»   » ఎక్కచ్చు కానీ... (చెన్నై ఎక్సప్రెస్ రివ్యూ)

ఎక్కచ్చు కానీ... (చెన్నై ఎక్సప్రెస్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:
2.5/5
హీరో ... కింగ్ ఆఫ్ రొమాన్స్, దర్శకుడు...కింగ్ ఆఫ్ కామెడీ...వీరిద్దరు కాంబినేషన్ లో చిత్రం అంటే ఆ ఎక్సపెక్టేషన్స్ ఏ రేంజిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. అందులోనూ మిడిల్ ఏజ్ దాటుతున్న ఈ సమయంలో ... హీరోగా ఏ తరహా చిత్రాలు చేయాలో అర్దం కాక,వరస ఫ్లాపులతో సతమతమవుతున్న షారూఖ్ తన బ్రాండ్ ఇమేజ్ ని మార్చుకుని,సౌత్ హీరోయిజం వెంటేసుకుని వస్తున్నాడు అనేది మరో క్రేజీ ఎలిమెంట్. అయితే ఆ ఎక్సపెక్టేషన్స్ ని సినిమా అందుకుందా అంటే లేదనే చెప్పాలి. తెలుగులో సునీల్ చేసే సినిమాల టైప్ లో హీరోని అమాయికుడుగా...అతి మంచి వాడుగా చూపించి...కామెడీ చేసి..కాసులు రాల్చాలనే వ్యూహం పన్నాడు దర్శకుడు. 'జబ్ తక్ హై జాన్' చిత్రం ఫ్లాప్ తర్వాత వచ్చిన ఈ యాక్షన్, కామెడి అంత కిక్ ఇవ్వలేదు. కాస్సేపు నవ్వుకోవటానికి మాత్రమే పనికొచ్చే టైమ్ పాస్ ఫ్లిక్ గా మిగిలింది.

నార్త్ కుర్రాడు...సౌత్ అమ్మాయితో ప్రేమలో పడటమే కాన్సెప్టు తో వచ్చిన ఈ చిత్రంలో ...షారూఖ్ రాహుల్ గా కనిపిస్తాడు. అతను తన తాత.. అస్దికలను రామేశ్వరంలో కలిపాలని బయిలుదేరతాడు. అదే సమయంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తూండంతో ... తమిళనాడు గ్రామంలోని ..ఇంట్లోంచి పారిపోయి వచ్చిన మీనమ్మ(దీపిక పదుకోని)..చెన్నై ఎక్సప్రెస్ లో మన హీరోని కలుస్తుంది. ఆమెతో పాటు ఆమె తండ్రి (సత్యరాజ్)అనుచరులు..వెనకే ఉంటారు. ఈ లోగా టిక్కెట్ కలెక్టర్ వచ్చి వాళ్లని టిక్కెట్ అడగటంతో అతన్ని వెళ్లై ట్రైన్ లోంచి క్రిందకు తోసేస్తారు. ఈ సంఘటనకు సాక్ష్యం...రాహుల్ కావటంతో అతన్ని తమతోపాటు తమ గ్రామంకి రమ్మంటారు. ఏం చేయాలో అర్దం కాని పరిస్దితుల్లో అతను ఆమె తో పాటు వాళ్ల ఊరు వస్తాడు. అక్కడ ఆమె...రాహుల్ ని పెళ్లి తప్పించుకోవటం కోసం బోయ్ ప్రెండ్ గా పరిచయం చేస్తుంది. ఆ తమిళనాడులోని కుగ్రామంలో భాషకూడా రాని రాహుల్ ఎలా తప్పించుకుని బయిటపడ్డారు. వీరిద్దరు మద్య ప్రేమ కథ ఎలా చిగురించింది...చివరకు వీళ్లిద్దరూ ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ.

