For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'జెఫ్పా' సినిమా (రివ్యూ)

  By Srikanya
  |

  -సూర్య ప్రకాష్ జోశ్యుల

  Rating:
  0.5/5
  తెలుగు తెరమీద హీరోతో సమానంగా వెలిగిపోతున్న బ్రహ్మానందం హీరోగా చేస్తున్నాడంటే ప్రేక్షకులు ఓ రేంజిలో ఊహించుకుంటారు.... పూర్తి నవ్వుల విందు ఉంటుందని భావిస్తారు. అయితే గతంలోనూ బ్రహ్మానందం హీరోగా వచ్చిన బాబాయ్ హోటల్, లోఫర్ మామ సూపర్ అల్లుడు, సూపర్ హీరోస్ వంటి చిత్రాలు ఆ అంచనాలు తల క్రిందులు చేసాయి. గ్యాప్ తీసుకుని మళ్లీ తనే పాపులర్ చేసిన జఫ్పా టైటిల్ తో వచ్చినా పరిస్ధితిలో మార్పులేదు... కామెడీ కోసం వచ్చిన ప్రేక్షకుల బ్రతుకు ట్రాజడీ చేసాడు. కథ, కథనాల సమస్యే సినిమాలో ఇబ్బందిగా మార్చింది. దర్శకుడు హాలీవుడ్ చిత్రం Buried (2010)ని తెలుగులో దించి కొరివి పెట్టాడు.

  సాఫ్ట్ వేర్ ఎంప్లాయి... జాస్మిన్ పాల్గున ఉరఫ్ జఫ్పా (బ్రహ్మానందం) ఓ మర్డర్ కేసులో జైలుకి వెళ్తాడు. అక్కడ నుంచి బయిటపడదామని వేసిన ఓ దిక్కుమాలిన ప్లాన్ తో... ఓ శవపేటిక లో ఇరుక్కుపోయి.. పాతి పెట్టబడతాడు. ఆ శవపేటికలో కేవలం ఓ సెల్ ఫోన్ మాత్రమే ఉంటుంది. దాని సాయింతో అక్కడ నుంచి అతను ఎలా బయిటపడ్డాడు అనేది మిగతా కథ.

  వెన్నల వన్ అండ్ హాఫ్.. తో దర్శకుడుగా పరిచయమైన వెన్నెల కిషోర్ కి ఇది రెండో చిత్రం. ఎక్కడా దర్శకత్వం ప్రతిభ కానీ, స్క్రిప్టులో మెరుపులు కానీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని చేసాడు. ప్రేక్షకులు ఎక్కడైనా పొరపాటున నవ్వుతారేమో అన్నట్లు సీన్స్ నడుస్తారు. దానికి తోడు ఫస్టాఫ్ నలభై ఐదు నిముషాల్లో ముగించి... సెకండాఫ్ లెంగ్త్ పెంచి ఇబ్బంది పెట్టాడు. ఫస్టాఫ్ పూర్తిగా తీసేసి, సెకండాఫ్ తో సినిమా ఓపెన్ చేసి.. కథ అర్దమయ్యేలా ప్లాష్ కట్స్ వేసి రీ ఎడిట్ చేసి వదిలితే బెస్ట్ అనిపిస్తుంది. ఇక తెరనిండా అలీ,రఘుబాబు వంటి కామెడీ యాక్టర్స్ కనపడుతూనే ఉన్నా ఫలితం లేదు... ఎక్కడా ఏ జోక్ కి కితకితలు పెట్టుకున్నా నవ్వురాదు. ఇక నవ్వు వచ్చిన కొద్ది జోక్స్ గతంలో చూసేసినవే అవటం మరో విషాదం. పోనీ నటుడుగా అయినా వెన్నెల కిషోర్ తన సొంత సినిమాలో అదరకొట్టాడా అదీ శూన్యమే... సినిమాలో అన్నీ మైనస్ లేనా అంటే.... రెండు రిలీఫ్ లు ఉన్నాయి. అవి.. విశ్రాంతి, శుభం కార్డు పడటం. సినిమా మొత్తం మీద తాగుబోతు రమేష్ కామెడీకి కాస్త నవ్వు వచ్చింది.

  మిగతా రివ్యూ స్లైడ్ షో లో...

  సినిమాలో బ్రహ్మానందం మాత్రం ఎప్పటిలాగే వంకపెట్టలేదని విధంగా నటించారు. కానీ అది దర్శకుడు అవగాహనా లేమితో కొట్టుకుపోయింది.

  డైలాగులు సినిమాకు ప్లస్ కాలేదు. ఎక్కడా పేలలేదు.

  ఫింక్ ఫాంధర్ సిరీస్ ని గుర్తు చేస్తూ సాగే డిటిక్టివ్ పాత్తరలో అలీ కనిపిస్తాడు. కానీ ఆ పాత్రలో పంచ్ మిస్సైంది.

  5డిలో తీసిన కెమెరా వర్క్ చాలా సార్లు ఇరిటేట్ చేస్తుంది. ఎడిటింగ్ అయితే ఫస్టాఫ్ తీసేస్తే బాగుండును అనిపిస్తుంది.

  సినిమాలో పాటలు పెట్టకపోవటంతో ఆ కాస్త రిలీఫ్ కూడా ప్రేక్షకులుకు దక్కలేదు. వరస పెట్టి వాయి తీస్తున్నట్లు ఉంది.

  అనూప్ రూబెన్స్ సినిమాకు మైనస్ కాదు.. ప్లస్ కాదూ... సినిమాకు తగ్గట్లు నడిచిపోయింది.

  బ్రహ్మానందం క్యారెక్టర్ కోసమో... కథ కోసమో ఆ టైటిల్ పెట్టినట్లు లేదు.. చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులను ఉద్దేసించి పెట్టినట్లుంది.

  నటీనటులు: బ్రహ్మానందం, అలీ, ఫిష్ వెంకట్, శ్రావణ్
  నిర్మాత: రమేష్ వర్మ
  సంగీతం: అనూప్ రూబెన్స్
  సినిమాటోగ్రఫీ: రాజా
  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
  కథ, స్క్రీప్ ప్లే, దర్శకత్వం: వెన్నెల కిషోర్

  English summary
  Brahmanandam has played hero in several movies earlier, but no film has created so much curiosity among the film goers as his latest outing Jaffa has done it. But it fail to impress Audience due to its week storyline and direction.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X