twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైలెవల్ ... ఓవర్ (రామ్ 'హైపర్‌' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    --- సూర్య ప్రకాష్ జోస్యుల

    రెగ్యులర్ తెలుగు కమర్షియల్ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ లాగ ఉంటాయి రామ్ సినిమాలు. ఆ ముద్ర నుంచి తప్పుకోవటం ఇష్టం లేనట్లు కథలను ఎంచుకుంటూ ముందుకుపోతున్న రామ్ నుంచి వచ్చిన మరో చిత్రమే హైపర్. అయితే పక్కా ఫార్మెట్ లో ఉంటూ రవితేజ సినిమాలను గుర్తు చేస్తూ హైపర్ గా సాగే ఈ సినిమా మరీ ఓవర్ డోస్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. పురాతనకాలం నాటి కథ, కథనం సినిమాని వెనక్కి లాగితే రామ్ చాలా హై ఎనర్జటిక్ గా తన క్యారక్టరైజేషన్ తో, యాంటిక్స్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నమైతే చేసాడు.

    సూర్య (రామ్) నిజాయతీ గల ఓ గవర్నమెంట్ ఉద్యోగి నారాయణమూర్తి (సత్యరాజ్‌) కుమారుడు. సూర్య హైపర్ కదా అందుకే... తండ్రి అంటే సూర్యకి విపరీతమైన ప్రేమ. ఆయన కోసం చావటానికైనా , చంపటానికైనా సిద్దం అన్నట్లు బిహేవ్ చేస్తూంటాడు. ఓ రోజు రిటైర్ మెంట్ కు దగ్గరగా ఉన్న నారాయణమూర్తి దగ్గరకు ఓ ఫైల్ వస్తుంది. ఓ బిల్డింగ్‌ నిర్మాణానికి అనుమతినిస్తూ సంతకం చేయమని మంత్రి రాజప్ప (రావు రమేష్‌) నారాయణమూర్తి దగ్గరికి ఫైల్‌ పంపుతాడు. అయితే రూల్స్ కు విరుద్ధంగా ఆ నిర్మాణాన్ని చేపడుతున్నారని.. సంతకం పెట్టనని నారాయణమూర్తి ఆ ఫైల్‌ని తిరస్కరిస్తాడు.

    మరి విలన్ లక్షణాలు ఉన్న ఆ మినిస్టర్ ఊరుకుంటాడా...బెదిరించటం మొదలెట్టి నారాయణమూర్తిని ఇబ్బందుల్లో పడేయటానికి సిద్దపడతాడు. పిచ్చి ప్రేమతో ఉండే కొడుకు సూర్య కు తన తండ్రిని ఫలానా మినిస్టర్ టార్గెట్ చేసారని తెలుస్తోంది. అంతే వెళ్లి మినిస్టర్ తో పెట్టుకుంటాడు..అతన్ని తన తండ్రి రిటైర్మెంట్ రోజే పదవీ విరమణ చేయిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. హీరో కాబట్టి ఖచ్చితంగా ఛాలెంజ్ గెలుస్తాడు. అయితే మిడిల్ క్లాస్ హీరో, మినిస్టర్ స్ధాయి వ్యక్తిని ఎలా రోడ్డుమీద పడేసాడన్నదే మిగతా కథ. ఈ మధ్యలో సూర్యతో ప్రేమలో పడ్డ భానుమతి (రాశిఖన్నా) కథేమిటి అన్నది కూడా పారలల్ గా నడుస్తూంటుంది.

    రామ్ కే కొత్త, కథ పాతదే

    రామ్ కే కొత్త, కథ పాతదే

    స్ట్రైయిట్ నేరేషన్ లో చెప్పిన ఇలాంటి కథలను మనం గతంలో చాలా చూసాం. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విలన్ ని ఛాలెంజ్ చేసి ఆ విలన్ ని రోడ్డు మీదకు లాక్కొచ్చే కార్యక్రమాలు కూడా ఇంతకు ముందు చూసినవే. అయితే ఈ సారి కొత్తదనం ఏమిటీ అంటే రామ్ చేసాడు అంతే. కాబట్టి ఇది రామ్ రివేంజ్ స్టోరీ అనాలి.

