినిమాకు మైనస్ అనిచెప్పవచ్చు. కాకపోతే అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి, శరద్ కేల్కర్ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పాజిటివ్‌గా మారాయి. దేశభక్తి ప్రధానంగా ఉండే సినిమాలను ఇష్టపడేవారికి, చరిత్ర ఆధారంగా వచ్చే చిత్రాలను చూసే వారికి భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా తప్పక నచ్చుతుంది.

  Recommended Video

  Allu Arjun Biography | Why Allu Arjun Is Biggest PAN India Star ? | Filmibeat Telugu
  తెర వెనుక, తెర ముందు..

  తెర వెనుక, తెర ముందు..


  నటీనటులు: అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి, శరద్ కేల్కర్, అమ్మీ విర్క్, ప్రణితా సుభాష్, ఇహాన్ థిల్లాన్
  దర్శకత్వం: అభిషేక్ దుదైయ్యా
  రచన: అభిషేక్ దుదైయ్యా, రితేష్ షా, పూజా భవోరియా
  నిర్మాతలు భూషణ్ కుమార్, కిషన్ కుమార్, కుమార్ మంగత్ పాథక్, బన్నీ సంంఘ్వీ, వజీర్ సింగ్, అభిషేక్ దుదైయ్యా
  సినిమాటోగ్రఫి: అసిమ్ బజాజ్
  ఎడిటింగ్: ధర్మేంద్ర శర్మ
  మ్యూజిక్: అమర్ మొహిలే
  బ్యానర్: టీ సిరీస్, అజయ్ దేవగన్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్ ఎల్ఎల్పీ
  ఓటీటీ రిలీజ్: డిస్నీ+ హాట్ స్టార్
  ఓటీటీ రిలీజ్ డేట్: 2022-08-13

  English summary
  Ajay Devgn's Bhuj: The Pride of India released on Disney + hot star. Here is the Telugu filmibeat's exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X