twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాఘవేంద్రరావు తీసిన చరిత్ర హీన సినిమా సుభాష్‌చంద్రబోస్‌.

    By Staff
    |

    Subash Chandra Bose
    సినిమా: సుభాష్‌ చంద్ర బోస్‌
    విడుదల తేదీ: 22-04-2005
    నటీనటులు: వెంకటేష్‌, జెనీలియా, శ్రీయ, బ్రహ్మానందం,
    ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి తదితరులు
    సంగీతం: మణిశర్మ
    కథ: సత్యానంద్‌
    మాటలు: పరుచూరి బ్రదర్స్‌
    దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
    నిర్మాత: స్వప్నాదత్‌

    సీనియర్స్‌ చిత్రాలు వరుసగా పరాజయాల పాలవుతున్న తరుణంలో, మరో సీనియర్‌ హీరో వెంకటేష్‌, దర్శకుడు రాఘవేంద్రరావు బాక్సాఫీసు ముందు చతికిల పడ్డారు. భారీ బడ్జెట్‌తో చరిత్రాత్మక చిత్రం పేరిట తీసిన ఈ సినిమా దారుణంగా మిగిలింది.

    టీవీ -24 ఛానల్‌లో వెంకటేష్‌ కెమెరామన్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. ప్రధాన మంత్రి కాబోతున్న ప్రకాష్‌రాజ్‌కి లైవ్‌ కవరేజ్‌ చేయాల్సివస్తుంది. ప్రకాష్‌రాజ్‌ని చూడగానే అతనికి గత జన్మ గుర్తుకు వస్తుంది. గతంలో అంటే 1946లో విశాఖపట్నం వద్ద చింతపల్లి అనే గ్రామంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆశయాలతో ప్రేరేపితుడై అదే పేరు గల యువకుడు వెంకటేష్‌. అతను బోస్‌ సేనను స్ధాపించి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటాడు. అతని సహచరులు ప్రకాష్‌రాజ్‌, వేణుమాధవ్‌, అలీ. వీరంతా కలిసి బ్రిటీష్‌ స్ధావరాలపై జెండాలు ఎగురవేయడం, వారికి వ్యతిరేకంగా ఊరేగింపులు జరపడం, గాంధీ గారి మీటింగులకు హాజరవడం జరుగుతుంది. ఒక రోజున బోస్‌ తెగించి బ్రిటన్‌ ప్రభువుల భవంతిలో దూరి వారి ఆయుధాగారాన్ని పేల్చి వేస్తాడు. బోస్‌ ఆగడాలు పెరగడంతో బ్రిటీష్‌ పాలకులు అతని మీద దృష్టి సారిస్తారు. ప్రకాష్‌రాజ్‌ని దగ్గరకు తీసి బోస్‌ను చంపే పథకం వేస్తారు. బోస్‌ ఆ కుట్రకు బలవుతాడు. చనిపోయేటప్పుడు 'మళ్ళీ పుడతా' అంటాడు. ఆ డైలాగ్‌ ఫలితమే ఇప్పటి వెంకటేష్‌. అప్పటి తెల్లవారి తొత్తు ప్రకాష్‌రాజ్‌ ఇప్పుడు ప్రధానమంత్రి కాబోతున్నాడు.

    దేశద్రోహి అయినా ప్రకాష్‌ రాజ్‌ నుంచి దేశాన్ని బోస్‌ ఎలా రక్షించాడన్నది మిగితా కథ.

    సినిమాలో రెండు ఆఫ్‌లూ బోరింగ్‌గా ఉన్నాయి. దేశభక్తి మీద చిత్తశుద్ధి లేకుండా తీసిన సినిమా ఇది. తాజా హిందీ చిత్రం 'కిస్నా'ను ఇమిటేట్‌ చేసిన సినిమా ఇది. సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ ఎక్కువ అయింది. హీరో వెంకటేష్‌ మళ్ళీ జన్మించి పెద్దవాడైనా విలన్‌ ప్రకాష్‌రాజ్‌ మాత్రం అలాగే ఉండడం విడ్డూరం. హీరోయిన్‌ జెనీలియా నేటి బోస్‌కి, శ్రీయ నాటి బోస్‌కి ప్రియురాళ్ళుగా ప్రాధాన్యం లేని పాత్రల్లో నటించారు. రాఘవేంద్రరావు సినిమాల్లో బాగా ప్రముఖంగా ఉండే పాటలు నీర్సంగా ఉన్నాయి. స్క్రీన్‌ప్లే బాగాలేదు. ఎక్కువ సేపు ఫ్లాష్‌బ్యాక్‌ ఉండడం, దానిలో కథ లేకపోవడం సినిమా అపజాయానికి ప్రధాన కారణం.
    దట్స్‌తెలుగు డాట్‌కామ్‌ విశ్లేషం: ఈ సినిమాకు దూరంగా ఉంటే మంచిది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X