twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిత్రలహరి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Chitralahari Movie Review And Rating | Sai Dharam Tej | Kalyani Priyadarshan | Sunil | Filmibeat

    Rating:
    3.0/5
    Star Cast: సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్, సునీల్, పోసాని కృష్ణమురళీ
    Director: కిశోర్ తిరుమల

    ఆరు అపజయాల తర్వాత ఎలాగైనా సక్సెస్ కొట్టడానికి చిత్రలహరితో మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నవీన్ ఎర్నేని, వై రవికిశోర్, సీవీఎం (మోహన్) నిర్మాతలుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌తో కలిసి నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయిధరమ్ తేజ్‌కు, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌, మైత్రీ మూవీస్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     చిత్రలహరి స్టోరీ

    చిత్రలహరి స్టోరీ

    నలుదిక్కుల సూర్యుడు ఉదయించినా జీవితంలో వెలుతురు కానరని యువకుడు విజయ్ కృష్ణ (సాయిధరమ్ తేజ్). టాలెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన సక్సెస్ కోసం వెంపార్లాడే విజయ్ కృష్ణ తొలిచూపులోనే లహరి (కల్యాణి ప్రియదర్శన్)తో ప్రేమలో పడుతాడు. తన జీవితంలో సక్సెస్ కోసం ఓ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో స్వేచ్ఛ (నివేతా) పరిచయం అవుతుంది. అయితే నివేతా కారణంగాను, స్వయంగా కొన్ని చిన్న తప్పులు చేయడం విజయ్ కృష్ణ ప్రేమ బ్రేకప్ అవుతుంది. తన జీవిత స్వప్నమైన ప్రాజెక్ట్‌కు అనేక అవరోధాలు ఎదురవుతాయి.

    చిత్రలహరిలో మలుపులు

    చిత్రలహరిలో మలుపులు

    లహరితో లవ్ ఎందుకు బ్రేకప్ అయింది? వారి ప్రేమకు నివేథా ఎలాంటి కారణమైంది? డ్రీమ్ ప్రాజెక్ట్‌ను సక్సెస్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరకు తన సక్సెస్ కోసం ఎలాంటి సాహాసానికి సిద్ధపడ్డాడు. తాను చేసిన ఓ ప్రయత్నం ఎందుకు కోర్టు మెట్లేక్కేలా చేసింది. కోర్టు శిక్ష నుంచి బయటపడ్డారా? లహరి, విజయకృష్ణ లవ్ మళ్లీ చిగురించిందా? తన జీవితాశయమైన ప్రాజెక్ట్‌కు నివేథా ఎలా కారణమైందనే ప్రశ్నలకు సమాధానమే చిత్రలహరి సినిమా కథ

     ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    కోర్టులో ముద్దాయిగా సాయిధరమ్ తేజ్ (విజయ్ కృష్ణ) బోనులో నిలబడటం అనే సీన్‌తో సినిమా కథలోకి వెళ్తుంది. జీవితంలో ఫెయిల్యూర్ తప్ప మరొకటి ఎరుగని యువకుడు ప్రేమలో పడటం లాంటి అంశాలతో కథ సాగిపోతుంది. తన కెరీర్‌ను చక్క బరుచుకొనేందుకు చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదురయ్యే వైఫల్యాలు సినిమాను భావోద్వేగంగా మలుస్తాయి. నివేథా పేతురాజ్ (స్వేఛ్ఛ) క్యారెక్టర్ పాత్ర ప్రాక్టికల్‌గా ఉండటం సినిమాకు పాజిటివ్‌గా అనిపిస్తుంది. విజయ్ కృష్ణ, లహరి బ్రేకప్‌తో తొలిభాగం ముగుస్తుంది. తొలిభాగంలో సాయిధరమ్ తేజ్, పోసాని (తండ్రి) పాత్రల మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకొనేలా సాగుతాయి.

     సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక రెండో భాగంలో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా సాగుతాయి. నివేథా పేతురాజ్ ఫ్లాష్ బ్యాక్ మరికొంత ఎమోషనల్‌గా సాగుతుంది. మళ్లీ లహరి పాత్రను ముంబైకి తీసుకురావడం కొంత ఆర్టిషియల్‌గా అనిపించినప్పటికీ.. కథకు బలంగా మారిందనే చెప్పవచ్చు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్ బాగా పండాయనే చెప్పవచ్చు. తనకు తాను ప్రూవ్ చేసుకోవడానికి విజయ్ కృష్ణ చేసిన సాహసం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. ఎమోషన్స్ ఈ సినిమాకు బలంగా మారాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

    దర్శకుడు కిషోర్ తిరుమల గురించి

    దర్శకుడు కిషోర్ తిరుమల గురించి

    దర్శకుడు కిషోర్ తిరుమల మధ్య తరగతి జీవితాన్ని, ఆ లైఫ్‌లో ఉండే ఎమోషన్స్ తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు అనేది ఆయన గత సినిమాలు నిరూపించాయి. సక్సెస్, ఫెయిల్యూర్, లవ్, ఫ్యామిలీ రిలేషన్స్, కామెడీ అంశాలను కలిపి చిత్రలహరి అనే భావోద్వేగమైన కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బలమైన సన్నివేశాలు, వాటికి తోడు ఆలోచింపజేసే డైలాగ్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా మారాయి. పోసాని, సునీల్, బ్రహ్మాజీ, జయప్రకాశ్ పాత్రలను మలుచుకొన్న విధానం మరింత ప్లస్ అయింది. అలాగే హీరోయిన్ల పాత్రలు కేవలం పాటలకే పరిమితం అవుతున్న రోజుల్లో వారికి బలమైన అంశాలను జోడించి కథలో ప్రాధాన్యతను కల్పించడం మరో హైలెట్ అని చెప్పవచ్చు. ఎమోషనల్ స్టోరిని ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో సఫలయమయ్యాడు కానీ.. కథలో అక్కడక్కడ వేగం మందగించడం కొంత ప్రతికూలంగా మారిందనిపిస్తుంది.

    సాయిధరమ్ తేజ్ ఫెర్ఫార్మెన్స్

    సాయిధరమ్ తేజ్ ఫెర్ఫార్మెన్స్

    సాయిధరమ్ తేజ్ పోషించిన విజయ్ కృష్ణ పాత్ర తన జీవితానికే కాకుండా.. సమాజంలో ప్రతీ యువకుడిని టచ్ చేసే విధంగా, అందరి జీవితాలకు దగ్గరగా ఉంటుంది. కెరీర్ పరంగా వరుస వైఫల్యాలు, ప్రేమలో వైఫల్యం, తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగం లాంటి అంశాలు కలిసి ఉన్న పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. తన కెరీర్‌లో మంచి పాత్రలో నటించాడని చెప్పవచ్చు. ప్రతీ కీలక సన్నివేశంలో సాయి తేజ్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఆరు ఫాప్‌ల తర్వాత మంచి కథతో సక్సెస్ బాట పట్టాడని చెప్పవచ్చు.

    హీరోయిన్ల ఫెర్ఫార్మెన్స్

    హీరోయిన్ల ఫెర్ఫార్మెన్స్

    కల్యాణి ప్రియదర్శన్ ఎమోషనల్ పాత్రలో ఆకట్టుకొన్నది. భావోద్వేగాల మధ్య కొట్టుమిట్టాడే ప్రేమికురాలి పాత్రను మెప్పించేలా చేసింది. భారమైన సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. ఇక నివేథా పేతురాజ్ తన పాత్రలో చాలా మెచ్యురిటీతో ఒదిగిపోయింది. తల్లిదండ్రులకు ప్రేమకు దూరమైన యువతి పాత్రలో ఆమె చేత చెప్పించిన డైలాగ్స్ మనసుకు హత్తుకొంటాయి. ఈ చిత్రంలో కల్యాణి, నివేథా పోటీ పడినటించారు.

    సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ

    సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ

    సునీల్ కొత్త రకమైన కామెడీ పాత్రలో అలరించాడు. క్రీస్తు మత ప్రభోధకుడిగా ఎంట్రీలోనే అదరగొట్టేస్తాడు. ఇక సాయిధరమ్ తేజ్‌తో కలిసి చేసిన సీన్లు మంచి హ్యూమర్‌తో సాగుతాయి. సెకండాఫ్‌లో ముంబై ఎపిసోడ్‌లో ఎంట్రీలోనే రౌడీ బేబీ పాటకు మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేశాడని చెప్పవచ్చు. కథలో ఇతర అంశాలు పెద్ద పీట వేయడంతో ఈ రెండు పాత్రలకు మరింత స్కోప్ లేకపోయింది.