వాస్తవానికి 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చూస్తుంటే ఓ పది తెలుగు సినిమాలు,నాలుగు తమిళ కామెడీ సీన్స్ ఒకేసారి తెరపై చూస్తున్న ఫీల్ కలుగుతుంది. నార్త్ కు కొత్తేమో కానీ...తెలుగువారికి ఈ సీన్స్,కథ చాలా చాలా రొటీన్. ముఖ్యంగా ..తెలుగులో పెద్ద హిట్టైన ఒక్కడులో సీన్స్,సునీల్ పూల రంగడులో సీన్స్ మనని పలకరిస్తున్నాయి. ఇంకా ఎన్నో గుర్తుకు రాని సీన్స్ ప్రతీ సన్నివేసంలో గుర్తుకు వచ్చి మనని సినిమా చూడనీయకుండా డిస్ట్రబ్ చేస్తుంది. ఇవన్నీ ఎలా ఉన్నా...ఈ కథని ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో ఎందుకు చెప్పారో అర్దం కాదు....మొదటి పదినిముషాల్లోనే మనకు ఎన్నో డౌట్స్ వస్తాయి. హీరోయిన్ ... షారూఖ్ ని తన బోయ్ ప్రెండ్ అని పరిచయం చేస్తుంటే... ఆమెతో పాటు ఉన్న ఆమె తండ్రి అనుచరులకు అసలు షారూఖ్ ..ట్రైన్ లోనే పరిచయం అయ్యాడనే విషయం తెలుసు కదా..ఎందుకు తమ బాస్ కి చెప్పరు.. అనే డౌట్ వస్తుంది. ఇలా చాలా లైటర్ వీన్ తో ..స్టార్ ఇమేజ్ తో కొట్టుకుపోవచ్చునే ధైర్యంతో దర్శకుడు రోహిత్ శెట్టి ఈ ధైర్యం చేసాడని అర్దం అవుతుంది.

మిగతా రివ్యూ... స్లైడ్ షోలో...

డ్రైవర్...

డ్రైవర్...

47 వయస్సులోనూ షారూఖ్ తన ఛామ్ ని కోల్పోలేదు. అయితే కొన్ని చోట్ల షారూఖ్ ఓవర్ యాక్టింగ్ చేసినా, అతనే వన్ మ్యాన్ షో టైప్ లో సినిమా మొత్తం..నవ్వించటమో,ఎమోషన్ పండించటమో చేస్తాడు. చెన్నై ఎక్సప్రెస్ కు అతనే డ్రైవర్.

మెస్మరైజింగ్..

మెస్మరైజింగ్..

దీపిక,షారూఖ్ జంట..ఓం శాంతి ఓం తరహాలో మరోసారి మెస్మరైజ్ చేస్తుంది. ఫస్టాఫ్ లో ఆ తరహా సీన్స్ లేకపోయినప్పటికీ సెకండాఫ్ లో రొమాన్స్ ని బ్లెండ్ చేసి ,షారూఖ్ సినిమా అనిపించే ప్రయత్నం చేస్తాడు దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి కన్నుల పండువగా ఉంటుంది. ముఖ్యంగా దీపిక..తమిళ అమ్మాయిగా సూపర్బ్ అనిపిస్తుంది.

డిడిఎల్ జె

డిడిఎల్ జె

షారూఖ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన డిడిఎల్ జె మ్యాజిక్ ని దర్శకుడు ఈ చిత్రంలో చాలా సార్లు గుర్తు చేసి మార్కులు కొట్టేస్తాడు. అప్పటికీ ఇప్పటికీ షారూఖ్ లో పెద్ద తేడాలేదనిపిస్తుంది. అయితే షారూఖ్ పాత్రే తెలుగు సినిమాలో కామెడీ హీరోలా బఫూన్ లా అనిపించి కొన్ని చోట్ల విసుగు అనిపిస్తుంది.

తమిళ సెంటిమెంట్

తమిళ సెంటిమెంట్

సినిమా ప్రారంభమైన కాస్సేపటికి తమిళ సెంటిమెంట్, తమిళ డైలాగులు మొదలై మరీ ఎక్కువై విసిగిస్తాయి. అయితే లుంగి డాన్స్ వంటివి అలరిస్తాయి. సినిమా చివర్లో తలైవా అంటూ షారూఖ్ ..రజనీ ఫ్యాన్స్ అంటూ చేసే డాన్స్ మాత్రం బాగుంటుంది. షారూఖ్ వంటి పెద్ద స్టార్ మరో స్టార్ హీరోకి ఇలా అభిమానని అని డైరక్ట్ గా చెప్పి పాట పెట్టడం మాత్రం గ్రేటే.

కలిసొచ్చిన రంజాన్

కలిసొచ్చిన రంజాన్

సినిమా ఎలా ఉన్నా...రంజాన్ సెలబ్రేషన్స్ సినిమాకు విపరీతమైన బిజెనెస్ తెచ్చిపెడతాయనటంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా 3500, విదేశాల్లో 700 థియేటర్లలో విడుదలైంది. భారతీయ సినిమాలకు పెద్దగా మార్కెట్‌లేని పెరూ, ఇజ్రాయిల్ దేశాతొలిసారి విడుదలైన బాలీవుడ్ చిత్రంగా చెన్నై ఎక్స్‌ప్రెస్ రికార్డుల్లోకెక్కింది. అంతేకాకుండా నార్త్ అమెరికాలో 195 స్క్రీన్లలో, బ్రిటన్ 175 స్క్రీన్లతోపాటు మొరాకో, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాల్లో ప్రద ర్శనకు సిద్ధమవుతోంది.