    ఏం చెప్తాం..ఇలా ఉంటే

    ఏం చెప్తాం..ఇలా ఉంటే

    ఈ సినిమాలో కథ, కథనం బాగా రొటీన్ గా ప్రెడిక్టబుల్ గానే ఉన్నాయి. కమర్షియల్ సినిమాల్లో కథ ఏముంటుంది అంటే చెప్పలేం కానీ, పోనీ ఉన్న ఆ చిన్న స్టోరీ లైన్ కు అయినా సరైన స్క్రీన్ ప్లే రాసారా అంటే అదీ లేదు. ఇంట్రవెల్ దాగా కథలోకే రారు..అప్పటిదాకా కథలేకుండా కదలని సీన్స్ తో కాలక్షేపం చేస్తూ సినిమాపై ఉన్న ఇంప్రెషన్ పోగెట్టాసారు.

    అదే ఇబ్బంది

    అదే ఇబ్బంది

    ఈ సినిమా ఏ రేంజి హిట్టవుతుంది.ఎక్కడ ఆడుతుంది అనే విషయం ప్రక్కన పెడితే ఈ సినిమా కు పెద్ద మైనస్ ఏమిటీ అంటే అసలు ఫ్రెష్ నెస్ అనేది కొంచెం కూడా లేకపోవటం. దాదాపు అన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్లే ఉంటాయి. ఇలాంటి విలన్-హీరో సినిమాలు పది కలిపి అల్లేసిన కథ, కథనంలా అనిపిస్తూంటుంది.

    వస్తూంటాయి ..పోతూంటాయి

    వస్తూంటాయి ..పోతూంటాయి

    సినిమా అలా ...అలా నడిచిపోతూంటుంది..సీన్స్ వస్తూంటాయి..పోతూంటాయి కానీ ఫలానా సీన్ అని ధియోటర్ నుంచి బయిటకు వచ్చాక గుర్తు చేసుకునేందుకు ఒక్కటీ లేదు. సినిమా టాక్ పై దాని ప్రభావం పడుతుంది.

    లవ్వా...లస్టా..క్లారిటీ ప్లీజ్

    లవ్వా...లస్టా..క్లారిటీ ప్లీజ్

    తండ్రికి, కొడుకుకి మధ్య నడిచే కథ కదా లవ్ ట్రాక్ కు ప్రయారిటీ ఎందుకు అనుకున్నారో ఏమో దాన్ని నిర్లక్ష్యం చేసారు. రాశి ఖన్నా కేవలం గ్లామర్ డాల్ గానే కనిపించింది. ఎక్సప్రెషన్స్ లేకుండా సీన్స్ పండించటంలో ఆమెకు ఆమే సాటి. కొన్ని డైలాగులు చూస్తూంటే అది లవ్ ట్రాక్ కాదు లస్ట్ ట్రాక్ అనిపిస్తుంది.

    ఫస్టాఫ్ కదలదే...

    ఫస్టాఫ్ కదలదే...

    సినిమా ఫస్టాఫ్ అసలు కదలు మదలు లేకుండా అక్కడే గుడి గుడి గుంచంలా సాగుతూంటుంది. కథలో ప్రధాన మలుపుని ఇంట్రవెల్ దగ్గర పెట్టుకోవటంతో ఫస్టాఫ్ మొత్తం కథకు కొంచెం కూడా సంభందం లేని సీన్స్ తో నింపేసారు. ఫస్టాప్ లోనే విలన్ తో హీరోకు ధ్రెడ్ మొదలైతే బాగుండేది.

    మాస్ అంటే ఇంతేనా

    మాస్ అంటే ఇంతేనా

    మాస్ హీరో అంటే అరవాలా..రామ్ అలాగే ఫిక్సైనట్లున్నాడు..ఈ సినిమాలో విలన్ తో మాట్లాడేటప్పుడు మాట మాటికీ అరుస్తూంటాడు. ఎదురుగా మినిస్టర్ స్దాయి వ్యక్తి ఉన్నా ఆ అరుపులు కంట్రోలుగా ఉండవు. రావు రమేష్ కాస్త పాత కాలం మినిస్టర్ లా గెటప్ ఉంది. ఈ కాలం మినిస్టర్ లాగ అనిపించలేదు.

    ఓవర్ కే ఓవర్

    ఓవర్ కే ఓవర్

    సినిమాలో రావు రమేష్, రామ్ పాత్రలు రెండూ సెకండాఫ్ లో బాగా ఓవర్ గా ఉంటూంటారు. మినిస్టర్ లాగ రావు రమేష్ ఎక్కడా బిహేవ్ చేయడు. అలాగే రామ్ కూడా బిటెక్ చదువుకున్న కుర్రాడిలా ఎక్కడా ఉండడు. దర్శకుడు వీళ్ల ఓవర్ ని కంట్రోలు చేయలేకపోయారేమో అని డౌట్ వస్తూంటుంది.

