twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దశా దిశా లేని 'దశావతారం'...(రివ్యూ)

    By Staff
    |

    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్ : ఆస్కార్ ఫిలిమ్స్ లిమెటెడ్
    నటీనటులు:కమల్ హాసన్,నెపోలియన్,యమ్.ఎస్.భాస్కర్,అసిన్,
    మల్లికా షెరావత్ ,జయప్రద,పి.వాసు,నగేష్,సంతాన భారతి,
    రేఖ,రఘురాం,కె.ఆర్.విజయ తదితరులు
    సంగీతం: హిమ్మెష్ రేష్మియా
    మాటలు: వెన్నెలకంటి
    ఎడిటింగ్: కె.తనికా చలం,ఆస్మిత్ కుందర్
    యాక్షన్: త్యాగరాజన్,కనళ్ కన్నన్
    ఆర్ట్ : ప్రభాకర్, సమీర్ చంద్ర
    మేకప్ : మైఖల్ వెస్ట్ మోర్ మరియు మెషర్
    సినిమాటోగ్రఫి: రవి వర్మన్
    కథ: సుజాత మరియు క్రేజీ మోహన్
    స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: కె.ఎస్.రవి కుమార్
    నిర్మాత :ఆస్కార్ రవి చంద్రన్
    రిలీజ్ డేట్: 13 జూన్ 2008

    ఎప్పుడెప్పుడా అని సినీ ప్రియులు ఎదురు చూస్తున్న దశావతారం మంచి ఓపినింగ్స్ తో,విపరీతమైన అంచనాలతో రిలీజైంది. కానీ కమల్ హాసన్ తన పది గెటప్స్ పై పెట్టిన శ్రధ్ధ కథ ,కథనాలపై పెట్టకపోవటంతో భారీగా మొదలైన సినిమా భారంగా ముగిసింది. దాంతో గ్రాఫిక్స్,గెపెట్స్ సినిమాను కొంత వరకే కాపు కాస్తాయని మరో సారి ఋజువుచేసినట్లయింది. అయినా అసభ్యత లేకపోవటం,ఆకట్టుకునే విజువల్స్,కమల్ హాసన్ అధ్భుత నటన, మంచి పాటలు సినిమాను ఫ్యామిలీలకు దగ్గరచేస్తాయి.

    12వ శతాబ్దంలో మొదలైన 'దశావతారం' చిత్ర కథ నేటి కాలంలో ముగుస్తుంది. 12వ శతాబ్దంలో శైవులకు, వైష్ణువులకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంటుంది. అప్పటి శైవ రాజు రెండవ కుళోత్తుంగ చోళుని(నెపోలియన్) అరాచకాలతో పేట్రేగి పోతూంటాడు. విష్ణు భక్తుడైన రంగరాజ నంబి(కమల్ హాసన్) ఆ రాజుకు ఎదురు తిరుగుతాడు. దాంతో శివ నామస్మరణ చేయమని అతనిపై రాజు ఒత్తిడి తెస్తాడు. ఒప్పుకోని నంబికి మరణ దండన విధిస్తాడు చోళుడు. తనను ఉరి తీసే సమయంలోనూ నంబి విష్ణు విగ్రహాన్ని వదలడు. ఆ విగ్రహంతో పాటు నంబి మృతదేహాన్ని సముద్రంలో పారేయిస్తాడు చోళుడు. ఆ తర్వాత కథ నేటి కాలంలోకి మారుతుంది. ఈ ఆధునిక కాలంలో కమలహాసన్ అమెరికాలో సైంటిస్టుగా కనపడతాడు.అతను బయోవార్ కి సంభందించిన వైరస్ తయారుచేస్తాడు.కానీ రియలైజ్ అయ్యి దాన్ని అంతం చెయ్యాలనుకుంటాడు. ఒప్పుకోని అక్కడి వారు మరో తెల్లవాడ్ని (మళ్ళీ కమలే) అతన్ని లేపేయమని పురమాయిస్తారు.అక్కడ నుండి వాళ్ళిద్దరూ వాళ్ళద్దరి మధ్యా పిల్లీ ,ఎలుకా గేమ్ స్టార్ట్ అవుతుంది.అందులో ఎవరు విజయం సాధిస్తారు.మిగతా కమల్ పాత్రలూ ఎలా కథలో పాలు పంచుకుంటాయనేది తెరపై చూడాల్సిందే.

