Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu: ఈ రోజు ఈ రాశుల వారు అదనపు ఖర్చులు తగ్గించుకోండి..
- News
విజయనగరం కాదని నిరూపించు.. కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్
- Sports
India vs Zimbabwe: జాతీయ గీతం పాడుతుండగా ఇషాన్ కిషన్‌పై దాడి..!
- Automobiles
మారుతి సుజుకి ఆల్టో కె10 వర్సెస్ రెనో క్విడ్: ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్..? Alto K10 vs Renault Kwid
- Technology
శ్రీకృష్ణ జన్మాష్టమికి అదిరిపోయే స్టిక్కర్లతో Whatsapp లో విషెస్ చెప్పండి!
- Finance
వీళ్లు మామూలోళ్లు కాదుగా.. బ్యాంకుకు కన్నం వేసేందుకు సొరంగం.. అనుకున్నదొకటి అయ్యిందొకటి..
- Travel
ఒకప్పటి రాజ నివాసాలు.. ఇప్పుడు విలాసవంతమైన విడిది కేంద్రాలు
Bimbisara Review: కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ ఎలా ఉందంటే?

పటాస్ హిట్ తర్వాత సరైన మరో హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ సుమారు రెండున్నర ఏళ్ళు వెచ్చించి మరీ చేసిన తాజా చిత్రం బింబిసార. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి సినిమా ప్రమోషన్స్ మొదలయ్యే వరకు సినిమా మీద ఎలాంటి బజ్ లేదు కానీ సినిమా నుంచి ప్రమోసనల్ స్టఫ్ విడుదల కావడం ప్రారంభమైనప్పటి నుంచి సినిమా మీద విపరీతమైన బజ్ పడింది. దానికి తగ్గట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవ్వడం కాదు ఇప్పటికే తాను సినిమా చూశానని సినిమా అద్భుతంగా ఉందని కూడా కామెంట్లు చేయడంతో, సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది. అనేది రివ్యూలో చూద్దాం'

బింబిసారా కథ ఏమిటంటే?
త్రిగర్తల అనే ఒక రాజ్యానికి తిరుగులేని రాజుగా ఉంటాడు బింబిసారుడు(కళ్యాణ్ రామ్). అణువణువునా అహంభావంతో కండకావరం ప్రదర్శిస్తూ ఉండే ఆయన రాజ్యకాంక్షతో, ధన దాహంతో చుట్టుపక్కల రాజ్యాలను ఆక్రమించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడు. అయితే ఒక సందర్భంలో తన సొంత రాజ్యంలోనే ఒక గ్రామాన్ని పూర్తిగా గ్రామస్తులతో కలిపి తగలబెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలో ఆయన ఆ గ్రామస్తుల శాపానికి గురవుతాడు. అలా గురైన బింబిసారుడుటైం ట్రావెల్ ద్వారా ఐదవ శతాబ్దం నుంచి నేటి ఆధునిక సమాజానికి వచ్చేస్తాడు. ఆ వచ్చిన తర్వాత ఈ వెనక్కి వెళతాడా? వెళితే ఎలా వెళ్లాడు? అసలు ఐదవ శతాబ్దం నుంచి నేటి సమాజానికి ఎలా వచ్చాడు? లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే?
ఈ సినిమా మొదటి భాగం నుంచి ఏ మాత్రం ఆలస్యం లేకుండా కథలోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. సినిమా ప్రారంభంలోనే సినిమాలో అసలు కథ ఏమిటని చెప్పేసే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రారంభంలో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడినా సినిమా సాగుతున్న కొద్దీ ఒక్కొక్క చిక్కుముడి విప్పుతూ వెళ్ళాడు దర్శకుడు. మొదటి భాగంలోనే అణు అణువునా ఖండకావరంతో రెచ్చిపోయితూ ఉండే బింబిసారుడు నేటి ఆధునిక సమాజంలో వచ్చి ఎలా మామూలు మనిషిగా మారాడు? అతనిలో ఎలా పరివర్తన వచ్చింది? అనే విషయాలు ఆసక్తికరంగా చూపించారు. ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది.

సినిమా సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే?
ఇక ఈ సినిమా రెండో భాగం కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకుంది. ఐదవ శతాబ్దం నుంచి నేటి ఆధునిక సమాజంలో అడుగుపెట్టిన బింబిసారుడు ఎలాంటి కష్టాలు పడ్డాడు? అసలు తాను ఎలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అనే విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు? అలాగే అప్పటివరకు కండకావడంతో ఊగిపోయిన ఆయన మామూలు మనిషిగా మారిన తర్వాత ఏం చేయాలనుకున్నాడు? తన వారసులను కలిసిన తర్వాత బింబిసారుడిలో పరివర్తన ఎందుకు వచ్చింది? చివరికి తన వారసులకు ఏర్పడిన కష్టాన్ని బింబిసారుడు ఎలా తీర్చాడు? అనే విషయాలను రెండో భాగంలో ఆద్యంతం ఆసక్తి కలిగించే విధంగా చూపించారు.

