twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Commitment movie review అమిత్ తివారీ సర్‌ప్రైజింగ్ ఫెర్ఫార్మెన్స్.. మూవీ ఎలా ఉందంటే?

    |

    Rating:
    2.5/5

    సినిమా పరిశ్రమలోనే కాకుండా ఇతర రంగంలో కూడా మహిళలపై లైంగిక వేధింపులు, ఆఫర్ల కోసం కోరికలు తీర్చమనే సంఘటనలు తరచూ కనిపించడమే కాకుండా వినిపిస్తాయి. అలాంటి కథలతో ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో తేజస్వి మదివాడ, అమిత్, తనిష్క్ రాజన్, అన్వేషి జైన్, మాగంటి శ్రీనాథ్, రాజా రవీంద్ర, రమ్య పసుపులేటి నటించిన కమిట్‌మెంట్ చిత్రానికి హైదరాబాద్ నవాబ్స్ ఫేమ్, డైరెక్టర్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించారు. రిలీజ్‌కు ముందు మంచి హైప్ సాధించిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతికి గురిచేసిందనే విషయంలోకి వెళితే..

    కమిట్‌మెంట్ కథ ఏమిటంటే?

    కమిట్‌మెంట్ కథ ఏమిటంటే?


    సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా రాణించాలని కలలు కనే ఔత్సాహిక యాక్టర్ (తేజస్వి మదివాడ)కు అడుగడుగున చేదు అనుభవాలు ఎదురవుతాయి. కోరికలు తీర్చితే అవకాశం ఇస్తామని నిర్మాత, దర్శకులు వేధిస్తారు. ఇక డాక్టర్ భారతి (తనీష్ రాజన్) కూడా హాస్పిటల్‌లో లైంగిక వేధింపులు తప్పవు. అలాగే తల్లిదండ్రుల చాటున పెరిగిన పల్లవి (రమ్య పసుపులేటి) స్వేచ్చాయుత జీవితాన్ని అనుభవించాలని అభి (అభిరెడ్డి)తో డేటింగ్ చేస్తుంది. ఇక తన మరదలు జ్యోతి (సీమర్ సింగ్)ను రాజు (అమిత్ తివారీ) అమితంగా ప్రేమిస్తాడు. కానీ జ్యోతి మాత్రం నాగు (సూర్య శ్రీనివాస్)తో అక్రమ సంబంధం పెట్టుకొంటుంది.

    కమిట్‌మెంట్ సినిమాలో ట్విస్టులు

    కమిట్‌మెంట్ సినిమాలో ట్విస్టులు

    యాక్టర్‌గా రాణించడానికి తేజస్విని ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నది? తన ముందుకు వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించుకొన్నది? హాస్పిటల్‌లో తన కెరీర్ అడ్డు తగిలిన డాక్టర్ (రాజా రవీంద్ర)కు భారతీ ఎలాంటి గుణపాఠం చెప్పింది? తల్లిదండ్రులకు తెలియకుండా బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేసిన పల్లవి జీవితానికి ఎలాంటి సమస్య వచ్చి పడింది? పెళ్లికి ముందే ప్రియుడు నాగుతో జ్యోతి అక్రమం సంబంధం పెట్టుకొన్నాడని తెలిసిన రాజు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే కమిట్‌మెంట్ సినిమా కథ.

    మూవీ ఎలా ఉందంటే?

    మూవీ ఎలా ఉందంటే?


    కమిట్‌మెంట్ టైటిల్ పెట్టడం వల్ల సినిమా పరిశ్రమలోని లైంగిక వేధింపులపై మూవీ అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఈ సినిమాలో నలుగురి జీవితాలతో ముడిపడి ఉన్న ఇతర వ్యక్తులకు సంబంధించిన నాలుగు కథల సమాహారం కమిట్‌మెంట్. ఇందులో అమిత్, సీమర్ సింగ్‌కు సంబంధించిన బలమైన, భావోద్వేగమైన ఓ ప్రేమకథ ఉంది. సినిమా, వైద్య రంగంలో కొన్ని బయటకు రాని, కొన్ని బయటకు వచ్చే సంఘటనలతో తేజస్వి మదివాడ, తనీష్క్ రాజన్ ఎపిసోడ్స్ సాదాసీదాగానే జరుగుతాయి. రాంగోపాల్ వర్మను అనుకరించే సన్నివేశాలు బాగున్నాయి. ఇక సినిమా సెకండాఫ్‌లో రమ్య పసుపులేటి, అభయ్ రెడ్డి లవ్ స్టోరి కూడా రెగ్యులర్ యూత్ ఎంటర్‌టైనర్ అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో చివరి ప్రేమకథ హృదయాన్ని తట్టిలేపడమే కాకుండా భావోద్వేగానికి గురిచేస్తుంది. రస్టిక్ ట్రాయంగిల్ లవ్ స్టోరి ఆకట్టుకొనేలా ఉంటుంది.

    దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా గురించి

    దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా గురించి

    దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా రాసుకొన్న కథలు, కథకు సంబంధించిన ఐడియాలు బాగున్నాయి. కానీ వాటిని విస్తరించే క్రమంలో సరైన కసరత్తు చేయలేదేమో అనిపిస్తుంది. సినిమా, వైద్యరంగంలో మహిళలపై లైంగిక వేధింపులు మరింత ఎమోషనల్‌గా చెప్పి ఉంటే డెఫినెట్‌గా కమిట్‌మెంట్‌ జస్టిఫికేషన్ ఉండేది. అయితే అమిత్, సీమర్ సింగ్, సూర్య శ్రీనివాస్ లవ్ స్టోరి సినిమాకు అత్యంత బలంగా, ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సఫలమయ్యాడని చెప్పవచ్చు. కమిట్‌మెంట్ టైటిల్ కాకుండా అమిత్ లవ్ ఎపిసోడ్‌ను పూర్తి స్థాయి సినిమాగా చేసి ఉంటే మరింత బాగుండేదనిపిస్తుంది.

