twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యామిలీ ఎంటర్టెనరే..కానీ (దాగుడుమూత దండాకోర్ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5

    హైదరాబాద్: తమిళంలో సూపర్ హిట్టయి అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ‘శైవం' చిత్రాన్ని తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్' పేరుతో రీమేక్ చేసారు. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించగా.... బేబీ సారా సినిమాలో కీలకమైన పాత్ర పోషించింది. ఫ్యామిలీ అనుబంధాలు, పల్లెటూరి అందాల చుట్టూ తెరకెక్కిన ఈ చిత్రం ఓ పెద్దాయన, ఆయన మనవరాలు, ఆమె ఎంతో ఇష్టపడే కోడిపుంజు చుట్టూ తిరుగుతుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు సంతృప్తి పరిచిందనే విషయంపై ఓ లుక్కేద్దాం...

    కథలోకి వెళితే...
    ఊరి పెద్ద రాజు (రాజేంద్ర ప్రసాద్)గారిది ఉమ్మ‌డి కుటుంబం. కొడుకులు, కోడ‌ళ్లు, కూతుర్లు ఇలా అందరూ ఎక్క‌డెక్క‌డో సెటిలైపోయారు. మ‌న‌వ‌రాలు బంగారం(బేబీ సారా) అంటే ఆయనకు ప్రాణం. ఆమెకు నాని (కోడిపుంజు) అంటే చాలా ఇష్టం. ఆ ఊర్లో ఏటా జాత‌ర చేస్తారు. ఆ జాత‌ర‌కి కుటుంబ‌మంతా క‌దిలి వ‌స్తుంది.

    Dagudumootha Dandakor movie review

    కొన్ని అపశృతులు చోటు చేసుకోవడంతో.....పోలేరమ్మకు మొక్కు తీర్చకపోవడమే ఇందుకు కారణమని భావించిన రాజుగారు, అతని కుటుంబం కోడి పుంజు నాని బలివ్వడానికి నిర్ణయించుకుంటారు. సరిగ్గా నానికి పోలేర‌మ్మ‌కి బ‌లిచ్చే స‌మ‌యంలో ఆ కోడి క‌నిపించ‌కుండా మాయ‌మ‌వుతుంది. అప్ప‌టి నుంచీ ఆ ఇంట్లోవాళ్లంతా కోడిని వెదక‌డం మొద‌లెడ‌తారు. కోడిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అసలు కోడి ఎందుకు కనిపించకుండా పోయింది? దాని వెనక ఉన్నది ఎవరు? కోడి పుంజు మిస్సయిన తర్వాత రాజుగారి కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసకున్నాయి? అనేది తెరపై చూడాల్సిందే.

    పెర్ఫార్మెన్స్ పరంగా... చూస్తే రాజేంద్రప్రసాద్ నటనకు వంక పెట్టాల్సిన అవసరమే రాదు. మాతృక శైవంలో నటించిన బేబీ సారా, తాజాగా ఈ చిత్రంలోనూ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. సారాను చూస్తున్నంత సేపూ.. ఇలాంటి అమ్మాయి మ‌నింట్లోనూ ఉంటే బాగుండేదే అనిపిస్తుంది. ఈ ఇద్దరి సంగతి పక్కన పెడితే మిగతా నటీనటులు రవిప్రకాష్, ప్రభు, శ్రీహర్ష, సంధ్యా జనక్, బాలు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

    తమిళ వెర్షన్ ‘శైవం'తో పోలిస్తే.....తెలుగు వెర్షన్ ‘దాగుడుమూత దండాకోర్' ఆ రేంజిలో రాలేదనే చెప్పొచ్చు. ఫస్టాఫ్ వినోదాత్మకంగా సాగినా, సెకండాఫ్ మాత్రం చాలా సాగదీసారు. మాతృక శైవం చిత్రంలోని ఫీల్ ఈ చిత్రంలోనూ మెయింటెన్ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.

    Dagudumootha Dandakor movie review

    తాత పాత్రలో రాజేంద్రప్రసాద్ బాగా నటించినప్పటికీ...ఆయన మేకప్ ఆర్టిఫిషియల్‌గా ఉందనే భావన కలుగుతుంది. చాలా సన్నివేశాల్లో ఒరిజినల్ ఫీల్ మిస్సయింది. ఇది దర్శకుడి వైఫల్యమే. తాత - మ‌న‌వ‌రాళ్ల అనుబంధాన్ని, ప‌చ్చ‌టి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం, అక్క‌డున్న అనుబంధాలు చ‌క్క‌గా చూపించాడు.

    సాంకేతిక అంశాల పరంగా కెమెరా ఓకే. అయితే నైట్ షాట్స్ సరిగా రాలేదు. పాటలు ఫర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బావుండేది. సెకండాఫ్ లో కొన్ని అనవసర సన్నివేశాలు ఉన్నాయనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా ఫర్వాలేదు. అయితే ఒరిజినల్ వెర్షన్ శైవంతో పోల్చలేం.

    పల్లెటూరి వాతావరణం, అనుబంధాలు, ఆప్యాయతలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కమర్షియల్ అంశాలు కోరుకునే వారికి నిరాశ తప్పదు.

    దర్శకత్వం : ఆర్.కె మలినేని
    నిర్మాత: రామోజీరావు
    సమర్పణ: క్రిష్
    సంగీతం : ఇ.ఎస్ మూర్తి

    English summary
    Dagudumootha Dandakor is a 2015 Telugu film directed by debutant RK Malineni and produced by Ramoji Rao and Ushakiran Movies and First Frame Entertainments jointly produced this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X