Don't Miss!
- News
కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ వారసుడు భేటీ: బీఆర్ఎస్లో..!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Dhagad Saamba Review సంపూర్ణేష్ బాబు మూవీ ఎలా ఉందంటే?
Rating: 2/5
ధగడ్ సాంబ (సంపూర్ణేష్ బాబు) తన స్నేహితుడు పీకే (మహబూబ్ బాషా)తో కలిసి హైదరాబాద్‌లోని ఓ ఇంటిలో అద్దెకు దిగుతారు. ఇంటి యజమానులు (అప్పారావు, జ్యోతి) కూతుళ్లతో ప్రేమలో పడుతారు. అంతా సవ్యంగా జరిగిపోతుందని అనుకొన్న సమయంలో ఇంటిలోని నలుగురు రెండేళ్ల క్రితం చనిపోయి దెయ్యాలుగా మారారనే విషయం తెలుస్తుంది.
Recommended Video

హైదరాబాద్‌కు ధగడ్ సాంబ ఎందుకు వచ్చాడు? ధగడ్ సాంబ గత జీవితం ఏమిటి? తన తల్లికి, తన కుటుంబానికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? ఇంటి యజమానులు నిజంగానే దెయ్యాలుగా మారారా? ఇంటి యజమానులు దెయ్యాలు అనే విషయం తెలిసిన ధగడ్ సాంబ ఏం చేశాడు? రియల్ ఎస్టేట్ మాఫియాపై ధగడ్ సాంబ ఎలాంటి పోరాటం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే ధగడ్ సాంబ చిత్ర కథ.

హృదయ కాలేయం సినిమాతో లభించిన సెటైరికల్ అంశాలతోనే ధగడ్ సాంబ సినిమా కథ ప్రారంభమవుతుంది. సంపూర్ణేష్ బాబు బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, మేనరిజం, ఫైట్స్‌తో రొటీన్‌గా కథ ముందుకు సాగుతుంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఇంటి యజమానులు, తమ లవర్స్ దెయ్యాలు అనే ట్విస్టుతో సెకండాఫ్‌తో ఆసక్తి పెరుగుతుంది. అయితే సెకండాఫ్‌లో కూడా కథ, కథనాలు రొటీన్‌గా అనిపిస్తాయి. కాకపోతే పాటలు, డ్యాన్సులు కొంత ఫీల్'గుడ్‌గా ఉండటంతో క్లైమాక్స్‌లోనైనా ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా అనే వారికి నిరాశే మిగులుతుంది. ధగడ్ సాంబ రొటీన్ సంపూ మార్కు చిత్రంగానే మార్కులు వేసుకొన్నదనిపిస్తుంది.
ధగడ్ సాంబలో సంపూ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. పాటలు, ఫైట్స్, డైలాగ్స్, మేనరిజాలతో ఎప్పటి మాదిరిగానే ఆసక్తికరంగా కనిపిస్తాడు. కథలో పస లేకపోవడం, కథనం ఆసక్తికరంగా ఉండకపోవడంతో సంపూ చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదనిపిస్తుంది. కరెక్ట్ కథ పడితే సంపూ చెలరేగిపోతాడనేది ఆయన అభిమానుల్లో ఓ ఫీలింగ్ ఉంటుంది. ఆయన దిశగా అడుగులు వేస్తే.. సగటు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచే హీరోగా మారే అవకాశం ఉంది.
మిగితా క్యారెక్టర్ల విషయానికి వస్తే.. సోనాక్షి వర్మ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపింది. జ్యోతి, అప్పారావు కామెడీ నాసిరకంగా ఉంది. అప్పారావుతో హాస్యం అపహాస్యంగా మారిందనే ఫీలింగ్ కలుగుతుంది. మెహబూబ్ బాషా కామెడీ టైమింగ్ బాగుంది.
దర్శకుడు ఎన్ఆర్ రెడ్డి విషయానికి వస్తే.. ఒక మంచి సస్సెన్స్ థ్రిల్లర్‌కు కావాల్సిన అంశాలను ఎంచుకొన్నాడు. దర్శకుడు ఎత్తుకొన్నబేసిక్ పాయింట్‌లో హిట్ సినిమాకు కావాల్సిన సరుకు ఉందనిపిస్తుంది. కథ, కథనాలపై సరైన కసరత్తు చేస్తే.. ఆనందోబ్రహ్మ లాంటి సినిమాను రూపొందించే అవకాశం ఉండేది. నాసిరకమైన కామెడీ, పేలవమైన స్క్రీన్‌పైతో మంచి అవకాశాన్ని చేజార్చుకొన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతిక విషయాలకు వస్తే.. ధగడ్ సాంబ సినిమా వరకు మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ జీ ఆకట్టుకొంటాడు. అతడు అందించిన పాటలు మంచి జోష్‌తో సాగుతాయి. పాటలకు తగినట్టే డ్యాన్సులను కొరియోగ్రాఫర్ బాగా వర్క్ చేశాడు. ముజీర్ మాలిక్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ పాపారావు తన వంతు కృషి చేయడంలో సఫలమయ్యారు. ఫస్టాఫ్ ఆరంభంలో కొన్ని సీన్లు, సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలపై నిర్ధాక్షిణ్యంగా కత్తెర వేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.
సంపూ మార్కు కామెడీ, యాక్షన్ అంశాలు కలబోసిన చిత్రం ధగడ్ సాంబ. మంచి పాయింట్‌తో తెరకెక్కించాల్సిన ప్రయత్నం సఫలం కాలేదనిపిస్తుంది. సంపూ తరహా కామెడీ, యాక్షన్ సినిమాలను ఆదరించే వారికి ధగడ్ సాంబ నచ్చుతుందేమో.