Celebrities Review on Kantara: ఆస్కార్ స్థాయిలో కాంతార.. రిషబ్ శెట్టికి ఎన్టీఆర్, సందీప్, సెలబ్రిటీల జేజేలు!
Celebrities Review on Kantara: స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. అక్టోబర్ 1న ప్రీమియర్ షోలు ప్రారంభమై, గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. పాన్-ఇండియా స్థాయిలో వచ్చిన ఈ సినిమా తొలి రోజే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో అభిమానులు 'అద్భుతమైన అనుభవం' అంటూ రివ్యూలు షేర్ చేస్తున్నారు. కేవలం అభిమానులే కాదు .. ఆస్కార్ స్థాయిలో కాంతార అంటూ.. రిషబ్ శెట్టికి జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ సందీప్ వంగా లాంటి సెలబ్రిటీల జేజేలు కొడుతున్నారు. కాంతార సినిమాపై సెలబ్రెటీల రివ్యూ ఎంటీ? మీరు కూడా ఓ లూక్కేయండి.
ఇండియన్ ఫిల్మీ ఇండస్ట్రీలో కొత్త సంచలనం రేపిన మూవీ'కాంతార: చాప్టర్ 1'. ఈ సినిమాను చూసిన వారు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ సినీ తారలు, దర్శకులు, నిర్మాతలు వరుసగా స్పందిస్తూ రిషబ్ శెట్టి నటనను, హోంబలే ఫిలింస్ సాహసాన్ని కొనియాడుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ 'కాంతార: చాప్టర్ 1' రివ్యూ
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 'ఎక్స్' వేదికగా స్పందించిన ఎన్టీఆర్ ఇలా రాశారు. "అద్భుతమైన విజయాన్ని సాధించిన 'కాంతార: చాప్టర్ 1' టీమ్‌కు అభినందనలు. రిషబ్ శెట్టి గారు నటుడిగా, దర్శకుడిగా రాణించారు. ఊహకందని అద్భుతాన్ని సృష్టించారు. ఆయన విజన్‌ను నమ్మి, ధైర్యంగా వెనుక నిలిచిన హోంబలే ఫిలింస్ నిర్మాతలతో పాటు సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్లందరికీ నా శుభాకాంక్షలు." అంటూ ట్విట్ చేశారు.
సందీప్ రెడ్డి వంగా 'కాంతార: చాప్టర్ 1' రివ్యూ
ప్రస్తుతం ఇండియన్ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న 'కాంతార: చాప్టర్ 1'పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన స్పందనను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వంగా తన రివ్యూలో 'ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతవరకు ఇలాంటి సినిమా చూడలేదు. ఇది నిజంగా ఒక మాస్టర్‌పీస్. 'కాంతార చాప్టర్ 1' అనేది సినీమాటిక్ థండర్‌స్టార్మ్ లాంటిది. అది రా, డివైన్, అన్‌షేకబుల్‌గా అనిపించింది.' అని పేర్కొన్నారు. అలాగే హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి గురించి వంగా ప్రశంసిస్తూ.. 'రిషబ్ శెట్టి నిజంగా ఒక వన్ మ్యాన్ షో ఇచ్చాడు. మొత్తం సినిమాను ఒక్క చేతితో మలిచాడు, తన భుజాల మోశాడు'అని అన్నారు. ఇక ఈ సినిమాలో సంగీతం అందించిన అజనీష్ బి. లోకనాథ్ (BGM) గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది'అని ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం వంగా చేసిన ఈ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా 'కాంతార చాప్టర్ 1 నిజంగా పాన్ ఇండియా లెవెల్ మాస్టర్‌పీస్'అని కామెంట్లు చేస్తున్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రివ్యూ
స్టార్ డైరెక్టర్ కూడా కాంతార సినిమాపై ప్రశంసలు కురిపించారు. ప్రశాంత్ వర్మ తన ట్వీట్‌లో 'కాంతార 1 కేవలం సినిమా కాదు.. ఇది ఒక గర్జన, సాంస్కృతిక అద్భుతం. రిషబ్ శెట్టి గారు తన జీవితంలోనే అత్యుత్తమ నటన కనబరిచారు. హోంబలే ఫిలింస్‌కి ధన్యవాదాలు. సినిమాటిక్ విజువల్స్ మరచిపోలేనివి, అజనీష్ బి. అందించిన మ్యూజిక్ సినిమాకు ఆత్మ లాంటిది. రుక్మిణి పాత్రలో డెప్త్, ఎలిగెన్స్ తీసుకువచ్చారు. ఇది ఇటీవలి కాలంలో చూసిన అత్యుత్తమ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌లో ఒకటి. 'అని పేర్కొన్నారు.
రోహిత్ నారా రివ్యూ
నారా రోహిత్ తన ట్వీట్‌లో 'కాంతార: చాప్టర్ 1 గురించి అద్భుతమైన మాటలు వింటున్నాను. రిషబ్ శెట్టి గారు తన ట్రేడ్‌మార్క్ మ్యాజిక్ మరోసారి చూపించారని నమ్ముతున్నాను. మొత్తం హోంబలే టీమ్‌కి అభినందనలు.అని పేర్కొన్నారు.
అశ్విని పుణీత్ రాజ్‌కుమార్ అభిప్రాయం
దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ కూడా కాంతార సినిమాలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 'కాంతార ఒక మాస్టర్‌పీస్ లాంటి సినీమాటిక్ అనుభవం. జానపదం, భక్తి, మానవ భావోద్వేగాలను అద్భుతంగా మిళితం చేశారు. రిషబ్ శెట్టి శక్తివంతమైన నటన కనబరిచారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ దివ్య గాథ వెనుక ఉన్న మొత్తం బృందానికి శుభాకాంక్షలు."
జ్యోతి పూర్వజ్ రివ్యూ
గుప్పెడంత మనసు ఫేమ్ 'జగతి మేడమ్' అలియాస్ జ్యోతి పూర్వజ్ కూడా కాంతార 1 మూవీ రివ్యూ వెల్లడించారు. ఈ మూవీ అద్భుతమైన అనుభవం. తప్పక చూడాల్సిన సినిమా అంటూ ప్రశంసలు కురిపించారు. ఇలా సినీ సెలబ్రెటీలు కాంతార 1 పై ప్రశంసలు కురిపిస్తారు. ముఖ్యంగా రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం, అజనీష్ బి. అందించిన బీజీఎం, సినిమాటోగ్రఫీ అన్నీ కలిసొచ్చి 'కాంతార: చాప్టర్ 1'ను ఓ డివైన్ అనుభూతిగా మార్చేశాయి. పాన్-ఇండియా స్థాయిలో ఇప్పటికే ఈ మూవీ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది.


Click it and Unblock the Notifications