    టైటిల్ జస్టిఫికేషన్ చేద్దాం అనేమో

    టైటిల్ జస్టిఫికేషన్ చేద్దాం అనేమో

    సినిమాలో రామ్ యాక్షన్ చూస్తూంటే టైటిల్ హైపర్ అని పెట్టారు కదా..మనం దానికి న్యాయం చేయకపోతే బాగుండదు అన్నట్లు అని నటిస్తున్నట్లు అనిపిస్తుంది. సీన్స్ లో అంత మ్యాటర్ లేకపోయినా ఎక్కవ చేస్తూ నటిస్తూంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది.

    ఆ సామాజిక సందేశం ఏది

    ఆ సామాజిక సందేశం ఏది

    గవర్నమెంట్ ఉద్యోగస్దుడు తన నిజాయితీని బ్రతికించుకోవాలంటే హైపర్ పర్శనాలిటి ఉన్న కొడుకు ఉండాలి అని సమాజానికి సందేశం ఇచ్చినట్లు ఉంది. ఎందుకంటే అంత నిజాయితీ పరుడైన సత్యరాజ్ పాత్ర ఒక టైమ్ లో తన భార్య ని బ్రతికించుకోవటం కోసం లొంగిబోతాడు. అయితే అఫ్ కోర్స్ కొడుకు సేవ్ చేస్దాడనుకోండి. అలాగని కొడుకు నిజాయితీగా బ్రతకాలి, సత్యమునే పలకాలి లాంటి నీతి వచనాలు పెట్టుకుని బ్రతుకుతున్న వాడేమీ కాదు. ఏదో తండ్రి కోసం నిజాయితీని బ్రతికించాలనుకుంటాడు. ఇందులో మనం ఏం సందేశం తీసుకోవాలి.

    ఆ విషయంలో తప్ప...

    ఆ విషయంలో తప్ప...

    దర్శకుడు గతంలో కెమెరామెన్ కావటంలో ఆ విబాగం బాగుంది. ఇక జిబ్రాన్ సంగీతం సోసో గా ఉంది. మణిశర్మ ఎందుకునో ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అంత అద్బుతంగా ఇవ్వలేకపోయారు. దర్శకుడుగా సంతోష్ శ్రీనివాస్ పనితనాన్ని ఎక్కడా వంక పెట్టలేం, కేవలం కథ విషయంలో తప్ప.

    ఈ సినిమాకు పనిచేసిన వాళ్లు వీరే

    ఈ సినిమాకు పనిచేసిన వాళ్లు వీరే

    బ్యానర్: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.
    నటీనటులు: రామ్‌,రాశిఖన్నా, సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ సాయాజీ షిండే, బ్రహ్మాజీ తదితరులు
    ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
    సంగీతం: జిబ్రాన్‌
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్: మణిశర్మ
    ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా,
    ఎడిటింగ్‌: గౌతంరాజు,
    లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా,
    సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి,
    మాటలు: అబ్బూరి రవి
    నిర్మాతలు: రామ్‌ ఆచంట.. గోపి ఆచంట.. అనిల్‌ సుంకర
    కథ, స్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీనివాస్‌
    విడుదల తేదీ: 30-09-2016

    ఫైనల్ గా మాస్ హీరో అనిపించుకోవాలనే రామ్ తాపత్రయం అడుగడుగునా కనిపించే ఈ సినిమా 'రొటీన్ గా ఉంటేనే మాకు ఏదైనా ఇష్టం' అనుకునేవాళ్లకు బెస్ట్ ఛాయిస్. అలాగే మల్టిఫ్లెక్స్, ఎ సెంటర్లలను నిరాశపరస్తుందనిపించే ఈ సినిమా కానీ బి,సి సెంటర్ల వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ దసరా హాలీడేస్ రామ్ కు ఈ టాక్ తో ఏ మేరకు కలిసివస్తాయో.

    English summary
    After a brief gap, Energetic hero Ram has now come up with a typical masala entertainer Hyper. The film which is directed by Santosh Srinivas and stars Raashi Khanna has hit the screens today. Let’s see how it is.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X