రోహిత్ శెట్టి బ్రాండ్

రోహిత్ శెట్టి బ్రాండ్

రోహిత్ శెట్టి గత చిత్రాలు తరహాలోనే ... ఈ చిత్రంలోనూ చాలా చోట్ల మైండ్ లెస్ కామెడీ జరుగుతూంటుంది. అయితే షారూఖ్ సినిమా అంటే మరీ కామెడీగా కొట్టిపారేయలేం అనుకునే వారికి మాత్రం ఇది డైజస్ట్ కాదు. అయితే షారూఖ్ తానూ సల్మాన్ కి ధీటుగా చేయాలని కొత్తగా ప్రయత్నించాడని సరిపెట్టుకోవాలి.

ఆ రేంజి లేదు...

ఆ రేంజి లేదు...

కామెడీయే ప్రధాన నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం ఆ రేంజ్ లో లేకపోవడం ప్రేక్షకుడిని నిరాశపరిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా షారుక్, దీపికా కెమిస్ట్రీని ఎంజాయ్ చేయాలనే టేస్ట్ ఉన్న అభిమానులకు, రిలాక్స్ కోసం ధియేటర్‌కు వెళ్లాలనుకునే ఫ్యామిలీ కేటగిరి ప్రేక్షకులకు చెన్నై ఎక్స్‌ప్రెస్ నచ్చడం ఖాయం.

అక్కడ కొన్ని..ఇక్కడ కొన్ని..

అక్కడ కొన్ని..ఇక్కడ కొన్ని..

షారుక్, దీపికలకు తగ్గట్టుగా కథను సిద్ధం చేసుకోకపోవడం దర్శకుడి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. అక్కడ సీన్స్ కొన్ని,ఇక్కడ సీన్స్ కొన్ని ఎత్తి కథను తయారు చేసుకున్నాడని మొదట పది నిముషాలకే అర్దమవుతుంది. షారూఖ్ వంటి స్టార్ హీరో ఉన్నా....కథను పట్టించుకోకపోవటం విచిత్రమనిపిస్తుంది.

 టెక్నికల్ గా ...

టెక్నికల్ గా ...

సినిమా టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. అలాగే..నటీనటులు కూడా తమకుతగ్గ నటన చేసారు. ప్రియమణి ఐటం సాంగ్ లో అలా కనిపించి మెరిసిపోయింది. పాటలు ..షారూఖ్ చిత్రాలకు తగ్గట్లు లేకపోయినా...టైటిల్ ధీమ్ మ్యూజిక్,ఎండ్ టైటిల్స్ వద్ద సాంగ్ బాగుంది.

ఎవరెవరు...

ఎవరెవరు...

బ్యానర్ : రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్
నటీనటులు: షారూఖ్ ఖాన్, దీపిక పదుకోనీ, సత్యరాజ్, నికితిన్ ధీర్, ప్రియమణి తదితరులు
కథ: కె.సుభాష్
స్క్రీన్ ప్లే :యూనస్ సజావాల్
ఎడిటర్: స్టీవెన్ హెచ్. బెర్నాడ్
సంగీతం: విశాల్-శేఖర్
ఛాయాగ్రహణం: డూడ్లీ
సమర్పణ: సినీ గెలాక్సీ, 3కె ఎంటర్‌టైన్‌మెంట్స్,
నిర్మాతలు: గౌరీ ఖాన్, రోనీ స్క్రూ వాల్, సిద్దార్ద రాయ్ కపూర్
దర్శకత్వం: రోహిత్ శెట్టి
విడుదల తేది: ఆగస్టు 9, 2013


ఫైనల్ గా ఈ చిత్రం కామెడీ సినిమా చూడాలనుకునేవారికి ఓ మంచి ఆప్షన్. అయితే షారూఖ్ గత చిత్రాలతో పోల్చుకుని చూస్తే మాత్రం నిరాసపడతారు. షారూఖ్ చిత్రాలకు తగ్గట్లు లేకపోయినా రెగ్యులర్ తెలుగు సినిమాలు చూసేవారికి నచ్చుతుంది. అయితే తెలుగు సినిమాలు చూసేవారిలో మతిమరుపు ఉన్నవారికి మరింత బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎక్కువ సీన్స్ మన సినిమాలనుంచి లేపినవే కాబట్టి....

(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Chennai Express is a light-hearted entertainer, that stands strong and tall on the shoulders of the super powerful 'Brand Shahrukh Khan'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu