twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫర్వాలేని చెన్నకేశవరెడ్డి

    By Staff
    |

    Chenna Kesava Reddy
    -జలపతి
    చిత్రం: చెన్నకేశవరెడ్డి
    నటీనటులు: బాలకృష్ణ, టబూ, ష్రియా, దేవయాని, చలపతిరావు
    సంగీతం: మణిశర్మ
    మాటలు: పరుచూరి బ్రదర్స్‌
    నిర్మాత: బెల్లంకొండ సురేష్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌

    బాలకృష్ణ నటన, మంచి టెక్నికల్‌ వ్యాల్యూస్‌, అద్భుతమైన ఫోటోగ్రఫీ, రిచ్‌ బడ్జెట్‌, వినాయక్‌ దర్శకత్వ ప్రతిభ ఇలా అన్నీ తోడైనా..చెన్నకేశవరెడ్డి చిత్రంలో ఎక్కడో లోపం. ఆ లోపం వల్లే..ప్రథమార్థం హాయిగా చూసిన ప్రేక్షకుడు ద్వితీయార్థంలో ఈ చిత్ర దర్శకుడి మాదిరిగానే అయోమయానికి గురవుతాడు. ఆది చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్‌ పూర్తిగా కెమెరా యాంగిల్స్‌ నే నమ్ముకున్నాడు.

    చక్కటి ఓపెనింగ్‌, ఫాస్ట్‌ గా సాగే స్క్రీన్‌ ప్లే తో ప్రథమార్థం చాలా బాగుంది అనే తరహాలో సాగుతుంది. ద్వితీయార్థంలో చెన్నకేశవరెడ్డి 'పగ' ఎంతకీ చల్లారకపోవడం, కథనం మరీ సాగదీయడం, అంతులేని యాక్షన్‌ దృశ్యాలు(అవీ ఎంత బాగున్నప్పటికీ) వల్ల ప్రేక్షకుడికి చివర్లో నిరాశే కలుగుతుంది. ఆరంభశూరత్వమే అనుకోవాల్సి వస్తుంది.

    సీమ కథలో బలం లేని చిత్రాలేవీ ఇప్పటివరకు ఆకట్టుకోలేదు. ఈ చిత్రంలో బాలకృష్ణ నటన చాలా బాగుంది. చెన్నకేశవరెడ్డిగా ఆయన చేసిన నటన ఆకట్టుకుంటుంది. అయితే, 'నరుకుతా, నరుకుతా' అన్న పాతపడ్డ డైలాగ్స్‌ తప్ప కొత్తగా ఆకట్టుకునే 'పంచ్‌' డైలాగ్స్‌ లేకపోవడం, 'పగ'లో 'బలం' లేకపోవడం సినిమాను చివర్లో పేలవంగా మార్చింది. బాలకృష్ణ అందంగా ఉన్నాడు. హుందాగా ఉన్నాడు.

    ద్వితీయార్తం మొత్తం చిత్రాన్ని హడావిడిగా తీసినట్లు స్పష్టంగా కన్పిస్తుంది. విక్రమ్‌ ధర్మా యాక్షన్‌ స్టంట్స్‌ అద్భుతంగా కుదిరినా, వాటి నిడివి అధికం కావడం వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది. అందునా, ఒక యాక్షన్‌ సీక్వెన్స్‌ కాగానే మరో యాక్షన్‌ సీక్వెన్స్‌ ...ఇలా చిత్రం అంతా 'యాక్షన్‌' చేయడంతో గతి తప్పింది.

    టబు చేయాల్సిన పాత్ర కాదు. దేవయానిది చిన్న పాత్ర అయినా సమర్ధంగా పోషించింది. ఇక ష్రియ ప్రాత్ర చాలా పరిమితం. మిగతా పాత్రధారులందరూ గతంలో అలాంటి పాత్రలు చేసిన వారే. అజయ్‌ విన్సెంట్‌ అద్భుతమైన ఫోటోగ్రఫీని కనపర్చాడు. గౌతంరాజు ఎడిటింగ్‌ కూడా అదే స్థాయిలో ఉండి ప్రథమార్థం బిగువుగా కనిపిస్తుంది. వినాయక్‌ లో 'టెక్నిక్‌' ఉంది. కానీ కథనంపై కూడా శ్రద్ధ వహిస్తే, ఈ చిత్రం మంచి యాక్షన్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచేది. మణిశర్మ పాటలు కన్నా రీరికార్డింగ్‌ బాగుంది.

    కథ : చెన్నకేశవరెడ్డి(బాలకృష్ణ) తల్లితండ్రులను కుటుంబాన్ని జయప్రకాష్‌ రెడ్డి వర్గీయులు మట్టుపెడుతారు. దీంతో జయప్రకాష్‌ రెడ్డిని చెన్నకేశవరెడ్డి చంపేస్తాడు. కానీ అతని కుమారులు బతికే ఉంటారు. వారు చెన్నకేశవరెడ్డిపై హత్యనేరం మోపి కేసు కోర్టు విచారణకు రాకుండా 22 ఏళ్ళు తీహార్‌ జైలులోనే ఉంచుతారు. చెన్నకేశవరెడ్డి కుమారుడు భరత్‌ (బాలకృష్ణ) పెద్దవాడై పోలీసు ఆఫీసర్‌ అవుతాడు. 22 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చిన చెన్నకేశవరెడ్డి జయప్రకాష్‌ రెడ్డి కుమారులను ఒక్కొక్కరిగా చంపేస్తుంటాడు. భరత్‌ తండ్రిని అరెస్ట్‌ చేసేందుకు తొలుత ప్రయత్నించినా, చివరకి తండ్రి పగలో తాను పాలుపంచుకొని పోలీసు వృత్తికి స్వస్తి చెప్పుతాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X