twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫార్ములా ఫన్ (దేనికైనా రెడీ రివ్యూ)

    By Srikanya
    |

    ----సూర్య ప్రకాష్ జోశ్యుల

    Rating:
    2.5/5

    బ్యానర్ : 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,
    నటీనటులు: మంచు విష్ణు, హన్సిక, కోట శ్రీనివాస రావు, సీత, సుమన్, ప్రభు, ఎమ్ ఎస్ నారాయణ, బ్రహ్మానందం తదితరులు.
    కథ: బి.వి.ఎస్.రవి,
    స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్,
    మాటలు: మరుధూరి రాజా,
    సంగీతం: చక్రి,
    ఎడిటింగ్ : వర్మ
    ఛాయాగ్రహణం: సిద్దార్థ్
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ,
    సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్,
    నిర్మాత: డా.ఎం.మోహన్‌బాబు.
    దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి

    పెద్ద హీరో, చిన్న హీరో అనే బేధబావం లేకుండా హిట్ ఇవ్వగల జెనర్ గా కామెడీ ...తెలుగు పరిశ్రమకు వరంగా మారింది. కథ పాత దైనా, జోకులు కొత్తవైతే చాలు అన్నట్లుగా ఈ కామెడీలు ఫ్యామీలలను అలరిస్తున్నాయి. వరస ప్లాపుల్లో ఉన్న హీరో మంచు విష్ణు ఈ ట్రెండ్ ని చూసే తనకు హిట్ కోసం కామెడీ నే ఆశ్రయించారు. సీమ శాస్త్రి, సీమ టపాకాయి వంటి కామెడీలతో నవ్వించిన జి.నాగేశ్వరరెడ్డి తో జతకట్టి 'దేనికైనా రెడీ' అన్నారు. దిలీప్, గోపిక జంటగా Udayapuram Sulthan (1999) వచ్చిన సినిమా ప్రీ మేక్ గా రూపొందిన ఈ చిత్రం ప్రెడిక్టిబుల్ సీన్స్ తో సాగినా సీజన్డ్ కమిడియన్స్ తో నవ్వించి గట్టెక్కింది.

    భాష భాయ్(సుమన్)ని తన చెల్లెలు సరస్వతి(సీత) తనకు ఇష్టం లేకుండా ప్రేమించి మతాంతర వివాహం చేసుకోవటంతో మండిపడతాడు వీర నరసింహ నాయుడు (ప్రభు). ఆ కోపంలో తన చెల్లెలు భర్తని చూడకుండా బాషా కాలు నరికేస్తాడు. దాంతో తన భార్య సరస్వతి కి పుట్టింటి తరుపునుంచి రావాల్సిన ఆస్ధికోసం భాషా కోర్టులో కేసు వేస్తాడు. ఈ సంఘటనతో ఈ రెండు కుటుంబాల మధ్య ఎడం ఇంకా పెరిగిపోతుంది. ఈ గొడవ ఇలా సాగుతూంటే సరస్వతి,భాషాకు పుట్టిన సులేమాన్ (మంచు విష్ణు) పెరిగి పెద్దవుతాడు. తన తల్లికి తన అన్నతో కలవాలనే కోరిక ఉందని తెలుసుకుని ఆ రెండు కుటుంబాలని కలపటానికి ఓ ప్లాన్ చేస్తాడు. తన మేనమామ ఇంట్లోకి కృష్ణ శాస్త్రిగా యజ్ఢం చేయటానికి ప్రవేశిస్తాడు. అక్కడ తన మేనమామ కూతురు షర్మిల(హన్సిక) తో ప్రేమలో పడతాడు. అప్పుడేం జరిగింది. తన చెల్లెలే తప్పు చేసి వేరే మతస్దుడుని పెళ్లిచేసుకుందని రగిలిపోయే వీర నరసింహ నాయుడు..ఇప్పుడు తన కూతురు ప్రేమని ఒప్పుకుంటాడా...సులేమాన్ తన తల్లి కోరిక ఎలా తీర్చాడు..తమ రెండు కుటుంబాలకు విలన్ గా ఉన్న రుద్రమనాయుడు(కోట)కి ఎలా బుద్ది చెప్పాడు అన్న విషయాలు తెరపై చూడాల్సిందే.