దర్శకుడు టేకింగ్ విషయానికొస్తే
ఈ సినిమా దర్శకుడు పేరు మల్లిడి వశిష్ట. కొందరు వేణు అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు అయిన వశిష్ట చేసిన మొదటి సినిమాతోనే తన ముద్ర వేసుకున్నాడు అని చెప్పొచ్చు. చాలా కష్టతరమైన సబ్జెక్ట్ ఎంచుకున్న వశిష్ట అసలు ఈ సినిమా కథను కళ్యాణ్ రామ్ అండ్ కో కి చెప్పి ఒప్పించడంతోనే మొదటి సక్సెస్ అందుకున్నాడు అని చెప్పవచ్చు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా మలచడానికి ఆయన చేసిన ప్రయత్నం ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది. ఎక్కడా కూడా కొత్త దర్శకుడు అనే భావన కలిగించకుండా సినిమా మొత్తాన్ని నడిపించే ప్రయత్నం చేశాడు వశిష్ట.

నటీనటుల విషయానికి వస్తే
నందమూరి అందగాడు కళ్యాణ్ రామ్ ఒక రకంగా తన నటనా కౌశలంతో తనదైన ముద్ర వేశాడు. అణువణువునా కండకావరంతో అహంభావంతో రగిలిపోయే బింబిసారుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడా అన్నట్లుగా కళ్ళతో కూడా కొన్ని భావాలు పలికించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమా కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అని కూడా చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో కథానాయికులుగా నటించిన కేథరిన్, సంయుక్త వంటి వారు చాలా చిన్న పాత్రలకే పరిమితమయ్యారు. వారికి నటించే స్కోప్ కూడా దక్కలేదు. అయితే ఒక రకంగా కేథరిన్ తెరిసా పాత్రకు స్క్రీన్ స్పీడ్ కొంచెం ఎక్కువ. ఇక ఆ తర్వాత సినిమాలో చిన్నారి పాత్రలో నటించిన శ్రీ దేవి ఆద్యంతం ఆకట్టుకుంది. కధ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరగడంతో పాటు కళ్యాణ్ రామ్ తో ఎక్కువ సేపు ఆమె కనిపించింది. చిన్నారి అయినా సరే ఎక్కడా కూడా తొట్రు పడకుండా తన పాత్రలో లీనమైపోయింది. ఇక మిగతా పాత్రల్లో కనిపించిన తనికెళ్ళ భరణి అయ్యప్ప శర్మ, ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర వంటి వారు కనిపించిన మేర కామెడీ పండించడానికి ప్రయత్నం చేశారు.

ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే
ఈ టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ అయిన చోటా కె నాయుడు గురించి. అనేక సినిమాలకు పనిచేసిన అనుభవజ్ఞుడైన ఆయన ఈ సినిమాకు తన లెన్స్ తో ప్రాణం పోశాడు. చాలా అందమైన లోకేషన్లు మరింత అందంగా చూపించడానికి ఆయన శతవిధాలా ప్రయత్నం చేశారు. కొన్ని సీన్లు కెమెరా వల్ల మరింత ఎలివేట్ అయ్యాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక సినిమాకు సంగీతం అందించిన చిరంతన్ భట్-వరికుప్పల యాదగిరి కూడా ఆకట్టుకున్నారు. ఇక మునెప్ప గారి వాసుదేవ్ అందించిన మాటలు ఆకట్టుకున్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా సరిగ్గా సరిపోయింది.

ఫైనల్ గా :
కొన్ని చిన్న చిన్న తప్పిదాలు పక్కనపె డితే కళ్యాణ్ రామ్ కెరీర్లో ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన మూవీ ఇది. నందమూరి అభిమానులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నందమూరి అభిమానులు కాకపోయినా కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది.

నటించారు
నటించారు : నందమూరి కళ్యాణ్ రామ్,#కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి.
నిర్మాణం : హరి కృష్ణ.కె
రచన & దర్శకత్వం : వశిష్ట
డిఓపి : చోటా కె నాయుడు
సంగీత దర్శకుడు : ఎంఎం కీరవాణి
ఎడిటర్ : తమ్మి రాజు
విఎఫ్ఎక్స్ నిర్మాత : అనిల్ పాదూరి
పాటలు స్వరపరచినవారు : చిరంతన్ భట్
ఆర్ట్ : కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్ : వెంకట్ & రామ్ క్రిషన్
డైలాగ్స్ : వాసుదేవ్ మునెప్పగారి
విజువల్ ఎఫెక్ట్స్ : అద్విత క్రియేటివ్ స్టూడియోస్
కలరిస్ట్ : శివ కుమార్ బివిఆర్