    తేజస్వి మదివాడ ఇతర నటీనటుల గురించి

    తేజస్వి మదివాడ ఇతర నటీనటుల గురించి


    ఔత్సాహిక నటిగా తేజస్వి తన పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా పూర్తి న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఇక తనీష్ రాజన్‌ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడం వల్ల పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించింది. రమ్య పసుపులేటి, అభయ్ రెడ్డి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ కావాల్సిన నట సహకారం అందించారు. ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అమిత్ తివారీ పెర్ఫార్మెన్స్. ఇప్పటి వరకు విలన్‌గా మాత్రమే చూసిన ప్రేక్షకులకు అమిత్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అందించడమే కాకుండా ఫెర్ఫార్మెన్స్‌తో సర్‌ప్రైజ్ చేస్తాడు. సిమర్ సింగ్, సూర్య శ్రీనివాస్ కూడా తమ నటనతో ఆకట్టుకొంటారు. మాగంటి శ్రీనాథ్ రొమాంటిక్ పాత్రలో ఒకే అనిపించాడు.

    సాంకేతిక నిపుణుల ప్రతిభ గురించి

    సాంకేతిక నిపుణుల ప్రతిభ గురించి


    సాంకేతిక విభాగాల అంశాలకు వస్తే...సాజీశ్ రాజేంద్రన్, నరేష్ రాణా ఈ సినిమాను అందంగా తీర్చిదిద్దారు. అవుట్ డోర్‌కు సంబంధించి గోవాకు సంబంధించిన సీన్లు, రాయలసీమ ఎపిసోడ్‌లో సన్నివేశాలను బ్యూటీఫుల్ చూపించారు. నరేష్ కుమారన్ అందించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చాలా బాగుంది. సన్నివేశాలు చకచకా పరుగులు పెట్టాయి. నీలిమా తాడూరి, బలదేవ్ సింగ్, ద్వారకేష్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. పాత్రల కోసం ఎంచుకొన్న నటులను చూస్తే సినిమాపై వారికి ఉన్న అభిరుచి తెలియజెప్పింది.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    ఫైనల్‌గా ఎలా ఉందంటే..


    వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ జీవితాల్లో ఉండే స్ట్రగుల్స్, ప్రేమ, ప్రతీకారం, ఎమోషన్స్ కలబోసిన చిత్రంగా కమిట్‌మెంట్ కనిపిస్తుంది. కమిట్‌మెంట్ సినిమా చూసిన తర్వాత టైటిల్‌ తప్పుదోవ పట్టించిందా అనే అనుమానం కలుగుతుంది. కమిట్‌మెంట్ కాన్సెప్ట్‌ను మించిన భావోద్వేగాలు దర్శకుడు రాసుకొన్న కథలలో ఉన్నాయి. బాధిత పాత్రలపై సానుభూతి కలిగించకపోవడం కొంత మైనస్ అనిపిస్తుంది. నటీనటుల ప్రతిభ సినిమాకు బలంగా ఉంటుంది. ఒకే కథ కాకుండా నాలుగు డిఫరెంట్ కథలను ఎంజాయ్ చేయాలనుకొనే వారికి ఈ సినిమా నచ్చుతుంది. రాయలసీమ ఎపిసోడ్ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ చెప్పవచ్చు. దర్శక, నిర్మాతల మంచి అటెంప్ట్. కథలను మరింత ఎమోషనల్‌గా తీర్చి దిద్ది ఉంటే.. కమర్షియల్‌గా మంచి సక్సెస్ అందుకోవడానికి అవకాశం ఉండేది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    నటీనటులు పెర్ఫార్మెన్స్
    దర్శకత్వం, స్క్రీన్ ప్లే
    సినిమాటోగ్రఫి, మ్యూజిక్
    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మైనస్ పాయింట్స్
    కొన్ని కథల్లో ఎమోషన్స్ పండకపోవడం

    న‌టీనటులు

    న‌టీనటులు


    న‌టీనటులు: తేజస్వి మదివాడ, రమ్య పసుపులేటి, సీమర్ సింగ్, అన్వేషి జైన్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్, అభయ్ రెడ్డి, తన్కిష్క్ జైన్, రాజా రవీంద్ర తదితరులు
    బ్యానర్స్: F3 ప్రొడక్షన్స్ , ఫుట్ లూస్
    నిర్మాతలు: నీలిమ తాడూరి, బల్దేవ్ సింగ్
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్న
    సంగీతం: నరేష్ కుమారన్
    సినిమాటోగ్రఫి: సాజీశ్ రాజేంద్రన్ , నరేష్ రాణా
    ఎడిటర్: ప్రవీణ్ పూడి
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ద్వారకేష్
    లైన్ ప్రొడ్యూసర్: సురేష్ పోలకి
    డైలాగ్స్: సంతోష్ హర్ష, కార్తీక్, అర్జున్, కళ్లి కళ్యాణ్
    కాన్సెప్ట్ : ఈశ్వర్ గాయం
    ఆర్ట్: సుప్రియ బత్తెపాటి
    లిరిక్స్: పూర్ణ చారి ,గాంధీ
    కొరియోగ్రఫీ: హరికిరణ్
    పీఆర్వో: శ్రీపాల్ చొల్లేటి
    రిలీజ్ డేట్: 2022-08-19

    English summary
    Bigg Boss Telugu fame and actress Tejaswi Madivada, Amit Tiwari's Commitment which is directed by Lakshmikanth Chenna, hits the screens on 19th August. Here is the exclusive review by Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X