twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దే దే ప్యార్ దే మూవీ రివ్యూ: హాట్ హాట్‌గా పిచ్చెక్కించిన రకుల్ ప్రీత్

    |

    Rating:
    2.5/5
    Star Cast: అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీత్ సింగ్
    Director: అకివ్ అలీ

    ఇటీవల కాలంలో రిలీజ్‌కు ముందు విపరీతమైన క్రేజ్ లభించిన బాలీవుడ్ చిత్రం దే దే ప్యార్ దే. అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. రకుల్ గ్లామర్, హాట్ హాట్ డైలాగ్స్ క్రేజ్ నింపాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మే 17న దే దే ప్యార్ దే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రకుల్‌కు సక్సెస్ అందించిందా? విడుదల ముందు నెలకొన్న అంచనాలను అధిగమించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే దే దే ప్యార్ దే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

    దే దే ప్యార్ దే సినిమా స్టోరీ

    దే దే ప్యార్ దే సినిమా స్టోరీ

    50 సంవత్సరాల ఆశీష్ మెహ్రా (అజయ్ దేవగన్) లండన్‌లో ఓ వ్యాపారవేత్త. వైవాహిక జీవితంలో విభేదాల కారణంగా భార్య మంజు (టుబు) నుంచి విడాకులు తీసుకోకుండా దూరమవుతాడు. ఆ తర్వాత ఓ పెళ్లిలో పరిచయమైన 25 ఏళ్ల ఆయేషా (రకుల్ ప్రీత్ సింగ్)తో ప్రేమలో పడుతాడు. ఆశీష్, ఆయేషా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఈ క్రమంలో ఆయేషాను తన భార్య మంజుకు, కుటుంబ సభ్యులకు కలిపించేందుకు లండన్ నుంచి మనాలీకి వెళ్తారు. ఆశీష్ కూతురు పెళ్లిచూపుల కార్యక్రమంలో జరిగిన గొడవ కథను మలుపుతిప్పుతుంది? దాంతో ఆయేషా లండన్‌కు వెళ్లిపోతుంది? మనాలీలో మంజు, ఆయేషా, ఆశీష్ మధ్య చోటుచేసుకొనే విషయాలు కథను ముందుకు తీసుకెళ్తాయి.

     దే దే ప్యార్ దే‌లో ట్విస్టులు

    దే దే ప్యార్ దే‌లో ట్విస్టులు

    ఆశీష్, ఆయేషా ప్రేమను మంజు కుటుంబం అంగీకరించిందా? భర్త రెండో పెళ్లిపై మంజు రియాక్షన్ ఏమిటి? మనాలీలో ఆశీష్ కొడుకు, కూతురు నుంచి ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నది? మనాలి నుంచి లండన్‌కు వెళ్లిపోయిన ఆయేషా ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? చివరకు ఆశీష్, ఆయేషాల పెళ్లికి మంజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అనే ప్రశ్నలకు సమాధానమే దే దే ప్యార్ దే సినిమా కథ.

     ఫస్టాఫ్‌లో

    ఫస్టాఫ్‌లో

    దే దే ప్యార్ దే సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే వినోదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ మధ్య శృంగార భరిత సన్నివేశాలు గిలిగింతలు పెట్టేలా ఉంటాయి. అయితే కథలో కొత్తదనం ఏమీ లేకపోవడం, పేలవంగా సన్నివేశాలు సాగడంతో సాదాసీదా సినిమా అని తేలిపోతుంది. లండన్ నుంచి మనాలికి స్టోరి షిఫ్ట్ కావడంతో కొన్ని ట్విస్టులు సినిమాపై ఆసక్తిని రేపుతాయి. కథలో సమస్య అనేది బలంగా లేకపోవడం వల్ల ఓ మంచి సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగదు.

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    దే దే ప్యార్ దే సినిమా రెండో భాగం భావోద్వేగాలతో సాగుతుంది. కూతురు ప్రేమ, పెళ్లి విఫలం కావడానికి కారణం తండ్రి కారణం కావడం ఎమోషనల్‌గా ఉంటుంది. అలాగే తన కూతురు వయసున్న ఆయేషాను సెక్రెటరీగా పరిచయం చేయడం. ఆ తర్వాత ఆమెను తన లవర్‌గా కుటుంబానికి తెలియచెప్పడం కొంత ఆసక్తికరంగా మారుతుంది. మంజు, ఆయేషా మధ్య సన్నివేశాలు, అలాగే మంజు, ఆశీష్ మధ్య సీన్లు భావోద్వేగంగా సాగుతాయి. కాకపోతే కథ, కథనాల్లో ఆసక్తికరమై పాయింట్లు లేకపోవడం, రొటీన్ కామెడీతో సాగడం సినిమా ప్రతికూలంగా మారింది.

     దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడు అకివ్ అలీ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. దానిని వినోదాత్మక అంశాలను జోడించి ఎమోషనల్‌గా మార్చడంలో పూర్తిగా విఫలమయ్యాడని చెప్పవచ్చు. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య రొమాంటిక్ సీన్లు బాగున్నాయి. కాకపోతే నెక్ట్స్ లెవెల్ మేకింగ్ కనిపించదు. ఎప్పుడో పాత సినిమాల్లో చూసిన సన్నివేశాలనే మళ్లీ రాసుకొన్నాడనిపిస్తుంది. సన్నివేశాల్లో కొత్తదనం లేకుండా పేలవంగా సాగడం మరో మైనస్. దే దే ప్యార్ దే సినిమాను రొమాంటిక్ కామెడీగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడని చెప్పవచ్చు.

