For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జస్ట్ కామెడీ..(బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ రివ్యూ)

  By Bojja Kumar
  |

  Rating:
  2.5/5

  హైదరాబాద్: ఇ.వి.వి సత్యనారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న కామెడీ ఎంటర్టెనర్ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ'. అల్లరి నరేష్-మోనాల్ గజ్జర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్ ట్విన్ సిస్టర్‌గా ‘రంగం' ఫేం కార్తీక నటించింది. ‘వీడు తేడా' ఫేం బి. చిన్ని దర్శకుడు. ఈ రోజు ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం...

  కథ విషయానికొస్తే... రాంకీ(అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) కవలలు. రాంకీ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ క్యారెక్టర్ అయితే ...లక్కీ చాలా రఫ్ అండ్ డేరింగ్ లేడీ. ఇంటా..బయట ఎక్కడ చూసినా లక్కీ డామినేషనే నడుస్తుంది. పలు సందర్భాల్లో అతన్ని అపాయాల నుండి కాపాడుతుంది కూడా. అదే సమయంలో ఆమె దూకుడు కారణంగా రాంకీ ఇబ్బందులు సైతం పడుతుంటారు. ఈ క్రమంలో రాంకీ శృతి(మోనాల్ గజ్జర్) ప్రేమలో పడతాడు. కానీ చెల్లి పెళ్లి అయ్యేదా నువ్వు ఆగాల్సిందే అంటూ షరతు పెడతాడు తండ్రి. దీంతో చెల్లి లక్కీకి పెళ్లి చేసేందు సిద్ధమవుతాడు రాంకీ. కానీ లక్కీ తనకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతూ ఉంటుంది. ఆమె ఎందుకు అలా చేస్తుంది? చివరికి రాంకీ పెళ్లి శృతితో ఎలా జరిగింది అనే ఆసక్తికరంగా, నవ్వులు పూయిస్తూ సాగుతుంది.

  అల్లరి నరేష్ ఎప్పటిలానే తనదైన పెర్ఫార్మెన్సుతో ఆకట్టుకున్నాడు. అల్లరి నరేష్ క్యారెక్టర్ తో సమానంగా కార్తీక క్యారెక్టర్ ఉంది. కార్తీక తన పాత్రకు న్యాయం చేసింది. ఇక హీరోయిన్ మోనాల్ గజ్జర్ పాటలకు, కొన్ని సన్నివేశాలకు పరిమితం అయింది. బ్రహ్మానందం, మోనాల్, హర్షవర్దన్, శ్రీనివాసరెడ్డి, నాగినీడు, వెన్నెల కిషోర్, వినీత్ కుమార్, అబిమన్యుసింగ్, కెల్లీ డార్జ్, ఎల్.బి.శ్రీరాం, సుధ తదితరులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

  అల్లరి నరేష్ సినిమా అంటేనే కామెడీ, టైమింగ్, వినోదా ఆశించి వెళతారు ప్రేక్షకులు. ప్రేక్షకులు కోరుకున్న అంశాలు జొప్పించడంలో దర్శకుడు ఫర్వాలేదు కానీ...కథ, కథనం రోటీన్ గా ఉండటం నిరాశ పరుస్తుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బోరింగుగా ఉంది. కథ ముందే ఊహించే విధంగా ఉంది. అయితే డైలాగులు, కామెడీ సన్నివేశాలతో స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో ఆసక్తికరంగా సాగించాడు. అయితే సెకండాఫ్ లో మాత్రం రోటీన్‌గా తీసుకెళ్లాడు దర్శకుడు.

  టెక్నికల్ అంశాల విషయానికొస్తే శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఫర్వా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. ఇతర విభాగాలు ఫర్వా లేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే కామెడీ సినిమాలు ఇష్టపడే వారు..ముఖ్యంగా అల్లరి నరేష్ మార్కు కామెడీ ఇష్టపడే వారిని ఈ చిత్రం అతరిస్తుంది.

  Brother Of Bommali Movie Review

  English summary
  Allari Naresh's latest out Brother Of Bommali(BOB), which has been creating postive response in the media from weeks ago, has released worldwide today(November 7). Veedu fame writer-director B. Chinni Krishna has directed the movie, which features Karthika Nair, Monal Gajjar, Brahmanandam,Harshvardhan Rane in the other important roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X