twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోడి మార్కు గుడ్డు చిత్రం

    By Staff
    |

    Devi Puthrudu
    చిత్రం: దేవీపుత్రుడు
    నటీనటులు: వెంకటేష్‌, సౌందర్య, అంజలాజవేరి
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: ఎం.ఎస్‌.రాజు
    దర్శకత్వం: కోడి రామకృష్ణ

    అమ్మోరుతో తెలుగులో గ్రాఫిక్స్‌ కింగ్‌ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ దేవీపుత్రుడులోనూ గ్రాఫిక్స్‌ తో మంత్రముగ్ధులను చేశాడు. సింపుల్‌ కథకు అద్భుతమైన గ్రాఫిక్స్‌ జోడించి తీశాడు. వెంకటేష్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం దైవశక్తి ఉందని నిరూపించే చిత్రం. ఊహాజనితమైన ద్వారకా నగరాన్ని క్రియేట్‌ చేయడంలోనూ, గ్రాఫిక్స్‌ లలో కొంచెం పరిపక్వత ఈ చిత్రంలో కనిపిస్తుంది. సోషయో-మిథికల్‌ ఫాంటసీ చిత్రం ఇది.

    కథ ప్రకారం వెంకటేష్‌ రెండు పాత్రలు పోషిస్తాడు. బలరాం(వెంకటేష్‌) ఆర్కియాలిజిస్ట్‌. సముద్రంలో మునిగిపోయిందని భావిస్తున్న ద్వారకా నగరం ఆనవాళ్ళు కోసం పరిశోధన సాగిస్తుంటాడు. మరోవైపు కృష్ణ అనే వెంకటేష్‌ దొంగతనాలు చేస్తు కాలం గడుపుతుంటాడు. దైవభక్తి అధికంగా గల తన అక్క సౌందర్యను వెతుక్కుంటూ అంజలా జవేరి ద్వారకా నగరం బయలుదేరుతుంది. ఆర్కియాలజిస్ట్‌ బలరాంతో సౌందర్య ప్రేమలో పడుతుంది. పెళ్ళికూడా చేసుకుంటుంది. ప్రతి అమవాస్య నాడు సముద్రంలో పెద్ద సుడిగండంలాంటిది తిరుగుతుంటుంది. దైవాన్ని నమ్మని బలరాం దీనికి సైంటిఫిక్‌ రీజన్స్‌ కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో అతనికి దైవశక్తిగల ఓ పెట్టె దొరుకుతుంది. పురాణం ప్రకారం ప్రపంచం మునిగిపోకుండా శ్రీకృష్ణుడు మహాశక్తితో నిండిన ఈ పెట్టెను సముద్రంలో వదులుతాడు.

    ఈ మహత్యం తెలుసుకున్న బలరాం దాన్ని మళ్ళీ సముద్రంలోనే జారవిడిచేందుకు ప్రయత్నిస్తుండగా ఓ అంతర్జాతీయ మాఫియాకు చెందిన కొంతమంది వెంకటేష్‌ ను చంపేస్తారు. అలాగే గర్భవతి అయిన సౌందర్యను హింసించి కడుపులో ఉన్న పసికందును చంపేస్తారు. ఇక దొంగతనాలు చేసే కృష్ణ చనిపోయిన పాప ఆత్మ సాయంతో ఈ దుండగుల వివరాలను తెలుసుకుంటాడు. అలాగే తనకు ఎన్నో అతీత శక్తులు ఉన్నాయని గ్రహిస్తాడు(దేవీ పుత్రుడు అన్న పేరు అందుకే అన్నమాట). చివరకు ఆ పెట్టెను చేజిక్కించుకొని సౌందర్యను కాపాడడంతో సినిమా ముగుస్తుంది.

    రెండు పాత్రల్లోనూ వెంకటేష్‌ నటన బావుంది. అయితే సౌందర్య, అంజలా జవేరిల పాత్రలు కేవలం పాటలు పాడుకోవడానికి మాత్రమే. ప్రథమార్థం నీట్‌ గా సాగిన కథనం సెకెండ్‌ హాఫ్‌ లో అనవసరమైన 'యాక్షన్‌' జోడించడంతో ద్వితీయార్థం కొంచెం అనీజీగా ఉంటుంది. పాటలు వినడానికి బాగాలేకపోయినా చూడడానికి బావున్నాయి. ఫోటోగ్రఫీ, గ్రాఫిక్స్‌ కోసం ఈ సినిమాను చూడొచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X