»   » చినబాబు మూవీ రివ్యూ: సెంటిమెంట్ డోస్ ఎక్కువైంది!

చినబాబు మూవీ రివ్యూ: సెంటిమెంట్ డోస్ ఎక్కువైంది!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Chinna Babu Movie Review చిన బాబు మూవీ రివ్యూ

  Rating:
  2.0/5
  Star Cast: కార్తీ, సాయేషా సైగల్, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ
  Director: పాండిరాజ్

  'ఖాకీ' లాంటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మూవీ తర్వాత కార్తి హీరోగా తెరకెక్కిన 'కడైకుట్టి సింగం' అనే తమిళ సినిమా తెలుగులో 'చినబాబు'గా విడుదలైంది. చాలా కాలం తర్వాత కార్తి విలేజ్ డ్రామాతో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్టెనర్ మూవీలో నటించారు. దేశానికి అన్నం పెట్టే రైతు పాత్రలో తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రయోగాలకు పోకుండా అందరికీ తెలిసిన విలేజ్, ఫ్యామిలీ డ్రామాతో దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్వయంగా కార్తి సోదరుడు సూర్య నిర్మించడం మరో విశేషం. సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరించే అవకాశం ఉంది అనేది రివ్యూలో చూద్దాం...


  కథ విషయానికొస్తే....

  కృష్ణం రాజు (కార్తి) వ్యవసాయాన్ని ప్రేమించే ఒక రైతు. డాక్టర్, లాయర్, కలెక్టర్, ఇంజనీర్ అని అంతా ఎలా గొప్పగా చెప్పుకుంటారో.... తాను రైతును అని గర్వంగా చెప్పుకునే వ్యక్తి. చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారికి తానేమీ తక్కువ కాదు అని నిరూపించుకుంటాడు. అదే ఊర్లో రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న సురేంద్ర రాజును హత్యకేసులో కృష్ణం రాజు జైలుకు పంపిస్తాడు. అదే సమయంలో తన మరదలుతో కృష్ణం రాజు ప్రేమలో పడటాన్ని సహించలేక అతడిని అంతం చేయాలని ప్లాన్ చేస్తాడు... అందులో ఫెయిల్ అవ్వడంతో కుటుంబంలో చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తాడు.

  ఇదీ అసలు స్టోరీ

  కృష్ణం రాజు ఫ్యామిలీ విషయానికొస్తే.... తండ్రి రుద్రరాజు (సత్యరాజ్). ఆయనకు ఇద్దరు భార్యలు, ఐదుగురు కూతుళ్లు. అందరికంటే చిన్నవాడు కృష్ణం రాజు. తమ కూతురును తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఇద్దరు అక్కలు ఆశపడతారు. అయితే కృష్ణం రాజు మరొక అమ్మాయి(సాయేషా సైగల్)ని ప్రేమించడంతో ఫ్యామిలీలో గొడవలు మొదలవుతాయి. చివరకు కుటంబం చీలి పోయే పరిస్థితి వస్తుంది. ఈ పరిణామాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.


  కార్తి పెర్ఫార్మెన్స్

  రైతు పాత్రల్లో కార్తి పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లలో తనదైన శైలితో సూపర్ అనిపించాడు. ఇక ఫ్యామిలీలో గొడవలు వచ్చినపుడు అనుబంధాలు విడిపోకుండా, వారిని కలిపేందుకు కార్తి చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి.


  సాయేషా సైగల్

  సాయేషా సైల్ పరిమితమైన పాత్రలో నటించింది. సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఫర్వాలేదిపించిది. విలేజ్ డ్రామా కాబట్టి ఆమెపై గ్లామరస్ సీన్లు కూడా ఏమీ లేవు.


  సత్యరాజ్, ఇతర నటీనటులు

  తండ్రి పాత్రలో సత్యరాజ్ తనదైన నటనటో ఆకట్టుకున్నారు. ప్రియభవాని, భానుప్రియ, విజి చంద్రశేఖర్, ఆర్తన బిను, సూరి తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.


  టెక్నికల్ అంశాలు

  వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ బావుంది. విలేజ్ అందాలను తన కెమెరాలో చాలా బాగా చూపించాడు. డి ఇమ్మాన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. రుబన్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బావుండేది.


  ప్లస్ పాయింట్స్

  కార్తి, సత్యరాజ్ పెర్ఫార్మెన్స్
  రైతు గొప్పదనం గురించి చెప్పే ఎపిసోడ్
  ఫస్టాఫ్‌లో వచ్చే సన్నివేశాలు


  మైనస్ పాయింట్స్

  సెకండాఫ్‌లో హెవీ డోస్ సెంటిమెంట్
  ఫ్యామిలీ డ్రామాను మరీ సాగదీయడం
  కథలో కొత్తదనం లేక పోవడం


  దర్శకుడు సినిమా నడిపించిన విధానం

  దర్శకుడు పాండిరాజ్ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో అందరికీ కనెక్ట్ అయ్యే కథను ఎంచుకున్నాడు. ఫస్టాఫ్ రైతులు గురించి గొప్పగా చెబుతూ డీసెంట్‌గా నడిపించినప్పటికీ... సెకండాఫ్‌లో ఫ్యామిలీ డ్రామాకు వచ్చేసరికి సెటిమెంట్ డోస్ మరీ ఎక్కువైంది. ఆ సీన్లు వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పటికీ టీవీ సీరియళ్లలో మాదిరిగా అతిగా చూపించారనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. క్లైమాక్స్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా సాదాసీదాగా సాగుతుంది.
  పూర్తిగా తమిళ ప్లేవర్

  సినిమా తెలుగు నేటివిటీకి దగ్గరగా అనిపించదు. తమిళ విలేజ్ ప్లేవర్ ఎక్కువగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది కూడా తెలుగు వారిని కాస్త అసంతృప్తికి గురి చేసే అవకాశం ఉంది.
  ఫైనల్ గా

  చిన్నబాబు సాధారణ మాస్ మసాలా ఫ్యామిలీ ఎంటర్టెనర్. ఫస్టాఫ్ డీసెంటుగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో నడుస్తున్న ట్రెండ్ పరిశీలిస్తే సెకండాఫ్‌లో వచ్చే హెవీ సెంటిమెంటుకు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడం కష్టమే. ఒక వేళ కనెక్ట్ అయితే బి,సి సెంటర్లలో మంచి ఫలితాలు రావొచ్చు.
  నటీనటులు, టెక్నీషియ్స్

  కార్తీ, సయేష, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను.


  సాంకేతిక నిపుణులు:
  కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : పాండిరాజ్
  నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి
  బ్యానర్స్: 2డి ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్
  సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్.
  సంగీతం: డి.ఇమాన్
  కెమెరామెన్: వేల్ రాజ్
  ఎడిటింగ్: రుబన్
  విడుదల తేదీ: జులై 13, 2018


  English summary
  After the stupendous success of Khaki, Karthi is back with Chinna Babu. The much-awaited village drama has been steered by Pasanga and Marina fame, Pandiraj. With much expectations being pinned on the movie, one needs to see if Chinna Babu would provide the desired and deserved success to the associated folks. Chinnababu is a story based on a big joint family of Satyaraj and their extended relatives. While first half is decent , second half is stuffed with heavy dose of sentiment scenes.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more