Bison First Review: బైసన్ మూవీ ఫస్ట్ రివ్యూ

పాపులర్ డైరెక్టర్ పా రంజిత్, సమీర్ నాయర్, దీపక్ సీగల్, అదితి ఆనంద్ నిర్మాతలుగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం బైసన్. చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన స్పోర్స్ డ్రామాను అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, నీలమ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందించారు. ఈ చిత్రంలో లాల్, పశుపతి, రజీషా విజయన్, హరికృష్ణన్, అజగమ్ పెరుమాల్ తదితరులు నటించారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఎజిల్ అరసు కే సినిమాటోగ్రఫి, శక్తి తిరు ఎడిటింగ్, నివాస్ కే ప్రసన్న మ్యూజిక్ అందిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 17వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) ప్రతినిధులు, అధికారులు వీక్షించారు. ఈ సినిమాపై వారు ఇచ్చిన రివ్యూ ఏమిటి? ఈ మూవీకి ఎలాంటి సెన్సార్ సర్టిఫికెట్ లభించింది అనే వివరాల్లోకి వెళితే..

Bison Review by Censor Board

బైసన్ సినిమా కథ విషయానికి వస్తే.. 1990లో తమిళనాడు నేపథ్యంగా సాగే కథ. ఈ చిత్రంలో ధ్రువ్ విక్రమ్ కబాడ్డీ ఆటగాడిగా కనిపించనున్నారు. గ్రామంలో ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా కబడ్డీ ఆడకూడదని తండ్రి ఒట్టు వేయించుకొంటాడు. కబడ్డీ క్రీడా ప్రధాన అంశంగా సాగే డ్రామాలో హీరోకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు ఏమిటి? ఆయనకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? కథా నాయకుడిగా ధ్రువ్‌కు సమాజం నుంచి ఎలాంటి ఒత్తిడులు ఎందుకు? ఎలా? వచ్చాయి. వాటిని ధ్రువ్, అనుపమ ఎలా ఎదురించారనేది సినిమా కథ.

కబడ్డీ ఆట బ్యాక్ డ్రాప్‌తో సాగిన ఈ సినిమాలో సామాజిక అంశాలు ప్రధానంగా జొప్పించారు. సమాజంలో అణగారిన వర్గాలకు ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? ఓ సాధారణ యువకుడి కబడ్డీ క్రీడను ఎందుకు ఎంచుకొన్నాడు? అనే విషయాలను భావోద్వేగాలను జోడించి చూపించిన విధానం బాగుంది. ధ్రువ్ ఆటగాడిగా తీసుకొన్న జాగ్రత్తలు, హావభావాలు కట్టిపడేసేలా ఉన్నాయి అనే అభిప్రాయాన్ని సెన్సార్ స్క్రీనింగ్ సందర్భంగా వెల్లడైనట్టు తెలిసింది.

ఈ చిత్రంలో ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా ఉంటుంది. ఈ మూవీలోని కోర్ ఎలిమెంట్స్ ఎమోషనల్ పంథాలో సాగడం బలంగా కనిపిస్తాయి. రజీషా విజయన్, పశుపతి, ఇతర నటీనటుల తమదైన శైలిలో తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాకు సాంకేతిక నిపుణుల పనితీరు బాగుందనే విధంగా ప్రశంసలు గుప్పించారు అని చిత్రి యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు మార్పులు, చేర్పులు చేశారు. అలాగే కొన్ని డైలాగ్స్‌కు అభ్యంతరాలు తెలిపి మ్యూట్ చేయమని సూచించారు అనే విషయం బయటకు వచ్చింది.

ఇక బైసన్ సినిమాపై పూర్తిస్థాయిలో సంతృప్తిని సెన్సార్ అధికారులు వ్యక్తం చేశారు. ఈ సినిమాకు యూఏ (UA) సర్టిఫికెట్ అందించారు. ఈ సినిమాను 12 ఏళ్లకుపైబడిన బాలలు చూడొచ్చు. కానీ తల్లిదండ్రుల మార్గదర్శకత్వంతో చూడాలని అనుమతి ఇచ్చారు. ఈ సినిమాను శక్తి తిరు పకడ్బందీగా ఎడిటింగ్ చేసి.. ఈ సినిమాను 2 గంటల 48 నిమిషాలకు అంటే 168 నిమిషాలకు కుదించారు. దీపావళీ కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందనే అభిప్రాయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, ఇతర బాక్సాఫీస్ అప్ డేట్స్ గురించి ఫిలింబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X