     అజయ్ దేవగన్ మరోసారి

    అజయ్ దేవగన్ మరోసారి

    అజయ్ దేవగన్ 50 ఏళ్ల వివాహితుడిగా ఆశీష్ పాత్రలో ఒదిగిపోయాడు. భార్యకు, ఇద్దరు పిల్లలకు దూరంగా జీవిస్తూ మానసిక సంఘర్షణకు గురైన వ్యాపారవేత్త పాత్రలో ఒదిగిపోయాడు. రకుల్‌తో హాట్ హాట్‌గా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాడు. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్లను బాగా పండించాడు. సినిమా ఓపెనింగ్ సీన్లలో అజయ్ యాక్టింగ్ హ్యుమరస్‌గా ఆకట్టుకొంటుంది.

     రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్

    రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్

    గత కొద్దికాలంగా బాలీవుడ్‌లో పాగా వేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్‌కు మంచి ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న రోల్ లభించింది. ఇంజనీరింగ్ పూర్తయి లండన్‌లో బార్ టెండర్‌గా పనిచేసే ఆధునిక యువతిగా కనిపించింది. పాత్ర డిమాండ్ చేయడంతో అందాల ఆరబోతకు వెనుకాడలేదు. ఫస్టాఫ్‌లో ఫుల్ ఎనర్జిటిక్‌గా, జోష్‌గా కనిపించింది. సెకండాఫ్‌లో ఎమోషనల్‌ పాత్రలో ఒదిగిపోయి మెప్పించింది.

    టబు పెర్ఫార్మెన్స్

    టబు పెర్ఫార్మెన్స్

    భర్త నుంచి వేరుపడిన వివాహితగా, ఇద్దరు పిల్లల పోషణ బాధ్యతను చేపట్టిన మహిళగా టుబు నటించింది. భర్త నుంచి విడిపోయినప్పటికీ.. అతడిని గౌరవించడంతోపాటు అతడి ప్రతిష్టకు భంగం కలిగించని ఫీల్ గుడ్ పాత్రలో నటించింది. మంజుగా అనేక షేడ్స్ ఉన్న పాత్రను మెప్పించింది. రకుల్‌కు ఏ మాత్రం తగ్గకుండా గ్లామర్‌ను తెరపైన పండించింది.

    టెక్నికల్ పాయింట్స్

    టెక్నికల్ పాయింట్స్

    దే దే ప్యార్ దే సినిమాకు మ్యూజిక్ అదనపు ఆకర్షణ. వడ్డీ షరాబన్ పాట వినడానికే కాకుండా.. తెర మీద కిక్కెంచేలా సాగుతుంది. హితిక్ సోనిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మిగితా పాటలు సందర్భోచితంగా ఫీల్‌గుడ్‌గా అనిపిస్తాయి. లండన్‌, మనాలీని సన్నివేశాల చిత్రీకరణ బాగుంది. సుధీర్ కే చౌదరి సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. దర్శకుడు అకివ్ అలీ ఎడిటింగ్ బాగుంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    వివాహ బంధాలు, మధ్య వయసు, లేత వయసు వ్యక్తుల మధ్య అఫైర్ ఈ సినిమాలోని మెయిన్ పాయింట్. వివాహేతర సంబంధాలు, కాపురాల్లో కలతలు ఆధారంగా కథను రాసుకొన్నారు. ప్రస్తుత జనరేషన్‌లో నిత్య కనిపించే వివాహ వ్యవస్థలోని కొన్ని అంశాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్‌గా తీసుకొని రూపొందించిన చిత్రం దే దే ప్యార్ దే చిత్రం. అయితే కథ, కథనంలో ఆసక్తికరంగా అంశాలు లేకపోవడం వల్ల రొటీన్‌ చిత్రంగా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

     పాజిటివ్ పాయింట్స్

    పాజిటివ్ పాయింట్స్

    రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్
    టబు, అజయ్ దేవగన్ ఎమోషనల్ యాక్టింగ్
    సినిమాటోగ్రఫి, పాటలు

    మైనస్ పాయింట్స్
    కథ, కథనం
    ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం
    రొటీన్ సన్నివేశాలు

     తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీత్ సింగ్, జిమ్మి ష్రెగిల్, జావెద్ జాఫ్రీ తదితరులు
    ఎడిటింగ్, దర్శకత్వం: అకివ్ అలీ
    కథ: లవ్ రంజన్
    స్క్రీన్ ప్లే: లవ్ రంజన్, తరుణ్ జైన్
    మ్యూజిక్: హితీష్ సోనిక్
    సినిమాటోగ్రఫి: సుధీర్ కే చౌదరీ
    బ్యానర్: లవ్ ఫిల్మ్స్
    రిలీజ్ డేట్: 2019-05-17

    English summary
    Bollywood's upcoming movie "De De Pyaar De".The movie De De Pyaar De is the joyous rom-com for all ages. The film is Directed by Akiv Ali and produced by Bhushan Kumar, Krishan Kumar, Luv Ranjan and Ankur Garg. De De Pyaar De song 'Tu Mila Toh Haina' features the chemistry and romance between Ajay Devgn and Rakul Preet Singh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X