    ప్రపంచ ప్రసిద్ది చెందిన ఛావోస్ ధీరీ ఆధారంగా తయారైన దశావతారం కథ సామాన్యులకు కొరుకుడు పడటం కష్టమే. ఇక కమల్ హాసన్ పది పాత్రలూ ఒకదానికొకటి తారసపడేలా,వాటి మధ్య డ్రామా పుట్టేలా కథని అల్లే క్రమంలో కథనాన్ని మరిచారు. దాంతో ప్రేక్షకుడు ఫాలో అయ్యే సైంటిస్టు పాత్ర ప్యాసివ్ గా మారి బోరుకు కారణమైంది. ఆ పాత్ర తానకు వచ్చిన సమస్యనుండి ఎంతసేపూ తప్పించుకోవాలని చూస్తూందే కానీ తిరిగి విలన్ పాత్రలకు ఎదురు తిరగదు. సమస్య విసరదు. అలాగే ఆ పాత్రకు సమస్య వచ్చినప్పుడల్లా మిగతా కమల్ పాత్రలు అప్పటికప్పుడు ప్రత్యక్షమయ్యి రక్షిస్తూ అతన్ని ఒడ్డున పడేస్తాయి. ఇక కథకు కీలకమైన కవరు ఇండియా చేరే సన్నివేశం చాలా గందరగోళంగా ఉంటుంది. వాల్ పోస్టర్స్ వేసిన అవతార్ సింగ్ పాత్ర ఉత్సాహంగా ఉంటుందేమో అనుకుంటే జబ్బు పెట్టి రక్తం కక్కించటం విసుగు తెప్పిస్తుంది. సునామీ సన్నివేశాలు చాలా బాగా ఉన్నా కథకు పెద్దగా ఉపయోగపడక పోవటం మరో మైనస్ .

    ఇక ఫ్లస్సుల్లో హైలెట్ గా నిలిచేది ఒకదానికొకటి సంభంధం లేని కమల్ హాసన్ పది పాత్రలూ(రంగరాజ నంబి ,గోవింద రామస్వామి, జార్జి బుష్, అవతార్ సింగ్, క్రిస్టియన్ ఫ్లెచర్, షింఘేన్ నరహసి, కృష్ణవేణి, విన్సెంట్ పూవరాగన్, కలీఫుల్లా ఖాన్, బలరాంనాయుడు). వాటి గెటెప్స్ కమల్ నట విశ్వరూపాన్ని చూపెడతాయి.ఇక ద్విపాత్రల్లో కనపడిన అసిన్ ముకుందా..ముకుందా పాత్రలో తోలుబొమ్మలాట ఆడిస్తూ అలరిస్తుంది. సంగీత పరంగా పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి.ప్రత్యేకంగా చెప్పాల్సింది దేవీశ్రీ ప్రసాద్ రీరికార్డింగ్. యస్.పి.బాల సుబ్రమణ్యం డబ్బింగ్ ఎప్పటిలానే కమల్ నటనకు వన్నె తెచ్చింది. కెమారా,ఎడిటింగ్ సూపర్.కె.యస్.రవికుమార్ కృషి సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దాలని తాపత్రయపడటం స్పష్టంగా కనిపిస్తుంది.

    యేదైమైనా కమల్ హాసన్ విలక్షనంగా నటించిన మరో సినిమాగా దశావతారం చూస్తే నచ్చుతుంది. అలాగే నిర్మాత సినిమానుట్రిమ్ చేసి లాగ్ లు తగ్గి సామాన్యులకూ నచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రారంభ సన్నివేశాలు అయితే వాటి కోసమైనా మరో సారి సినిమాకి వెళ్ళేలా ఉన్నాయి.అయినా చేసే భారీ పబ్లిసిటీకి,వచ్చిన హైప్ కి కొంత కాలం పాటు ధియోటర్లు ఖాళీ ఉండవు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X