    కథ గా చూస్తే మనకు గతంలో వచ్చిన చాలా సినిమాలు కళ్ళ ఎదురుగా కనిపిస్తాయి. అంతేగా రాబోయే సీన్స్ ముందే తెలిసిపోతూంయాయి. అయితే కథ చాలా ప్రిడెక్టుబుల్ గా ఉన్నా,ఫన్ తో దాన్ని అధిగమించే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా పూర్తి ట్రీట్ మెంట్ మీద ఆధారపడిన చేసిన ఈ స్క్రిప్టు లో కామెడీ సీన్స్ కు పెద్ద పీట వేసారు. స్లాప్ స్టిక్ కామెడీ, పంచ్ కామెడీ తో ఉన్న ఈ సీన్స్ బాగానే నవ్విస్తాయి. అయితే ఎంత నవ్వుకున్నా కథలో కాస్త ఈ కాలం వాతావరణం తెస్తే బాగుండేదనిపిస్తుంది. అలాగే చాలా చోట్ల శ్రీను వైట్ల తరహా కామెడీని గుర్తు చేస్తూంటుంది. ముఖ్యంగా బ్రహ్మానందం,విష్ణు మధ్య వచ్చే సీన్స్ లో శ్రీను వైట్ల ప్రభావం కనిపిస్తుంది. బంగార్రాజు గా బ్రహ్మానందం ఈ సినిమాకు పూర్తి బలం. సినిమాలో లాజిక్ లు లేకపోయినా బోర్ కొట్టకుండా లైటర్ వీన్ కామెడీతో సాగుతూ ఓకే అనిపిస్తుంది.

    నటినటుల్లో విష్ణు బాగానే చేసారు. సీనియర్స్ సుమన్,సీత,ప్రభు,కోట కొత్తదనం ఏమీ లేదు...అలాగే కొత్తగా వాళ్లు చేయటానికీ పాత్రల్లో ఏమీ లేదు. హన్సిక గ్లామర్ గా నిండుగా కనిపించింది. డైలాగ్స్,స్క్రీన్ ప్లే ఇలాంటి రొటీన్ కథలకు కత్తి మీద సామే. దాన్ని సమర్ధవంతంగానే నిర్వహించారు. అయితే పంచ్ డైలాగులు మరింత షార్ప్ గా ఉంటే బాగా పేలేవి. అలాగే కథలో మరింత ఎమోషన్ బిల్డప్ అయి ఉంటే సినిమాకు మరింత డెప్త్ వచ్చి ఉండేది. అలాగే టెన్షన్ ఎలిమెంట్ కూడా కథలో ఏమీ ఉండదు. దర్సకుడుకి సీమ శాస్త్రి రేంజి సినిమా మాత్రం కాదు. పాటల్లో రెండు బాగున్నాయి. నిర్మాణ విలువలు బ్యానర్ ఇమేజ్ కు తగ్గట్లే ఉన్నాయి. మిగతా సాంకేతిక అంశాలైన ఎడిటింగ్, కెమెరా అద్బుతం కాదు కానీ ఈ సినిమాకు బాగానే అమిరాయి.

    ఫైనల్ గా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే గత విష్ణు సినిమాలు కన్నా మెరుగు అనిపిస్తుంది. అయితే విష్ణు చెప్పినంతగా ఢీ సినిమా తో పోల్చలేము. కానీ కాస్సేపు నవ్వుకోవటానికి ఈ సినిమా మంచి ఆప్షనే.

    English summary
    
 
 Manchu Vishnu's Denikaina Ready relesed with average talk. It's an comedy film directed by G.Nageswara Reddy and produced by Mohan Babu. The film features Vishnu Manchu and Hansika Motwani in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X