twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Cobra movie first review: విక్రమ్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే? క్రిటిక్ రివ్యూ ఇలా..

    |

    తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా. ఈ చిత్రం ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతున్నది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో అంచనాలు పెంచింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఓ సెన్సార్ బోర్డు సభ్యుడు వెల్లడించిన రివ్యూ వివరాల్లోకి వెళితే..

    విజువల్ ట్రీట్‌గా కోబ్రా

    విజువల్ ట్రీట్‌గా కోబ్రా


    కోబ్రా విజువల్ ట్రీట్‌గా రూపొందింది. అపరిచితుడు లాంటి సైకలాజికల్ థ్రిల్లర్‌గా కోబ్రా తెరకెక్కింది. యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ లాంటి అంశాలతో ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతాయి. రష్యాలో ప్రమాదస్థాయి ప్రతీకూల వాతావరణంలో చిత్రీకరించిన యాక్షన్ సీన్లు, ఇతర ఎపిసోడ్స్‌ ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా ఉంటాయి అని పేర్కొంటున్నారు.

    10 గెటప్స్‌తో విక్రమ్

    10 గెటప్స్‌తో విక్రమ్


    కోబ్రా చిత్రంలో విక్రమ్ గెటప్స్ అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. విక్రమ్ ఏ మాత్రం గుర్తు పట్టే విధంగా లేకపోవడం.. ఒక గెటప్‌కు ఇంకో గెటప్‌కు పొంతన లేకపోవడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో మొత్తం 9 నుంచి 10 రకాల వేషాల్లో విక్రమ్ కనిపిస్తాడు అని చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చెబుతున్నది.

    ముగ్గురు హీరోయిన్స్

    ముగ్గురు హీరోయిన్స్


    కోబ్రా చిత్రం ముగ్గురు హీరోయిన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. కేజీఎఫ్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న శ్రీనిధి శెట్టి, మీనాక్షి , మృణాళిని యువ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటించారు. శ్రీనిధి శెట్టితో రొమాన్స్, కెమిస్ట్రీ ఆకట్టుకొనేలా ఉంటుందని విక్రమ్ స్వయంగా వెల్లడించారు. కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి నటిస్తున్న తొలి తమిళ చిత్రం కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఎంట్రీ

    క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఎంట్రీ


    కోబ్రా చిత్రంలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. యాక్టింగ్ రాకపోయినా.. స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్ల ఇర్ఫాన్‌ను సినిమాలోకి తీసుకోవడమే కాకుండా యాక్టింగ్ నేర్పించి.. ఆ పాత్రను అద్భుతంగా వచ్చేలా దర్శకుడు అజయ్ చేశారనే విషయాన్ని విక్రమ్ వెల్లడించారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల మధ్య దుబాయ్‌కి చెందిన ఉమేర్ సంధూ తన రివ్యూను ఇచ్చారు.

    యూనిక్ కాన్సెప్ట్‌తో కోబ్రా

    యూనిక్ కాన్సెప్ట్‌తో కోబ్రా


    ఉమేర్ సంధూ తన ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్స్‌లో కోబ్రా రివ్యూను ఇస్తూ.. కోబ్రా చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందింది. డైరెక్షన్ టెర్రిఫిక్‌గా ఉంది. క్లైమాక్స్, ప్రొడక్షన్ డిజైన్ అద్బుతంగా ఉంది అని ఉమేర్ సంధూ తెలిపారు.

    విక్రమ్ అవార్డు విన్నింగ్


    విక్రమ్ అవార్డు విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో విక్రమ్‌ది వన్ మ్యాన్ షో. ఇర్ఫాన్ పఠాన్ పెర్ఫార్మెన్స్ చూడముచ్చటగా ఉంటుంది. ట్విస్టులు, టర్నులతో సినిమా ఆద్యంత ఎంగేజింగ్‌గా ఉంటుంది.మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు ఇక పండుగే. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5/5 అని తన రివ్యూలో పేర్కొన్నారు.

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు


    తారాగణం: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు.
    రచన, దర్శకత్వం: ఆర్ అజయ్ జ్ఞానముత్తు
    నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్
    బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
    విడుదల: ఎన్వీఆర్ సినిమా (ఎన్వీ ప్రసాద్)
    సంగీతం: ఏఆర్ రెహమాన్
    డీవోపీ: హరీష్ కన్నన్
    ఎడిటర్: భువన్ శ్రీనివాసన్
    పీఆర్వో: వంశీ-శేఖర్
    రిలీజ్ డేట్: 2022-08-31

    English summary
    Critic Umair Sandhu's Cobra movie first review: He tweeted that, A Unique Concept with Terrific Direction, Climax & Production Designing! #Vikram gave Award Worthy Performance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X