    పోసాని, బ్రహ్మాజీ పాత్రలు

    పోసాని, బ్రహ్మాజీ పాత్రలు

    పోసాని కృష్ణమురళీ మరోసారి తండ్రి పాత్రలో అద్బుతంగా నటించాడు. డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకోవడమే కాదు.. ఇలాంటి తండ్రి ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ కలుగజేసేలా నటించాడు. బ్రహ్మాజీ సాఫ్ట్ విలన్‌గా మెప్పించాడు. ఒకట్రెండు సీన్లలో జయప్రకాశ్, ప్రదీప్ తన మార్కును ప్రదర్శించారు. పవిత్ర లోకేష్‌కు పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రే దక్కింది.

    మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం

    మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం

    చిత్రలహరి సినిమాను దేవీ శ్రీ ప్రసాద్ తన సంగీతంతో మరో మెట్టిక్కించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఎమోషనల్ సీన్లకు మరింత బలాన్ని ఇచ్చింది. గ్లాస్ మేట్ పాట, కొంచె ఎమోషనల్ టచ్ ఉన్న రెండు పాటలు సినిమాను భావోద్వేగంగా మలిచింది. ఎడిటింగ్ చాలా క్రీస్పీగా ఉంది. కథను ఎక్కడా డీవియేట్ కాకుండా సన్నివేశాల కూర్పు బాగుంది. అప్పుడే వెళ్లిపోయావు, నాలుగు దిక్కులు సూర్యుడు ఉదయించిన నా జీవితంలో వెలుగు కనిపించదు లాంటి డైలాగ్స్ సూపర్‌గా ఉన్నాయి.

    సినిమాటోగ్రఫి గురించి

    సినిమాటోగ్రఫి గురించి

    చిత్రలహరి సినిమాకు మరో హైలెట్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి. నైట్ ఎఫెక్ట్ సీన్లుగానీ, ముంబైలోని కొన్ని సన్నివేశాలు అందంగా చిత్రీకరించారు. మెట్రో రైల్ బ్యాక్ డ్రాప్‌గా వచ్చే సీన్లుతో హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా కెమెరాలో బంధించాడు. హీరోయిన్లను గ్లామరస్ తెరపైన చూపించడంలోను, సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ సీన్లను తెరకెక్కించడంలోను తన ప్రతిభను చాటుకొన్నాడు.

     ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ఫీల్‌గుడ్ సినిమాల నిర్మాణానికి మైత్రీ మూవీ మేకర్స్ పెట్టింది పేరు. కథ, కథనాలను ప్రేక్షకుల మనుసుకు నచ్చేలా చెప్పడం వారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారనే విషయాలు శ్రీమంతుడు, రంగస్థలం చిత్రాలు రుజువు చేశాయి. చిత్రలహరి కూడా ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడలో ఎలాంటి రాజీ పడలేదని స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

    తుదితీర్పు ఫైనల్‌గా

    తుదితీర్పు ఫైనల్‌గా

    పుష్కలంగా ప్రతిభ ఉండి దురదృష్టం వెంటాడిన ఓ యువకుడు సక్సెస్‌ చేజిక్కించుకొనేందుకు ఎలాంటి సాహాసానికి ఒడిగట్టాడు అనే పాయింట్‌తో తెరకెక్కిన సినిమా చిత్రలహరి. ఇప్పటి వరకు మాస్, యాక్షన్ హీరోగా ప్రేక్షకులకు తెలిసిన సాయిధరమ్ తేజ్ భావోద్వేగపూరితమైన పాత్రలో సరికొత్త కోణంలో కనిపిస్తాడు. ఎమోషనల్‌గా సాగే సినిమాలో కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొనేలా ఉంటుంది. తిరుమల కిషోర్ భావోద్వేగాలను పండించడంలో సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్
    డైరెక్షన్
    డైలాగ్స్
    సినిమాటోగ్రఫి
    సునీల్, వెన్నెల కిషోర్ సెన్సిబుల్ కామెడీ

    మైనస్ పాయింట్స్
    స్లో అండ్ సాఫ్ట్ నేరేషన్

     తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్, సునీల్, పోసాని కృష్ణమురళీ
    దర్శకత్వం: కిశోర్ తిరుమల
    నిర్మాతలు: నవీన్, రవిశంకర్, మోహన్ (సీవీఎం)
    సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
    ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
    సినిమాటోగ్రఫి: కార్తీక్ ఘట్టమనేని
    బ్యానర్: మైత్రీ మూవీస్ మేకర్స్
    రిలీజ్: 2019-04-12

    English summary
    After six failures, Sai Dharam Tej is coming with Chitralahari movie. This movie produced by Mythri Movie makers. Directed by Kishore Tirumalashetty. Kalyani Priyadarsh and Niveta Peturaj are lead heriones. This movie released on 12 of April. In this occassion, Telugu filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X